Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
గవర్నర్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గొద్దని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయింది. అవసరమైతే న్యాయ పోరాటం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బడ్జెట్ ఫైలుకు గవర్నర్ ఆమోదం తెలపపకపోవడంతో హైకోర్టుకు వెళ్లనుంది. సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. బడ్జెట్ ఫైలుకు ఆమోదం తెలిపేలా గవర్నర్ ను ఆదేశించాలని కోర్టును కోరనుంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది తెలంగాణ సర్కార్. ఇందుకోసం ఈ నెల 21వ తేదీన బడ్జెట్ ఫైలును గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఆ ఫైల్ ను గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. కాని ఆ ఫైల్ ను ఆమె పెండింగ్ లోనే పెట్టారు. వరుసగా రెండోసారి తన ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే బడ్జెట్ కు ఎలా ఆమోదం తెలపాలని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ , కౌన్సిల్ జాయింట్ సెషన్స్…
రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నమంటే దానికి ఓ సాధికారిత ఉండాలి. ఎందుకంటే ప్రతిది రికార్డ్ అవుతుంది. పోరపాటుగా కూడా నోరు జారి అబద్దం మాట్లాడిన ఇరుకున పడాల్సి వస్తుంది. అందుకే సీఎంగా అత్యంత జగురుకతతో మాట్లాడాలి. కాని తెలంగాణ ముఖ్యమంత్రికి నిజాలు మాట్లాడటం అలవాటు ఉండదు కదా. అందుకే అబద్దాలను అంద్నగా ప్రెజెంట్ చేస్తున్నారు. స్వరాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని చెప్పుకున్నారు. నిజంగానే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవా..? రోజూ ఆత్మహత్యలు చేసుకుంటున్నది రైతులు కాదా..? వారు రైతులు కాకపోతే మరెవరు..? తెలంగాణలో నిజంగానే రైతులు పండగ చేసుకుంటున్నారా..? కేసీఆర్ తన జాతీయ రాజకీయ అవసరాల కోసం అవునని అంటున్నారు. కాని వాస్తవ గణాంకాలు మాత్రం విరుద్దంగా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు భారీ స్థాయిలోనే నమోదు అయ్యాయని తేల్చింది. 2014- 20వరకు తెలంగాణలో 6121మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర పొలిసు శాఖ వెల్లడించింది. మన దొరగారేమో నిసిగ్గుగా అబద్దాలు మాట్లాడేశారు. తెలంగాణలో…
ఆర్ధిక మాంద్యం ప్రభావంతో ఐటీ సంస్థలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. నవంబర్ లో మొదలైన ఈ కోత జనవరి నెల నాటికీ పీక్స్ దశకు చేరుకుంది. ఇప్పటివరకు వేయికి పైగా టెక్ కంపెనీలు రెండు లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో 30నుంచి 40శాతం మంది భారతీయులే ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులంతా హెచ్-1బీ, ఎల్- వీసాలతో అమెరికాలో ఉంటున్నారు. ఈ వీసా నిబంధనల ప్రకారం 60రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. లేదంటే స్వదేశాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఉన్నపళంగా ఉద్యోగం కోల్పోవడం.. పేరుమోసిన టెక్ సంస్థలు సహా చిన్న చితక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటంతో హెచ్-1బీ వీసా దారులు ఆందోళనకు గురి అవుతున్నారు. కొత్త ఉద్యోగం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తెలిసిన వారి ద్వారా ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. కాని పెద్దగా ఉపయోగం ఉంటున్నట్టు లేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెజాన్, ఫేస్‌బుక్ మాతృసంస్థ…
