టీఎస్ పీస్సీ పేపర్ లీక్ తోపాటు టెన్త్ పేపర్ లీక్ వెనక బీజేపీ హస్తముందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ ను అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ ఈ విధమైన కుట్రకు తెరలేపిందని సామజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పేపర్ లీక్ చేసిన నిందితులు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కు అత్యంత సన్నిహితులు కావడంతో పేపర్ లీక్ వెనక బీజేపీ కుట్ర ఉందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.
వికారాబాద్ పేపర్ లీక్ నిందితుడు బీజేపీ మనిషే.?
పదో తరగతి తెలుగు పేపర్ లీక్ చేసిన కేసు నిందితుడు సంబుర్ బందెప్పకు బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బందెప్ప తాండూర్ పట్టణం-1ఉన్నత పాఠశాలలో బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఆయన వివాదాస్పద వ్యక్తిగానే ఉన్నారు. గతంలో ఇదే పాఠశాలలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఓ విద్యార్ధిని వేధించిన వ్యవహారంలో ఆయనపై ఫోక్సో కేసు కూడా నమోదైంది. ఇలాంటి చరిత్ర కల్గిన బందెప్ప అయితే పేపర్ లీక్ కు సెట్ అవుతాడని భావించి బీజేపీ నాయకులు అధిష్టానం ఆదేశంతో బందెప్పతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాన్ని లీక్ చేస్తే దానిని సామజిక మాధ్యమాల్లో వైరల్ చేసి తెలంగాణ సర్కార్ ను అబాసుపాలు చేయాలనేది బీజేపీ ప్లాన్. ఈమేరకు ప్రశ్నాపత్రాలను బయటకు తీసి పంపడంలో ప్రావీణ్యం కల్గిన బందెప్పతో ఈ కుట్రను విజయవంతంగా అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టెన్త్ తెలుగు పేపర్ ను ఫోన్ లో ఫోటో తీసి వాట్సప్ లో తన మిత్రుడికి పంపడంతో అతను బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. ఇలా బీఆర్ఎస్ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు పేపర్ లీక్ వ్యవహారాన్ని వాడుకోవాలని బీజేపీ చూసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
వరంగల్ పేపర్ లీక్ వ్యవహారం బీజేపీ కనుసన్నలోనే..?
కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల నుంచి హిందీ పేపర్ లీక్ అయింది. ఓ మైనర్ బాలుడు తన స్నేహితుడు కోసం హిందీ పేపర్ ను ఫోటో తీసి వాట్సప్ లో పెడితే అది మాజీ రిపోర్టర్ ప్రశాంత్ అనే బీజేపీ నాయకుడు కంటపడింది. అతను మీడియా గ్రూప్ లో పోస్ట్ చేసి వైరల్ చేశాడు. 10: 45కు అన్ని గ్రూపుల్లో కి వెళ్ళింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు 11:30కు హిందీ పేపర్ వెళ్లింది. ఈ పేపర్ లీక్ జరిగిన సమయంలో ప్రశాంత్ 2గంటల వ్యవధిలోనే 142 ఫోన్ కాల్స్ మాట్లాడారు. పరీక్షల వ్యవస్థ సరిగా లేదని చెప్పేందుకు ఉద్దేశపూర్వకంగానే ప్రశాంత్ పని చేసినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ మీడియా సమావేశంలో తెలిపారు. వ్యక్తిగతంగా ప్రశాంత్ కు పరీక్షల వ్యవస్థ సరిగా లేదని చెప్పే అవసరం లేదు. రాజకీయంగా ఆయన పెద్ద నేత కూడా కాదు. కాబట్టి ప్రశాంత్ పై బీజేపీ నేతల ఒత్తిళ్ళు ఉన్నాయని.. వారి డైరక్షన్ లోనే హిందీ పేపర్ తన కంట పడగానే పోలీసులకు సమాచారం అందించకుండా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లు అనుమానిస్తున్నారు.
టీఎస్ పీస్సీ పేపర్ లీక్ లోనూ బీజేపీ ప్రమేయం..?
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ మనిషేనని నిర్దంద్వంగా తేలింది. దీంతో టీఎస్‌పీఎస్సీ లో కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన వెనుక బీజేపీ కుట్ర దాగి ఉన్నదనే సందేహం మరింత బలపడుతున్నది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్ బీజేపీ సోషల్ మీడియాలో చురుకైన వ్యక్తిగా ఉన్నాడు. ‘బీజేపీకి ఓటెయ్యాలి, కిషన్‌రెడ్డిని గెలిపించాలి’ అని రాజశేఖర్ పెట్టిన పోస్టింగ్ క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. టీఎస్‌పీఎస్సీలో రాజశేఖర్ సిస్టమ్ అడ్మిన్‌గా పనిచేస్తున్నాడు. కంప్యూటర్ హ్యాక్ చేసి క్వశ్చన్ పేపర్లు తస్కరించినట్లు తెలుస్తోంది.
టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో బీఆర్ఎస్ సర్కార్ పై ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యామని భావించిన బీజేపీ.. ఇదే అదునుగా టెన్త్ పేపర్ లు కూడా లీక్ చేస్తే ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకొని పార్టీని పటిష్టం చేసుకోవచ్చునని ఆలోచన చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read : టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వెనక బండి సంజయ్ హస్తం..?