టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ ను బీజేపీ మరింత ఇరుకున పెడుతోంది. ఈ ప్రశ్న పత్రాల లీకేజీకి మంత్రి కేటీఆర్ బాధ్యత వహిస్తూ పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కంప్యూటర్ల నిర్వహణ బాధ్యత ఐటీ శాఖదే కాబట్టి… ఐటీ మినిస్టర్ కేటీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రం కొనుగోలులో కీలక నిందితురాలు రేణుక…బీఆర్ఎస్ సర్పంచ్ కూతురు అని బీజేపీ కౌంటర్ ఎటాక్ ప్రారంభించగా అదే స్థాయిలో బీఆర్ఎస్ సమాధానం ఇస్తోంది.
టీఎస్ పీస్సీ మాజీ సభ్యుడు విఠల్ హయంలోనే ముగ్గురు నిందితులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగం పొందారని…ఈ లెక్కన టీఎస్ పీస్సీ పేపర్ లీకేజీ వెనక బీజేపీ నేతల హస్తం ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎందుకంటే..నాడు టీఎస్ పీస్సీ సభ్యుడిగానున్న విఠల్ నేడు బీజేపీలో కొనసాగుతున్నారు. బండి సంజయ్ కు ప్రధాన మద్దతుదారుడిగా ఉన్నారు. దాంతో ఈ పేపర్ లీకేజీ వెనక బీజేపీ ఉందనే ప్రచారాన్ని బీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చింది. పేపర్ లీకేజీ కేసులో A2గా నున్న రాజశేఖర్ బీజేపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నాడు. ఇతను బీజేపీ నేతలతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. దాంతో బండి – విఠల్ లు కలిసి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు రాజశేఖర్ – ప్రవీణ్ ల ద్వారా ఈ పేపర్ లీక్ ను ప్రోత్సహించి ఉంటారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్.
ఏఎస్. రావు నగర్ తన బంధువుల ఇంట్లో బండి – విఠల్ లు గత కొంతకాలంగా తరుచు భేటీ అవ్వడం ఈ పేపర్ లీకేజీ కోసమే కావొచ్చునని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
Also Read : బండి సంజయ్ కి కేటీఆర్ షాక్ – ధర్మపురి అరవింద్ కు గాలం…?