అవతార్ 1 ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సెకండ్ పార్ట్ ను కొనసాగించాడు దర్శకుడు.
నావిగా మరీనా జెక్ ( శామ్ వాషింగ్టన్ ), నావి రాణి నేయితిరి ( జో సల్దానా) పెళ్లి చేసుకొని, ముగ్గురు పిల్లలతో హ్యాపీగా పండోరా గ్రహంపై లైఫ్ ను కొనసాగిస్తారు. ‘ అవతార్ ‘ మొదటి పార్ట్ క్లైమాక్స్ లో కల్నల్ మెయిల్స్ ( స్టీఫెన్ లాంగ్ ) చనిపోయినట్టు చూపించారు కదా, ఇప్పుడు అతను నావిగా తిరిగి వస్తాడు. జెక్ మీద పగతో అతని చంపాలని నావిలుగా మారిన కొంతమంది సైన్యంతో పండోరా గ్రహంపై అడుగు పెడుతాడు. దాంతో కుటుంబాన్ని రక్షించుకునేందుకు జెక్ అడవులను వదిలి సముద్ర తీరానికి వెళ్తాడు. అక్కడ రీఫ్ అనే మరో తెగ ఉంటుంది. ఆ తెగ లీడర్ రోనాల్( కేట్ విన్స్ లెట్ ), ఆమె భర్త టోనోవరి ( క్లిప్ కర్టిస్) ఎలా సాయమందించారు..? జెక్ ను చంపాలనుకున్న కల్నల్ టార్గెట్ ఫినిష్ చేశారా..? కుటుంబ రక్షణ కోసం జెక్ ఏం చేశాడు..? అన్నది సినిమా కథాంశం. అయితే, ఈ కథలో భారీ ఆకారంలో కనిపించే చేప క్యారెక్టర్ ఏంటన్నది సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.
విశ్లేషణ : కొత్త కథతో రావడంతో అవతార్ సినిమా వండర్ గా నిలిచింది. కాబట్టి పదమూడేళ్ళ తరువాత సీక్వెల్ వచ్చినా ఈ సినిమాకు అదే ఆదరణ వస్తోంది. ఇక అవతార్ 2లో చెప్పుకోవాల్సింది విజువల్స్ గురించి. విజువల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు విజువల్స్ ను అదే రేంజ్ లో క్యారీ చేశాడు. కథ విషయానికి వస్తే.. అవతార్ ఫస్ట్ పార్ట్ చూసిన వారికీ సెకండ్ పార్ట్ లో కొత్తగా ఫీలయ్యేది ఏమీ ఉండదు.
అవతార్ లో నావిగా మారిన మనిషి మరో గ్రహానికి వెళ్ళడం , అక్కడ నావితో ప్రేమాయణం ప్రారంభం కావడం, అలా సాగుతుండగా ఉనికి కోసం పోరాటం చేయాల్సి రావడం కొత్తగా అనిపిస్తాయి. కాని సెకండ్ పార్ట్ లో నథింగ్ న్యూ అనిపిస్తుంది. అవతార్ లో పోరాటం ఫారెస్ట్ లో కొనసాగితే… ‘అవతార్ 2’లో మాత్రం పోరాటం సముద్రంలోకి మార్చేయడం కొత్తగా అనిపిస్తుంది. సముద్ర గర్భంలో విజువల్స్ సూపర్ ఉన్నాయి. టుల్‌కున్ ఫిష్ సన్నివేశాలు బాగానిపిస్తాయి. అవతార్ ఇచ్చిన హైఫీల్ కిక్ అవతార్ 2 ఇవ్వదు.
విజువల్స్ మినహా అంతకు మించి ‘అవతార్ 2’లో ఏమీ కొత్తగా లేదు. ‘అవతార్’ను దృష్టిలో పెట్టుకుని థియేటర్లకు వెళ్తే డిజప్పాయింట్ అవుతారు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే విజువల్స్ చూసి ఆనందిచోచ్చు. సినిమా రన్ టైం కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. విజువల్స్ అండ్ యాక్షన్ కోసం జేమ్స్ కామెరూన్‌కు హ్యాట్సాఫ్ చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
జేమ్స్ కామెరూన్ డైరెక్షన్
విజువల్స్
యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్
కొత్తదనం లేకపోవడం
సినిమా నిడివి
రేటింగ్ : 3/5