జోడో యాత్ర చేసిన తర్వాత రాహుల్ గాంధీలో చాలా మార్పు వచ్చింది. 52 ఏళ్ల అయన మునుపెన్నడూ లేనివిధంగా ఎంతో మేచ్యురిటితో తన మనసులోని మాటలను నిర్భయంగా చెపుతున్నారు. విదేశానికి చెందిన ‘ఇటాలియన్ మీడియా సంస్థ ‘కొరియర్ డెల్లా సెరా’ కు నిన్న ఇచ్చిన ఇంటర్ వ్యూ లో చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు.
‘మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?’ అని అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ పరోక్షంగా మోడిని టార్గెట్ చేశారు. భార్యా భర్తలు అంటే ఒకరి కష్టలల్లో మరొకరు పాలు పంచుకోవాలి, ఏ పదవి వచ్చినా తన నానమ్మ ఇందిరా గాంధీలా అనుకువగా ఉండాలి అన్నారు. కానీ పదవి రాగానే భార్యను 40 ఏళ్ల పాటు వదిలేసే భార్తలా ఉండకూడదు. ఆ భార్యకు కనీసం విడాకులు కూడా ఇవ్వకుండా పుట్టింటికి పంపివేయరాడు. గడ్డివాము కాడి కుక్కలా తాను సుఖపడకా, ఆమెను సుఖపడనీయక పోవడం మంచిది కాదు” అని పరోక్షంగా మోడిని టార్గెట్ చేశారు.
‘మీకు ఎలాంటి భార్య కావాలి?’ అని అడిగితే, తన నానమ్మలా ప్రేమగుణం, తన తల్లి సోనియాగాంధీ లా క్రమశిక్షణ ఉండే అమ్మయి కావాలని అన్నారు. అయితే పెళ్లి చేసుకోవాలనే తలంపు ఇప్పటివరకు తనకు రాలేదననీ, దానికి కారణం కూడా తనకు తెలియదు అన్నారు. అయితే తనకు పిల్లలు కావాలి అన్నారు. వాళ్ళను దత్తత తీసుకుని పెంచుకోవదనికా లేక రాజకీయ వారసులుగా మార్చడానికా అన్న క్లారిటి మాత్రం ఇవ్వలేదు.