రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులోనూ పరాభవమే ఎదురైంది. రాజకీయ విమర్శల కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ళ జైలు శిక్షను గుజరాత్ హైకోర్టు కూడా సమర్ధించింది. రాహుల్ కు విధించిన శిక్షపై స్టే విధించాలని రాహుల్ తరుఫు న్యాయవాదులు కోరినా హైకోర్టు నిరాకరించింది. రాహుల్ పై క్రిమినల్ కేసులు ఉన్నాయని దీనిని కూడా ఓ కారణంగా చెప్పుకొచ్చింది.
“రాహుల్ గాంధీపై పదికిపైగా క్రిమినల్ కేసులున్నాయి. ఆయనపై రాజకీయ విమర్శల కేసు నమోదయ్యాక కూడా రాహుల్ పై మరో కేసు నమోదైంది. వీర్ సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఆయన మనవడు ఫిర్యాదు చేశాడు. మొత్తంగా రాహుల్ ను ఎన్నికలకు దూరం చేయాలనే కుట్రకు రాజకీయనాయకులు ఓ పథకం ప్రకారం కుట్ర పన్నుతున్నారనేది అర్థం అవుతోంది.
సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్దించడంతో రాహుల్ పై అనర్హత వేటు కొనసాగుతుంది. ఈ కారణం చేత ఎనిమిదేళ్ళపాటు పోటీ చేయలేరు. ఇప్పుడు రాహుల్ కున్న ఏకైక ఆప్షన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అక్కడ కూడా రాహుల్ కు ప్రతికూల తీర్పు వస్తే మాత్రం ఆయన రెండేళ్ళ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఆ తరువాతబయటకొచ్చాక ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలి.
Also Read : రాహుల్ గాంధీ అంటే బీజేపీకి ఎందుకంత భయమో చదవండి