బీఆర్ఎస్ లో కొత్త పంచాయితీ షురూ అయింది. కోరుట్ల, వరంగల్ , జనగామ మున్సిపాలిటీలు, పలు కార్పోరేషన్ లలో అధికార పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అసమ్మత్తి స్వరం వినిపిస్తున్నారు. పలు చోట్ల మున్సిపల్ చైర్ పర్సన్స్ పై సొంత పార్టీ నేతలే అవిశ్వాసానికి రెడీ అయ్యారు. పార్టీలో సైరన గౌరవం ఇవ్వడం లేదని కౌన్సిలర్లు ఆగ్రహంగా ఉన్నారు. అభివృద్ధి పనులు కూడా చాలావరకు పెండింగ్ లో ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనగామ చైర్ పర్సన్ పోకల జమునపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసానికి రెడీ అయ్యారు. 19వ వార్డు కౌన్సిలర్ బండ పద్మతో కలిసి మిగితా కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లారు. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా.. 13మంది ఆమె క్యాంప్ లో ఉన్నారు. కౌన్సిలర్లు అందరూ తనకు మద్దతు తెలపాలని బండ పద్మ ఓ ఆలయంలో ప్రమాణం చేయించుకున్న ఫోటోలు లీక్ అయ్యాయి. సొంత పార్టీ నేతలతోపాటు…
యువగళం పాదయాత్రలో మొదటి రోజు నారా లోకేష్ తో కలిసి పాల్గొన్న నందమూరి తారకరత్న అకస్మాత్తుగా సొమ్మసిల్లిపడిపోయారు. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స చేయించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని వైద్యులు తేల్చారు. మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగళూర్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం బెంగళూర్ వెళ్లి తారకరత్న చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో చంద్రబాబు మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ కూడా ఆసుపత్రికి వెళ్ళారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు అంటున్నారు. ఆయన కోలుకునేందుకు బాగా సమయం పడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా తారకరత్నకి అరుదైన వ్యాధి సోకిందట.ఆ వ్యాధి పేరు మెలెనా. ఇది అరుదైన వ్యాధిగా డాక్టర్లు చెప్తున్నారు. ఈ వ్యాధి జీర్ణాశయంలో రక్త ప్రవాహంకి సంబంధించినది. దీనివల్ల నోరు ,అన్నవాహిక మరియు పొట్ట భాగంలో…
నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన తాజా హెల్త్ బులిటెన్ ను నారాయణ హృదయాలయ వైద్యులు విడుదల చేశారు. “మాక్సిమమ్ లైఫ్ సపోర్ట్ కొనసాగిస్తున్నాము. పలు విభాగాలకు చెందిన వైద్యులు ఆయనను ఎప్పటికప్పుడు పరిక్షిస్తున్నారు. చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందని పేర్కొన్నారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. నందమూరి తారకరత్నను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం బెంగళూర్ వెళ్ళారు. తారకరత్న చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణ అక్కడే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా బెంగళూర్ వెళ్ళారు. అన్నదమ్ములిద్దరూ కుటుంబ సభ్యులతో పాటు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి వస్తున్నారని తెలుసుకొని టీడీపీ కార్యకర్తలు…
తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి , ఈటల రాజేందర్ ల మధ్య డబ్బుల వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వం వరకు ఈ విషయం చేరడంతో వివేక్, ఈటలపై కేంద్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీని పలుచన చేయకుండా వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిన నేతలు.. బహిరంగంగా వాదులాకోవడంపై సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం పార్టీలో కొత్త చర్చకు దారి తీసింది. అదే సమయంలో ఈ అంశం ప్రత్యర్ధి పార్టీలకు అస్త్రంగా మారుతుందని భావించిన బీజేపీ ఢిల్లీ పెద్దలు.. వివేక్ , ఈటల 10కోట్ల వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు అప్పగించినట్లు తెలుస్తోంది. వివేక్ కు ఈటల ఇవ్వాల్సిన రూ. 10కోట్లను చెల్లించాలని డీకే అరుణ హైకమాండ్ నేతల మాటగా చెప్పినట్లు తెలుస్తోంది. పైసల పంచాయితీ ఢిల్లీకి చేరిందని.. వెంటనే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఈటలకు చెప్పగా.. ఎన్నికల…
