సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కోర్టు తీర్పుపై దాఖలైన పిటిషన్ ను జస్టిస్ బీఆర్ గవాయి , జస్టిస్ మనోజ్ మిశ్రా లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించి..సీబీఐని కంట్రోల్ లో ఉంచేలా ఆదేశించాలని వాదనలు వినిపించగా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి ఈ విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ తీర్పును సవాల్ చేస్తు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సిట్ అధ్వర్యంలోనే జరిగితేనే వాస్తవాలు బయటపడుతాయని.. సీబీఐకి అప్పగించవద్దని.. సీబీఐకి అప్పగిస్తే విచారణ అంత పక్కదారి పడుతుందని రాష్ట్ర ప్రభుత్వ తరుఫు న్యాయవాదులు దుష్వంత్ దవే, సిద్దార్థ్ లు ఈ నెల 7, 8 తేదీల్లో ప్రత్యేకంగా వాదనలు వినిపించారు.
వెంటనే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు కానీ స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.తదుపరి విచారణను శుక్రవారం (17వ తేదీ) నాటికి వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ జరిపి తదుపరి ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
Also Read : బర్త్ డే రోజునే కేసీఆర్ కు గండం..!