కొద్దీ రోజుల వరకు కేంద్రంలో బీజేపీదే అధికారమని ఆ నోటా, ఈ నోటా వినిపించింది. రోజులు గడిచే కొద్దీ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. బీజేపీ 400సీట్లు ఖాయమని చెబుతున్నా అదేమంత ఈజీ కాదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టేందుకు చెమటోడ్చాల్సిందే. గతంలోలా ఈజీగా గెలుస్తామన్న నమ్మకం బీజేపీ అగ్రనేతల్లో ఎంతమాత్రం కనిపించడం లేదు.
సౌత్ లో 132 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఏపీలో పొత్తు వలన ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం చూపగలదు. కానీ కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. ఓవరాల్ గా సౌత్ లో ఇండియా కూటమి అత్యధిక సీట్లను గెలుచుకోనుంది. నార్త్ విషయానికి వస్తే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ , ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లో ఇండియా కూటమి అత్యధిక సీట్లను గెలుచుకోనుంది. నిన్నటి వరకు యూపీ, మధ్యప్రదేశ్ , రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ క్లిన్ స్వీప్ చేస్తుందని నమ్మకంగా ఉన్నప్పటికీ అక్కడ కూడా ఇండియా కూటమి కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
రామ మందిర నిర్మాణం ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకోవాలని భావించినా అది సాధ్యం అయ్యేలా ఉంది. అందుకే ఇండియా కూటమిలో బలమైన భాగస్వామిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్నికల ముంగిట అరెస్ట్ చేసి.. కాంగ్రెస్ కూటమికి అవినీతి మరకలను మరింత పూయాలనే వ్యూహం పన్నినట్లుగా తెలుస్తోంది. బీజేపీ రాజకీయంలో భాగంగా ఈ అరెస్ట్ చేసినా అది భూమ్ రాంగ్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. కేజ్రీవాల్ పై సానుభూతి పవనాలు వీస్తే బీజేపీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది.
బీజేపీ 400 సీట్ల లెక్క చెప్తున్నా జనాలను మోటివేట్ చేసేందుకు తప్ప గెలుపుపై ధీమాతో కాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనాల్లో ఓ రకమైన ఆలోచనను నింపేందుకు ఇలాంటి స్టేట్ మెంట్స్ పాస్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ అది గెలుపు ధీమా కాదంటున్నారు ఎనలిస్టులు.
https://www.youtube.com/watch?v=JxSv_Oj-emA