తెలంగాణలో అంతకంతకు బలపడుతోన్న కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసిందా…? తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే చర్యలకు కేంద్రంలోని బీజేపీ ఉపక్రమించబోతుందా..? ఒక్క నిర్ణయంతో బీఆర్ఎస్ తో తమకు దోస్తీ లేదని చెప్పడమే కాకుండా, కాంగ్రెస్ గ్రాఫ్ ను బీజేపీ నేలమట్టం చేయాలని చేయనుందా..?
ఇప్పుడు ఈ అంశాలపైనే కాంగ్రెస్ నేతలు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటిసులు వచ్చిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఆమె విచారణకు హాజరు కానున్నారు. విచారణ పేరుతో ఆమెను అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో తమకు ఎలాంటి మైత్రి లేదని చెప్పేందుకు కవిత అరెస్ట్ దోహదం చేస్తోందని తెలంగాణ బీజేపీ నేతలు అగ్రనేతలకు చెప్పినట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ – బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగా కవితను కొద్ది రోజులపాటు అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కవిత అరెస్ట్ తో బీఆర్ఎస్ పై బీజేపీ పోరాడుతున్నట్లు సంకేతాలు పంపడమే కాకుండా, పలువురు బీఆర్ఎస్ వ్యతిరేకుల్ని తమవైపు మలుపుకోవచ్చుననేది బీజేపీ వ్యూహంగా చెప్పుకొస్తున్నారు.అలాగే , అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు ఇస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతుగా ఉంటామని బీఆర్ఎస్ ప్రామిస్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోన్న వేళ.. కవిత అరెస్ట్ ను రాజకీయ అస్త్రంగా బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుందనే సందేహాలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. కేంద్రంపై పోరాడుతున్నందుకే తమ పట్ల కుట్రలు చేస్తున్నారని కవిత అరెస్ట్ ను ఎన్నికల్లో సెంటిమెంట్ అస్త్రంగా ఉపయోగించుకునేలా ప్లాన్ రెడీ ఉండొచ్చునని చెబుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ తరువాత.. కేసీఆర్ అవినీతిపై సీబీఐని కూడా రంగంలోకి దింపే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల నాటికీ కేసీఆర్ అవినీతిపై సీబీఐని రంగంలోకి దింపితే బీఆర్ఎస్ కు సానుభూతి కలిసి వస్తుందని… అదే సమయంలో తమ ప్రధాన శత్రువు కాంగ్రెస్ ను అధికారానికి దూరం చేయవచ్చుననేది బీజేపీ అగ్రనేతల ప్లాన్ అయి ఉండొచ్చునని అ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఇదంతా క్విడ్ ప్రోకోలో భాగంగా జరుగుతాయని… పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక బీజేపీతో కేసీఆర్ దోస్తీ కంటిన్యూ చేసే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు.
Also Read : కేసీఆర్ పరిస్థితి ఇలా అవుతుందేంటి..?