కర్ణాటక ఎన్నికలను బీజేపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంటోంది. అక్కడ ఎలాగైనా నెగ్గాలని టార్గెట్ పెట్టుకుంది. కర్ణాటకలో ఓడితే ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుంది. అందుకే కర్ణాటకలో అధికారాన్ని మళ్ళీ కైవసం చేసుకొని తీరాలని హైకమాండ్ భావిస్తోంది.
అయితే కర్ణాటకలో బీజేపీ గెలుపు అంత ఈజీ కాదని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ పార్టీ ఓటమి ఖాయమని కీలక నేతలు సైతం కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అక్కడ కాంగ్రెస్ భారీగా పుంజుకొని అధికారం దిశగా పరుగులు పెడుతోంది. పలు ఒపినియన్ పోల్స్ లోనూ కాంగ్రెస్ దే అధికారమని స్పష్టం చేశాయి.
దీంతో బీజేపీ అధినాయకత్వం కర్ణాటకపై మరింత ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. ఎట్టిపరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోవద్దని.. ఇందుకోసం ఎలాంటి మార్గాలు ఉన్నాయో హైకమాండ్ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికల్లో ఏపీ అధికార పార్టీ నేతల సహాయాన్ని బీజేపీ కోరుతున్నట్లు ప్రచారం ఉదృతంగా సాగుతోంది.
తాజాగా కేంద్రహోం మంత్రి అమిత్ షా భేటీతో అయిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఆయన కీలక బాధ్యతలు కట్టబెట్టారని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు వారు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపుకు దోహదం చేసేలా పని చేయాలనీ జగన్ ను కోరినట్లు చెబుతున్నారు.
ఏపీలో మీ గెలుపుకు దోహదం చేయాలంటే కర్ణాటకలో మాకు సహాయం చేయాలని అమిత్ షా జగన్ కు చెప్పినట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం మొదట కర్ణాటక ఎన్నికల్లో ఆర్థికంగానే కాకుండా ప్రచారం పరంగా సాయపడాలని కనీసం 100నియోజకవర్గాల్లో విజయం దక్కించుకునేలా వ్యూహాలు రెడీ చేసి తమకు అందజేయాలని అమిత్ షా నిర్దేశించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
వచ్చే ఏపీ ఎన్నికల్లో బీజేపీ సాయం లేకుండావైసీపీ నెగ్గే పరిస్థితి ఉండదని నిర్ణయానికి ఆ పార్టీ వచ్చిందనే వార్తల నేపథ్యంలో అమిత్ షా కండిషన్ ను జగన్ అంగీకరించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. దీంతో వైసీపీ అధినేత ఏం చేస్తారనే చర్చ సాగుతోంది.
Also Read : జగన్ కు ఉండవల్లి శ్రీదేవి రిటర్న్ గిఫ్ట్ – ఏంటో తెలుసా..?