తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో గెలుపొంది వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలనీ బీజేపీ భావిస్తోంది. కాని బీజేపీకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కాంగ్రెస్ ఇదివరకులాగా బలహీనంగా లేదు. బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని మట్టి కరిపించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దీంతో తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి.
పొరపాటున ఈ తొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క రాష్ట్రంలో ఓడినా…లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపడం కష్టమే. కాంగ్రెస్ మెజార్టీ రాష్ట్రాల్లో విజయం సాధిస్తే బీజేపీ పతనం మొదలైనట్లే. కాబట్టి..ఈ తొమ్మిది రాష్ట్రాల్లో గెలిచేందుకు బీజేపీ పక్కా ప్లాన్ చేస్తోంది.
ఇప్పుడు బీజేపీ టార్గెట్ ఒకటే. ఈశాన్య రాష్ట్రాలతోపాటు కర్ణాటక , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడంతోపాటు చత్తీస్ ఘడ్ , రాజస్తాన్, తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం ఫుల్ ఫోకస్ చేస్తోంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. తేడా వచ్చి ఒక్క రాష్ట్రంలో నిరాశాజనకమైన ఫలితాలు వచ్చినా అది లోక్ సభ ఎన్నికలపై ఇంపాక్ట్ చూపిస్తాయి.
అందుకే ముందుగానే బీజేపీ గెలుపు వ్యూహాలను రూపొందిస్తోంది. యుద్దమేఘాలను సృష్టించాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించుకుంటే చేతులేత్తేసినా మోడీ సర్కార్.. ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని యుద్దవిన్యాసాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
అందులో భాగమే తాజాగా చైనా అద్యక్షుడి జిన్ పింగ్ వ్యాఖ్యలు ఉన్నట్లు తెలుస్తోంది. లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న పీపుల్ లిబరేషన్ ఆర్మీతో జిన్ పింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ..యుద్దానికి సిద్దంగా ఉన్నారా..? అని ప్రశ్నించడం చర్చనీయాంశం అవుతోంది.
మోడీ రాజకీయాలను ఓ కంటకనిపెడుతోన్న చైనా.. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలున్నందున తమతో వార్ కు భారత ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉందని జిన్ పింగ్ అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ఆర్మీని చైనా అద్యక్షుడు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.
అధికారంలోకి వచ్చేందుకు చైనాను బూచిగా చూపి బలపడాలనేది బీజేపీ ఎత్తుగడ కావొచ్చునని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో దేశభక్తి భావాలను రెచ్చగొట్టి మిగతా రాష్ట్రాల్లోనూ అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తూ ఉండొచ్చు. గతంలో 2019ఎన్నికల సమయంలో పుల్వామా అటాక్ విషయంలో మోడీ సర్కార్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అదంతా ఎన్నికల కోసమే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు కూడా ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని సరిహద్దులను రక్తమోడేలా చేసి ఓట్లను రాల్చుకోవాలనేది మోడీ ఎన్నికల వ్యూహంగా చెబుతున్నారు.