దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చేందుకు తెలంగాణ గేట్ వే అవుతుందని ఆ మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పక్కా అధికారంలోకి వస్తామని… విజయం ఎలా సాధించాలో మా లెక్కలు మాకు ఉన్నాయంటూ అధికారంపై ధీమా వ్యక్తం చేశారు షా. పోటీ చేసేందుకు రాష్ట్రంలో బలమైన అభ్యర్థులే లేరని ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్ చెప్తుంటే.. అమిత్ షా మాత్రం అధికారం మాదేనని అంటున్నారు.
బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటున్న ప్రతిచోట హిందుత్వాన్ని రెచ్చగొడుతుంది. ఇది వాళ్ళ విధానం. ఎందుకంటే హిందుత్వాన్ని ఎంత రెచ్చగొడితే అంత ఓట్లు రాలుతాయనేది కమలనాథుల ధీమా. ఈ అస్త్రమే తెలంగాణలో బీజేపీకి అధికారం కట్టబెడుతుందని అమిత్ షా ఆలోచన కావొచ్చు. అందుకే ఆయన పై కామెంట్స్ చేసి ఉండొచ్చు. అందుకు తగ్గట్టుగా ప్రతి విషయాన్ని ఉపయోగించుకుంటుంది. తెలంగాణ బీజేపీ నేతలు కూడా హిందుత్వ కార్డును బలంగా వాడుతున్నారు. మునావర్ ఫరూకీ హైదరాబాద్ వచ్చినప్పుడు రచ్చ చేసి ప్రశాంతమైన నగరంలో అల్లర్లకు కారణమయ్యారు. ఇటీవల అరవింద్ ఇంటిపై జాగృతి కార్యకర్తలు దాడి చేస్తే.. అందులోనూ హిందుత్వాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. దేవుళ్ళ విగ్రహాలను , తులసి మొక్కలను ధ్వంసం చేశారాన్ని చెప్పుకొచ్చారు. ఇలా అంశం ఏదైనా హిందుత్వాన్ని రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారు.
Also Read : బైరి నరేష్ అలా మాట్లాడొచ్చా..?
హిందు దేవుళ్ళపై పొరపాటుగా నోరుజారిన రచ్చ, రచ్చ చేసే బీజేపీ నేతలు బైరి నరేష్ వ్యాఖ్యలపై మునుపటి స్థాయిలో అగ్రెసివ్ గా స్పందించడం లేదు. అయ్యప్ప స్వామిపై నరేష్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కాని ,మునుపటి వాగ్ధాటి కనిపించలేదు. హిందుత్వ సంఘాలు, రాజాసింగ్ మాత్రమే ఫైర్ అవుతున్నారు. టి. బీజేపీ కీలక నేతల నుంచి అగ్రెసివ్ రియాక్షన్ లేకపోవడానికి కారణం ఉందట. ఇదంతా వ్యూహంలో భాగంగా జరిగిందని అందుకే బీజేపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ కావడం లేదనే అనుమానాలు బలపడేలా రాజేష్ అనే వ్యక్తి సమాచారం ఉంది. ఇటీవల బండి సంజయ్ ను బైరి నరేష్ ను కలిసినట్లు కరీంనగర్ జిల్లా కమాలపూర్ కు సంబందించి రాజేష్ మాదిగ చెప్పడం సంచలనంగా మారింది. వారిద్దరూ కలిశారని చెప్తున్నాడు.వారిద్దరి భేటీలో ఏం మాట్లాడుకున్నారో తెలియదు కాని, ఈ సమావేశం ముగిసిన వారం రోజుల తరువాతే ఈ వివాదం రాజుకోవడం అనేక సందేహాలను లేవనెత్తుతోంది.
నోట్ : బైరి , బండి ల సమావేశంపై కమలాపూర్ కు చెందిన రాజేష్ మాదిగ నుంచి వచ్చిన సమాచారం ద్వారానే ఈ ఆర్టికల్ .
Also Read : బైరి నరేష్ ఇష్యూ : మరీ ఇంత నీచ రాజకీయాలా..?కేసీఆర్ ను మించిన సంజయ్