ఇటీవలి ఇండియా టుడే- సీవోటర్ సర్వేలో మరోసారి బీజేపీకి పట్టం కట్టనున్నారని తేలింది. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం ఏర్పాటు చేస్తుందని వెల్లడైంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే 284సీట్లు బీజేపీకి వస్తాయని సర్వేలో తేలిందని చెప్తున్నారు. నిజమే.. కానీ పెరిగిన కాంగ్రెస్ , మిత్రపక్షాల గ్రాఫ్ గురించి ఎక్కడ ప్రస్తావించడం లేదు. విపక్షాలతో కలిసి కాంగ్రెస్ కు 191 సీట్లు వస్తాయని ఇండియా టుడే- సీవోటర్ సర్వేనే తేల్చింది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ కు 139 సీట్లు పెరుగుతున్నాయి. కాని ఈ రిజల్ట్ ను ఎక్కడ ప్రస్తావించకుండా… బీజేపీ ప్రభంజనం అని మెయిన్ స్ట్రీం మీడియా మొదలు పలు వెబ్ సైట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. బీజేపీ ప్రభంజనం అంటున్నారు. నిజానికి ఈ వ్యాక్యం సరిపోతుందా..? అంటే సెట్ కాదనే చెప్పాలి. ఎందుకంటే.. గతంలో బీజేపీ 303 స్థానాల్లో గెలుపొందింది. మోడీ హవా ఉంటె ఈసారి ఆ పార్టీకి ఎక్కువ…
ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. రాజకీయ నేతగా చాలామంది అభిమానిస్తుంటారు. అలాంటి నేత నీచ కార్యానికి తన ఫామ్ హౌజ్ ను వేదిక చేశారు. కాసుల కక్కుర్తితో ఫామ్ హౌజ్ ను వ్యభిచార గృహంగా మార్చారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తోన్న ఈ వేశ్య గృహంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేసి గుట్టురట్టు చేశారు. మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్. మారక్. వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణంలోని తన ఫాంహౌస్ లో వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. ఈ విషయమై కొద్దిరోజుల కిందట పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఫామ్ హౌజ్ పై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఆపై వ్యభిచార దందా జరుగుతుందని నిర్ధారించుకొని పోలీసులు ఇటీవల వేశ్యగృహంపై దాడి చేశారు. 30 వరకు చిన్న గదులున్న బెర్నార్డ్ ఎన్. మారక్ ఫాంహౌస్లో ఆరుగురు మైనర్లను బంధించగా.. వారికి పోలీసులు విముక్తి కల్పించారు. ఈ వ్యభిచార దందాతో సంబంధమున్న…
ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే.. కేటీఆర్ మాత్రం ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చునని సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు క్యాడర్ సిద్దంగా ఉండాలని అలర్ట్ చేస్తున్నారు. కాకపోతే.. ముందస్తు ఎన్నికల విషయంలో కేంద్రానికి ముడిపెట్టారు కేటీఆర్. కేంద్రం పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తుకు వెళ్తే.. తాము కూడా అసెంబ్లీని రద్దు చేస్తామని ప్రకటించారు. ముందస్తు ఎన్నికలపై జోరుగా ప్రచారం జరుగుతోన్న కేటీఆర్ చేసిన కామెంట్స్ పై చర్చ జరుగుతోంది. మార్చిలో నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి మొదటి వారంలోనే నిర్వహించడం బట్టి ముందస్తుకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అదే విధంగా.. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు విషయంలో కేటీఆర్ స్పీడ్ పెంచారు. ఏప్రిల్ డెడ్ లైన్ పెట్టుకొని పని చేస్తున్నారు.ఈ అభివృద్ధిని ప్రజల ముందు ఉంచి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. మరోవైపు.. తెలంగాణ బిడ్డ ఢిల్లీని పాలించడానికి వెళ్తుంటే మీరే సహకరించకపోతే..దేశమంతటా…