లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఖాయమని ఢిల్లీ నుంచి విశ్వసనీయ వర్గాల ద్వారా పక్కా ప్రగతి భవన్ కు సమాచారం అందింది. శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం కవిత అరెస్ట్ ఖాయమని… మరికొంతమంది పార్టీ నేతలపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా ఉందని స్వయంగా కేసీఆరే స్పష్టం చేయడంతో… ఈవాళ కవిత అరెస్ట్ ఖాయమని అంత భావించారు. కానీ అందరూ అనుకున్నట్లుగా కవితను ఈడీ అరెస్ట్ చేయలేదు. కేసీఆరే అంత నిక్కచ్చిగా కవితను అరెస్ట్ జరుగుతుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పినా… ఆమె అరెస్ట్ జరగలేదంటే శుక్రవారం రాత్రంతా ఏం జరిగి ఉంటుందనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.
కవితకు బీజేపీ నుంచి ఆఫర్ ఉంది. ఈ విషయాన్ని స్వయంగా కవితతోపాటు కేసీఆర్ కూడా బయటపెట్టారు. పార్టీలో చేరేందుకు నిరాకరించడంతోనే కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరికించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. లిక్కర్ స్కామ్ ను ముందుంచి కవితను తెలంగాణలో ఎక్ నాథ్ షిండేను చేయలనుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ డైరక్షన్ లో పని చేయకపోవడంతోనే కవితను లక్ష్యంగా చేసుకొని ఆమెను వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు చేపట్టిన ఈడీ ఈ కేసులో కవిత ప్రమేయంపై అన్ని ఆధారాలు సేకరించింది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా రిమాండ్ రిపోర్ట్ లోనూ కవిత పేరును ఈడీ తాజాగా ప్రస్తావించింది. కవితే ఈ కేసులో కింగ్ పిన్ మరోసారి ఈడీ ఆరోపించింది. దీంతో శుక్రవారం ఈడీ విచారణ అనంతరం కవిత అరెస్ట్ తథ్యమని ఉదయమంతా ప్రచారం జరిగింది. కానీ ఆధారాలు ఏమి లేనట్టు..కవిత ప్రమేయం ఏమి లేనట్టు ఆమెను విచారించి బయటకు పంపించేయడంతో తెర వెనక ఏదో జరిగి ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసు నుంచి బయటపడేసేందుకు కవిత కేంద్ర పెద్దలతో ఒప్పందం చేసుకుందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరాలని బీజేపీ మొదట్లో చేసిన ఆఫర్ కు ఆమె తాజాగా ఒకే చెప్పారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ విధించిన ఈ షరతులకు కవిత ఒకే చెప్పడంతోనే ఈ కేసులో అరెస్ట్ నుంచి కవిత బయటపడగలిగిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ లో లభించిన ప్రాధాన్యతకు మించి బీజేపీలో గౌరవం ఉంటుందని కవితకు బీజేపీ నేతలు హామీ ఇచ్చారట. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు పదవిని ఆఫర్ చేశారన్న వాదనలు ఉన్నాయి. ఈ ఆఫర్ కు కవిత అంగీకరించడంతోనే అరెస్ట్ నుంచి కవిత సేఫ్ కాగలిగిందని అంటున్నారు.