వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని వివేకా కూతురు సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డితోపాటు సీబీఐకి నోటిసులు జారీ చేసింది. గత విచారణ సమయంలో నోటిసులు జారీ చేసేందుకు కూడా నిరాకరించిన న్యాయస్థానం ఇప్పుడు నోటిసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. నెక్ట్స్ ఏం జరగబోతుందన్న ఉత్కంటను పెంచేసింది.
సోమవారం నాటి విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డి, సీబీఐకి నోటిసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికీ వేసవి సెలవులు పూర్తవుతాయి. ఈ కారణంగా వెకేషన్ బెంచ్ స్థానంలో ఈ పిటిషన్ పై సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడంపై గతంలోనూ ఓసారి తెలంగాణ హైకోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు… జూలై 3న జరిగే విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఎలా స్పందిస్తుందోనని అందరిలోనూ ఒకింత ఆసక్తి కనిపిస్తోంది.
తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో ప్రతి శనివారం అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు అవుతున్నారు. అరెస్ట్ భయం లేకపోవడంతో విచారణకు సహకరిస్తున్నట్లుగా సీబీఐ కార్యాలయానికి వెళ్లి వస్తున్నారు. ఇప్పుడు జూలై 3తేదీ గురించి అవినాష్ రెడ్డికి భయం మొదలై ఉండొచ్చు. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేస్తే సీబీఐ వెంటనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. చూడాలి ఎం జరుగుతుందో..!
Also Read : వివేకా కూతురు సునీత సైకిల్ ఎక్కుతారా..?