Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: ADMIN
కేటీఆర్ సోయిలేకుండా ఫస్ట్రేషన్ తో మాట్లాడారు : మంత్రి కేటీఆర్ తాను మంత్రి అనే సోయి లేకుండా కేవలం తిట్లు మాత్రమే చర్చలోకి వచ్చే విధంగా ప్రజా సమస్యలని పక్కన పెట్టి ఫస్ట్రేషన్ తో పిచ్చి వాగుడు వాగుతున్నారు. ఒక బజారు రౌడీ లా మాట్లాడుతున్నారు. కేటీఆర్ అధికారంలో వున్నారు. ఒక పాలకుడిగా వున్నారు. మీ చేతిలో అధికారం వుంది. అధికారంతో ప్రజా సమస్యలు పపరిష్కరించాలి. కానీ తిట్ల పురాణాల రాజకీయం ఏమిటి ? మీ తిట్ల పురాణంలో మేము బాగస్వామ్యం అవ్వం. మీ మోశాల్ని, వైఫల్యాలని ఎండగడతాం . అంకుశంలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం” అని వెల్లడించారు దాసోజు. మంత్రి కేటీఆర్ సోయిలేకుండా మాట్లాడుతున్నారు. మంత్రి అనే స్పృహ లేకుండా కేవలం తిట్లు మాత్రమే చర్చలోకి వచ్చే విధంగా ప్రజా సమస్యలని పక్కన పెట్టి ఫస్ట్రేషన్ తో ఒక బజారు రౌడీ లా మాట్లాడుతున్నారు. కేటీఆర్…
చీకట్లోకి భారత్.. డజను రాష్ట్రాల్లో తీవ్ర విద్యుత్తు సంక్షోభం యూపీ, పంజాబ్, ఏపీలో 8 గంటల కోతలు థర్మల్ ప్లాంట్లలో అడుగంటిన బొగ్గు నిల్వలు విద్యుత్తు ఉత్పత్తికి బ్రేక్.. పట్టించుకోని కేంద్రం ఉష్ణోగ్రతల పెరుగుదలతో కరెంట్ కష్టాలు పైపైకి బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు.. యూపీ, పంజాబ్, ఏపీ, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ దేశంలోని దాదాపు డజను రాష్ట్రాలను చీకట్లు అలుము కొంటున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ పాటు పంజాబ్, ఏపీలో ఇప్పటికే రోజుకు 8 గంటల చొప్పున విద్యుత్తు కోతలు అమల్లోకి వచ్చాయి. మరో ఎనిమిది రాష్ట్రాలు తీవ్ర విద్యుత్తు కొరతను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే శ్రీలంక, పాక్లోని దుస్థితే భారత్లోనూ తలెత్తవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే 70 శాతం విద్యుత్తుకు బొగ్గే ఆధారం. థర్మల్ విద్యుత్తు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటిపోతుండటంతో విద్యుత్తు…
కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి కి కోపం నిన్న ఏఐసీసీ వేసిన కమిటీ విషయంలో జానారెడ్డి గుర్రు పార్టీ లో జాయినింగ్ కోసం ఒక కమిటీ వేసిన ఏఐసీసీ 6 గురు సభ్యులతో కూడిన కమిటీ కి జానారెడ్డి చైర్మన్ జాయినింగ్ కమిటీ ఏంటి.. దానికి చైర్మన్ ఏంటి అని సీరియస్ అవుతున్న జానారెడ్డి ఇలాంటి కమిటీ లకు తనను చైర్మన్ గా ప్రకటించడమేంటని ఏఐసీసీ ఇంచార్జ్ ఠాగూర్ ను ప్రశ్నించిన జానారెడ్డి పదవి బాధ్యత లు తీసుకోనని స్పష్టం చేసిన జానారెడ్డి.. జానారెడ్డి కి నచ్చచెబుతున్న ఏఐసిసి సెక్రటరీ శ్రీనివాస కృష్ణన్.. ససేమిరా అంటున్న జానారెడ్డి ..
ప్రజాసేవ కోసం, రక్షణ శాఖలో ఉన్నత పదవులను త్యాగం చేసిన..కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జీవితం ఆదర్శప్రాయం.. వర్తమాన రాజకీయాలలో మద్యం వ్యాపారులు, మాఫియా నాయకులు, భూ కబ్జాదారులు, వ్యాపారవేత్తలు ప్రవేశించి రాజకీయ విలువలు దిగజారుస్తున్న ఈ పరిస్థితులలో, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు మన మధ్యలో ఉండడం మన రాష్ట్రానికి, నల్లగొండ జిల్లా కి గర్వకారణం.. దేశ రక్షణలో మూడు ప్రధాన విభాగాల అధిపతులుగా కెప్టెన్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ముగ్గురు సహాధ్యాయులు త్రివిధ దళాదిపతులు గా నియమితులయ్యారు.. భారత సైన్యాధిపతిగా జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు.భారత వైమానిక దళాధిపతి గా జనరల్ వివేక్ చౌదరి కొనసాగుతున్నారు.భారత నావికా దళ అధిపతిగా హరి కుమార్ వ్యవహరిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతులు ముగ్గురు కూడా, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో విద్యాభ్యాసం చేసిన *బ్యాచ్ మేట్స్.…
వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో మే 6వ తేదీన జరగనున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు… మే 6న రాహుల్ గాంధీ పాల్గొననున్న రైతు సంఘర్షణ సభ ఏర్పాట్ల కోసం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో సభాస్థలిని పరిశిలించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ వెంకట్ రెడ్డి, ఎమెల్యే సీతక్క , ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ , పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య , వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ , జిల్లా ఇంచార్జి సంభాని చంద్ర శేఖర్ , డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి , మాజీ ఎంపీలు , మాజీ ఎమ్మెల్యేలు , రాష్ట్ర, జిల్లా నేతలు. రేవంత్ రెడ్డి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు , కామెంట్స్ తెలంగాణ లో ప్రతీ మార్పుకు పునాది ఓరుగల్లు…
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పునాది లాంటిదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఖమ్మం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపించిన నాయకుడు భట్టివిక్రమార్క అని కొనియాడారు. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు టి.ఆర్.ఎస్.లో చేరి కాంగ్రెస్ కు, గెలిపించిన ప్రజలకు ద్రోహం చేశారని, వీరిని ఖమ్మం జిల్లా రాజకీయాల నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దళితున్ని సిఎం చేస్తా అని చెప్పి మాట తప్పిన సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ దళితున్ని రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా చేస్తే జీర్ణించుకోలేని సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్లో చేర్చుకుని దళితుడికి ప్రతిపక్ష పదవి పోయేలా చేశాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ…