మీరేం చేస్తారో నాకు తెలియదు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి. ఇది ఆ మధ్య ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన మాట. బీఆర్ఎస్ ను గద్దె దించి కాంగ్రెస్ ను ఖతం చేసి గోల్కొండ ఖిల్లాపై కమలం జెండా రెపరెపలాడాలని టార్గెట్ నిర్దేశించారు షా. ఇందుకోసం కేంద్రం నుంచి ఎలాంటి సహకరమైన అందిస్తామని భరోసా కల్పించారు. ప్రతి అంశంలో బీఆర్ఎస్ ను ఇరుకునపెట్టేలా వ్యూహాత్మక రాజకీయాలు చేయాలని…అలాగైతేనే తెలంగాణలో టార్గెట్ రీచ్ అవుతాయని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశనం చేశారు షా.
అమిత్ షా కర్తవ్య నిర్దేశనం చేయడంతో బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్..టీఎస్ పీస్సీ లీక్ వ్యవహారం బయటకొచ్చాక టెన్త్ పేపర్ లీక్ కుట్రకు తెరలేపారా..?అనే సందేహాలు వస్తున్నాయి. అమిత్ షా అండ చూసుకొనే చెలరేగిపోవాలని బండి డిసైడ్ అయ్యారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎలాంటి కేసులు పెట్టినా కేంద్ర సర్కార్ అండగా ఉంటుందనే భరోసాను కేంద్ర పెద్దలు బండికి ఇవ్వడంతోనే పేపర్ లీక్ కుట్రకు బండి స్కెచ్ వేశారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ సర్కార్ ను అభాసుపాలు చేసేందుకు ఢిల్లీ వేదికగా కుట్రలకు తెరలేపుతున్నారని వాటిని రాష్ట్ర నేతలు అమలు చేస్తున్నారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో టెన్త్ పేపర్ లీక్ వ్యవహారాన్ని సునిశితంగా గమనిస్తే బీఆర్ఎస్ నేతల ఆరోపణలు అంత తేలిగ్గా కొట్టిపారేసేలా ఎంలేవు. ఎందుకంటే.. తెలుగు పేపర్ లీక్ చేసిన నిందితుడు బీజేపీ నేతలకు సన్నిహితుడు కాగా.. హిందీ పేపర్ లీక్ చేసిన మరో నిందితుడు ప్రశాంత్ కూడా బీజేపీ నేతలకు సన్నిహితుడని తెలుస్తోంది. దీంతో ఈ పేపర్ లీక్ ఉద్దేశ్యపూర్వకంగానే జరిగినట్లుగా పోలీసులు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. దాంతో బీజేపీ డైరక్షన్ లోనే పేపర్ లీక్ కుట్రకు ప్లాన్ చేసి ఉంటారని ఆరోపణలు వస్తున్నాయి.
అమిత్ షా ఇచ్చిన ధైర్యంతో రాష్ట్ర నేతలు పిల్లల భవిష్యత్ కు సంబంధించిన టెన్త్ పేపర్ లీక్ చేస్తారా అంటూ బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
Also Read : టెన్త్ పేపర్ లీక్ వెనక బీజేపీ హస్తం..?