వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని కోర్టుకు తెలిపింది. శుక్రవారం అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అతని కోర్టులో శనివారం హాజరు పరిచింది. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్ట్ ను కోర్టుకు సీబీఐ సబ్మిట్ చేసింది. ఇందులో సంచలన విషయాలను ప్రస్తావించింది సీబీఐ.
వివేకా హత్య పథకం ప్రకారమే జరిగిందని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. వివేకా జరుగుతుందని తెలిసి అవినాష్ రెడ్డి , ఉదయ్ కుమార్ రెడ్డి, శివ శంకర్ రెడ్డిలు ఒకే చోట ఉన్నారని.. హత్య సమాచారం అందుకున్న వెంటనే అవినాష్ రెడ్డితో ఉదయ్ కుమార్ రెడ్డి ఘటనస్థలికి వెళ్ళాడని పేర్కొంది. ఆ తరువాత సాక్ష్యాలను తారుమారు చేశారని రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచింది. గూగుల్ టెక్ అవుట్ లో లొకేషన్ కు సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్లు పేర్కొంది.
వివేకాను మతమార్చగానే ఉదయ్ కుమార్ రెడ్డి తన తండ్రి ప్రకాష్ రెడ్డితో వివేకా డెడ్ బాడీకి కుట్లు వేయించాడని.. అవినాష్ రెడ్డికి ఉదయ్ అత్యంత సన్నిహితుడని సీబీఐ తెలిపింది. బాత్రూం నుంచి డెడ్ బాడీని బెడ్ రూమ్ లోకి ఉదయ్ కుమార్ రెడ్డే తీసుకొచ్చాడని.. వివేకా తలకు అయిన గాయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఇలా చేసి వివేకాది గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
ఉదయ్ కుమార్ రెడ్డి విచారణకు సహకరించడం లేదన్న సీబీఐ అతను పారిపోతాడనే అనుమానంతోనే అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ఉదయ్ ను విచారిస్తున్నామని మరికొంతమందిని కూడా అరెస్ట్ చేస్తామని సీబీఐ చెప్పింది. అంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనున్నారని అర్థం అవుతోంది. ఏ క్షణమైనా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.