వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు వెళ్ళే ముందు అవినాష్ రెడ్డి ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మతో సమావేశమయ్యారు. లోటస్ పాండ్ లోని షర్మిల నివాసానికి వెళ్లి విజయమ్మతో భేటీ అయ్యారు. ఏయే అంశాలపై మాట్లాడారో స్పష్టత లేదు కాని.. విజయమ్మను కలవడానికి వెళ్ళారని జగన్ అనుకూల మీడియా సాక్షి చెబుతోంది.
వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో వైఎస్ కుటుంబీకుల మధ్య విబేధాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నారని అందుకే ఆయనను కుటుంబ సభ్యులు దూరం చేసుకుంటున్నారని చెబుతున్నారు. షర్మిల కూడా ఇదే విషయమై జగన్ తో విబేధించారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి షర్మిల నివాసానికి వెళ్లి విజయమ్మతో సమావేశమవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉండగా..అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు సీబీఐ అధికారులకు షరతులు పెడుతూ లేఖలు పంపారు. తనపై ఓ వర్గం మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని..విచారణ పారదర్శకంగా జరగాలని తాను కోరుకుంటున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు.ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని కోరారు.
Also Read : సీబీఐ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డికి పిలుపు – అరెస్ట్ ఖాయమా..?
విచారణ సందర్భంగా తనతోపాటు ఒక న్యాయవాది వెంటే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. దీనిపై సీబీఐ అధికారులు ఏమన్నారో తెలియాల్సి ఉంది.
Also Read : పాదయాత్ర ప్రారంభం రోజే అపశృతి – టీడీపీలో నిర్వేదం