పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కాగానే బీజేపీ శిబిరంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. పవన్ టీడీపీతో వెళ్తే బీజేపీకి ఇబ్బంది అవుతుందని ఆయన్ను పచ్చ పార్టీ వైపు వెళ్ళకుండా ప్రయత్నాలు చేస్తోంది. తమతో ఉంటే సీఎంను చేస్తామని చంద్రబాబుతో వెళ్తే ఎప్పటికీ సీఎం కాలేరనే సందేశాన్ని ఏపీ బీజేపీ నేతలు వినిపిస్తున్నారు.
ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు. సీట్లు లేవు. ఇక పవన్ ను సీఎంను ఎలా చేస్తారని సందేహాలు ఉండొచ్చు. అందుకే తాము తలచుకుంటే రాజకీయం ఎలా ఉంటుందోనని సంకేతాలు పంపుతున్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే ఎంతసేపో పట్టదని చాలా ఉదాహరణలు చెబుతున్నారంటున్నారు.
ఏపీలో కాపులకు సీఎం పదవి రావాల్సి ఉందని..పవన్ కళ్యాణ్ టీడీపీతో వెళ్తే అది ఎలా సాధ్యమని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సీఎం పదవిని త్యాగం చేసి పవన్ కళ్యాణ్ ను సీఎం చైర్ లో కూర్చోబెడతారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ పాలనపై విసుగెత్తి ఏపీ ప్రజలు జగన్ కు అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు జగన్ పై వ్యతిరేకత ఉన్నందున మరోసారి టీడీపీకి ప్రజలు ఎలా పట్టం కడుతారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
పంజాబ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలని పవన్ కు ఉదాహరణలు సూచిస్తున్నారు. పంజాబ్ లో బీజేపీ, అకాలీ కూటమి, కాంగ్రెస్ పార్టీల మధ్య అధికారం మారుతూ వచ్చింది. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీలను అక్కడి ప్రజలు తిరస్కరించారు. ప్రత్యామ్నాయ పార్టీ ఆప్ కు అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు ఏపీలోనూ అవే పరిస్థితులు ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.
టీడీపీతో కలిసి సాగితే పవన్ ఎప్పటికీ సీఎం కాలేరని చెప్తూనే.. ఆయనకు సీఎం పదవిని బీజేపీ ఆఫర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Also Read : టీడీపీ – జనసేన పొత్తు కుదిరినట్లే..!?