తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల వాసనను ఏడేండ్ల కిందటే ఎమ్మెల్సీ కవిత పసిగట్టారా..? టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతారని కవితకు ముందే తెలుసా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.
తెలంగాణ జాగృతి అనే ఎన్జీవో సంస్థకు అదనంగా భారత్ జాగృతి ఫౌండేషన్ అనే సంస్థను కవిత ఏడేండ్ల కిందటే నెలకొల్పినట్లు తాజాగా తేలడంతో బీఆర్ఎస్ ఆవిర్భావం ముందస్తు వ్యూహమేననే వాదనలకు బలం చేకూరింది. ఈ కంపెనీకి కవిత, ఆమె భర్త అనిల్ ఇద్దరూ డైరక్టర్ లుగా వ్యవహరిస్తున్నారు. సాంస్కృతిక కార్యకలాపాలతో జాగృతి ప్రాచుర్యం పొందగా… భారత్ జాగృతి మాత్రం చారిటి సర్వీసులను అందించే లక్ష్యంతో ఆవిర్భవించింది.
Also Read : సొంత పార్టీ నేతలకు తలనొప్పులు తెచ్చిన కేసీఆర్..!
ఇటీవల కవిత మాట్లాడుతూ… సాహిత్యంతో సమాజాన్ని మేల్కొలిపెందుకు కృషి చేసిన రచయితలు, కవులకు వచ్చే ఏడాది నుంచి ఢిల్లీ వేదికగా భారత్ జాగృతి ఫౌండేషన్ ద్వారా పురస్కారాలను అందిస్తామని ప్రకటించారు. దాంతో తెలంగాణ జాగృతి అనబోయి, భారత్ జాగృతి అనేసిందా..? లేక టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో ఈ విధంగా కవిత వ్యాఖ్యానించిందా అని తరిచి చూస్తె భారత్ జాగృతి ఫౌండేషన్ పుట్టుక బయటకొచ్చింది. అయితే, ఎందుకీ సంస్థ పేరును రహస్యంగా ఉంచారన్నది హాట్ టాపిక్ గా మారింది.
2015 , నవంబర్ లో భారత్ జాగృతి ఫౌండేషన్ లక్ష కాపిటల్ షేరుతో ఏర్పాటైంది. ఇందులో కవితది 90%, భర్త అనిల్ 10% షేర్లతో ఇద్దరు డైరక్టర్ లుగా హైదరాబాద్ లోని దోమలగూడ అడ్రెస్ తో భారత్ జాగృతి ఫౌండేషన్ రిజిస్టర్ అయింది. ఒక్కో షేర్ విలువ 10గా ఖరారు చేయడంతో కవిత షేర్ 90,000, అనిల్ వాటా 10,000గా ఉన్నది. ఈ సంస్థ దోమలగూడలోని పాశం అమృతరాం బిల్డింగ్ లోని 301 ప్లాట్ ను అద్దెకు తీసుకుంది. నెలకు 40వేల చొప్పున అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నది. చాలా కాలంపాటు కవితకు పీఏగా పనిచేసిన రాజీవ్ సాగర్ పేరుతో ఈ లీజు ఒప్పందం కుదురుచుకున్నారు.
Also Read : సొంత పార్టీ ఎమ్మెల్యేలే కవితకు వెన్నుపోటు పొడిచారా..?
అయితే, ఈ సంస్థ పెద్దగా సేవా కార్యక్రమలేవి చేయకపోయినా 2019లో రూ.1.92కోట్ల మేర విరాళాలు వచ్చాయి. ఆ ఏడాది మార్చి చివరి నాటికీ సంస్థ ఖర్చులన్నీ పోగా 1.59కోట్ల ఆస్తులు నమోదు చేసుకుంది. 2020లో 5.80లక్షల విరాళాలు వచ్చాయి. కాని ఆ ఏడాది ఖర్చు అధిక మొత్తంలో ఏకంగా 1.36కోట్ల చూపించి, ఆ ఏడాది మార్చి చివరి నాటికీ 1.33కోట్ల నష్టంతో సంస్థ కొనసాగుతున్నట్లు రిపోర్ట్ ల ద్వారా వెల్లడైంది. చివరికీ 50.08 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. మొదట్లో ఖర్చులు వేలలో చూపించి దాని అమాంతం పెంచుకుంటూ వెళ్ళారు.