టీ-20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ కు ముందు టీమిండియా అభిమానులకు షాకింగ్ న్యూస్. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా టీమిండియా సారధి రోహిత్ శర్మ గాయపడగా..తాజాగా సూపర్ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ విన్నింగ్ గేమ్ ఆడుతోన్న విరాట్ కోహ్లీ సైతం గాయపడ్డాడు.
నెట్స్ లో బ్యాటింగ్ సాధన చేస్తుండగా విరాట్ కోహ్లీకి గాయమైంది. హర్షల్ పటేల్ బౌలింగ్ లో కోహ్లీ గాయపడటంతో నెట్స్ ను వీడాల్సి వచ్చింది. గురువారం సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ ను టీమిండియా డీకొనబోతోంది. అయితే, ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
అయితే, కోహ్లీ గాయం అంత తీవ్రమైనది ఏమి కాదని.. భయపడాల్సిన పనిలేదని ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని టీమ్ మేనేజ్ మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. రోహిత్ విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది.