Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
బీజేపీలో కేసీఆర్ కోవర్టులున్నారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఆ కోవర్టులు ఎవరో ఈటల చెప్పకపోవడంతో వ్యూహాత్మకంగానే ఆయన ఈ కామెంట్స్ చేసినట్లు బీజేపీ వర్గాలు అనుమనిస్తున్నాయి. బండి సంజయ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే ఈటల ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పై అలుపెరగకుండా పోరాటం చేస్తోన్న బండి సంజయ్ ను అద్యక్ష పీఠం నుంచి దించేందుకే కోవర్టులు అంటూ కొత్త నాటకాన్ని ఈటల తెరపైకి తీసుకొచ్చారని సందేహిస్తున్నారు. అదే సమయంలో ఈటల ప్రవర్తనపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. బండి సంజయ్ గ్రాఫ్ పెరుగుతుందని నివేదికలు వచ్చినప్పుడల్లా ఈటల ఎదో ఓక రూపంలో పార్టీలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకుంటున్నారు. తెలంగాణలో బలపడుతోన్న బీజేపీని బలహీనపరిచేందుకే అసైన్డ్ భూముల కేసుతో ఈటలను బీజేపీలోకి కేసీఆరే పంపించాడా..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నిజంగా..పార్టీలో కోవర్టులు ఉంటే ఈటల…
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున కొల్లాపూర్ టికెట్ ను ముగ్గురు నేతలు ఆశిస్తున్నారు. రంగినేని అభిలాష్ రావు, చింతలపల్లి జగదీశ్వర్ రావు మరియు డా. కేతూరి వెంకటేష్ లు కోరుతున్నారు. బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని భావిస్తే ఖచ్చితంగా కేతూరి వెంకటేష్ కు అవకాశం దక్కుతుంది. ఆర్ధిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రంగినేని అభిలాష్ రావు ,చింతలపల్లి జగదీశ్వర్ రావులలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. డా. కేతూరి వెంకటేష్ విద్యార్ధి ఉద్యమ నాయకుడు. బీసీ సామజిక వర్గానికి చెందిన నేత. ఎన్ఎస్ యూఐ , యూత్ కాంగ్రెస్ విభాగాల్లో పని చేసిన కేతూరికి సీనియర్ నేతలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. జాతీయ స్థాయి నేతలతో కేతూరికి సాన్నిహిత్యం ఉంది. రాష్ట్ర స్థాయిలోనూ మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కీ వంటి సీనియర్ నేతలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. పైగా.. నియోజకవర్గంలో పని చేసుకోవాలంటూ కేతూరికి సీనియర్లు ఫ్రీ…
పేర్ని నాని.. కొడాలి నాని.. ఈ ఇద్దరు సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు. జగన్ పై ఈగ వాలనీయకుండా చూసుకుంటారు. ప్రతిపక్షం నుంచి జగన్ పై విమర్శలు రాగానే కౌంటర్లు వేసేది ఈ నానిలే. ప్రత్యేకంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై చెలరేగిపోవడం ఈ నేతల బాధ్యత. జగన్ తో అత్యంత సన్నిహిత నేతలుగానున్న వీరికి ప్రభుత్వంలో లభించే ప్రాధాన్యత మాత్రం క్రమక్రమంగా సన్నగిల్లుతూ వస్తోంది. జగన్ కు పెద్ద పాలేర్లమని సిగ్గు విడిచి చెప్పుకుంటున్నారు కాని..ప్రభుత్వంలో ప్రాధాన్యత లేకపోవడంతో ఈ నేతల్లో ఖచ్చితంగా అసంతృప్తి గూడుకట్టుకొని ఉండి ఉంటుంది. గత ఏడాది ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో కొడాలి నాని, పేర్ని నానిలను తొలగించరని అంత అనుకున్నారు. కాని వీరిని పక్కనపెట్టేశారు. ఇది వారిలో అసంతృప్తి కల్గించకుండా ఎలా ఉంటుంది..? తమను పక్కనపెట్టి తమకంటే గొప్ప నేతలని భావించి…
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ కు పడక గదిలో కోరికలు తీరిస్తే గానీ అవకాశాలు దక్కని పరిస్థితి. సినీ ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఇలాంటి వాటిని ఎదుర్కోవడం సహజమే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు ఇలాంటి చేదు అనుభవాలను ఎన్నో ఎదుర్కొన్నారు. ఈ తరహ అనుభవాలు ఎదురైనప్పుడు కొందరు సినీ తారలు మీడియా ముందుకొచ్చి వాళ్ళ భాదను చెప్పుకుంటారు. కానీ కొందరు మాత్రం అవకాశాల కోసం మనసులో దాచుకొని అలానే మౌనంగా ఉంటారు. స్టార్ హీరోయిన్ నయన తార మొదట సినీ ఇండస్ట్రీలోకి అడుగులు వేస్తున్న క్రమంలో ఓ నిర్మాత తన కోరిక తీరుస్తే సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పినట్లు నాటి చేదు అనుభవాన్ని తాజాగా మీడియా ముందు చెప్పుకొచ్చింది. నయనతార తెలుగు, మలయాళం, తమిళ్ చిత్రంలో నటించి పాపులారిటీ తెచ్చుకుంది. చంద్రముఖి మూవీలో రజినీ కాంత్ తో నటించి గొప్ప నటిగా పేరుతెచ్చుకుంది. ఆ తర్వాత గజిని మూవీలో ఐటం…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 6నుంచి యాత్ర ఫర్ చేంజ్ పేరుతో ఆయన జనాల్లోకి వెళ్తున్నారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు.. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత గురించి ఈ యాత్రలో వివరించనున్నారు రేవంత్. పాదయాత్రకు హైకమాండ్ అనుమతి ఇవ్వడం.. ఆ తరువాత సీనియర్లు కూడా పాదయాత్రకు సహకరిస్తారమని చెప్పడంతో రేవంత్ యాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోమవారం ఫిబ్రవరి 6 నుంచి తన పాదయాత్ర మొదలవుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గమైన మేడారం నుంచి యాత్ర ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.మొదటి విడతలో 60 రోజులు పాటు యాత్ర సాగుతుందని వెల్లడించారు. దాదాపు యాభై నియోజకవర్గాలను చుట్టేసే విధంగా రూట్ మ్యాప్ ఖరారు అయింది. మొదట విడత పాదయాత్ర పూర్తయిన అనంతరం రెండో విడత పాదయాత్రపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పాదయాత్రతో…
కెసీఆర్ తనయుడు కేటీఆర్ కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి అని బీర్ఎస్ పార్టీలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కంటే కేటీఆరే బెటరన్న అభిప్రాయాలు తన సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను వదిలి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. కేసీఆర్ పెట్టినంత ఇంట్రెస్ట్ నేషనల్ పాలిటిక్స్ పై కెటిఆర్ ఎందుకు పెట్టడం లేదని చాలా మంది సందేహం. కేటీఆర్ కు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేకపోవడంతోనే బీఆర్ఎస్ సభలకు ఆయన హాజరు కావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి అయిపోవాలన్న అభిలాషతోనే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం లేదని..అందుకే రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటునారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఆలోచన ప్రకారం బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి వస్తే నెక్స్ట్ కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆరేనన్ని సంకేతాలు ఇస్తున్నారు. కేటీఆర్ ను నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ప్రకటించడం హరీష్ రావు, కవిత, సంతోష్ లకు ఇష్టలేదని…
గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కేంద్రాన్ని కేసీఆర్ చీల్చిచెండాడారు. తెలంగాణకు అన్యాయం చేశారని ఉగ్రరూపం ప్రదర్శించారు. ఇంత అన్యాయం ఉంటుందా అంటూ కేంద్రంపై ఊగిపోయారు. కేంద్ర పెద్దల ముందు మోకరిల్లకపోతే ఇంత వివక్ష చూపిస్తారా..?ఇది పద్ధతి కాదు. తీరు మార్చుకోవాలంటూ తన సహజశైలిలో కేంద్రాన్ని ఎండగట్టారు కేసీఆర్. కేంద్రంపై పోరాటం చేయాలనుకునే చాలామందికి కేసీఆర్ పోరాటపటిమ తెగ నచ్చేసింది. కేంద్రాన్ని వదిలేది లేదని చెప్పడంతో ఆయనను అనుకరించాలని విపక్షాలు అనుకున్నాయి. ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా కేంద్రంపై చేస్తోన్న పోరాటంపై వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు కేసీఆర్. బీజేపీ అన్యాయం చేసిన ప్రతిచోట గళం వినిపిస్తామని చెబుతూ వచ్చారు. ఇది కొంతమందిని ఆకర్షించింది. ఇంతలోనే కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. తెలంగాణ మంత్రులు బడ్జెట్ పై స్పందించారు. తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిందంటూ నోరు విప్పారు. విభజన హామీలను అస్సలు పట్టించుకోలేదని ఎండగట్టారు. కేసీఆర్…
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. ఐదు పదుల వయసులోనూ పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేస్తున్నాడు. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరో అయిన సల్మాన్ ఖాన్ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తో అప్పట్లో ప్రేమాయణం కొనసాగించాడు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకొవాలనుకున్నారు. కాని చివర్లో వీరి పెళ్లికి బ్రేక్ పడింది. అందుకు కారణం ఏంటంటే..ఓ వైపు ఐశ్వర్య రాయ్ తో ప్రేమాయణం కొనసాగిస్తూనే మరో వైపు ప్రీతీ జింటాతో కూడా సల్మాన్ ఖాన్ప్రేమాయణం నడపడమే. ఈ విషయం తెలిసి ఆఖర్లో ఐశ్వర్య రాయ్ పెళ్లికి నిరాకరించిందని అంటుంటారు. పీకల్లోతు ప్రేమలో మునిగితేలినా ఐశ్వర్య రాయ్- సల్మాన్ ఖాన్ లు ఆ రోజుల్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. వీరి రాసలీలలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అంతేకాదు వీరి ఫోన్ కాల్ సంబాషణ అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. విషయం…
మొన్నటి వరకు అతను వన్డేలకు పనికి రాడండి అన్నారు. కివీస్ తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ సాధించాక.. వన్డేలకు ఒకే కాని టీ20లకు సరితూగాడని అభిప్రాయాలు వినిపించారు. ఇది నిన్నటి వరకు టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ గురించి స్పోర్ట్స్ ఎనలిస్టుల అభిప్రాయం. కాని వాటన్నింటికి బుధవారం కివీస్ తో జరిగిన మూడో టీ20ద్వారా గట్టి సమధానమే ఇచ్చి తనేంటో రుచి చూపించి..అందరి నోళ్ళ మూయించాడు గిల్. కళాత్మక ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. సిక్స్, ఫోర్లతో మైదానం నలువైపులా గిల్ పరుగుల వరద పారించాడు. విమర్శలు అందుకున్న నోటి నుంచే ప్రశంసలను అందుకున్నాడు. సీరిస్ నిర్ణయాత్మక మ్యాచ్ లో టీమిండియా అల్ రౌండర్ ప్రదర్శనతో ఆదరగోట్టింది. బుధవారం జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ పై 168పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 234పరుగులు చేసింది. ఈ…
బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున్న బడ్జెట్ లో రాష్ట్రానికి అధిక కేటాయింపులు ఉంటాయని అంచనా వేశారు. కానీ అవి అంచనాలకే పరిమితమయ్యాయి తప్పితే ఆచరణ రూపం దాల్చలేదు. బడ్జెట్ లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకే నిధులు కేటాయించారు. సింగరేణికి రూ. 1650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్ రూ. 300 కోట్లు కేటాయించారు.ఇక , అన్ని ఎయిమ్స్ ఆసుపత్రులకు కలిపి కేటాయించిన వాటిలో కొన్ని మామూలుగానే తెలంగాణ, ఏపీ ఎయిమ్స్ లకు వస్తాయ్. కానీ ప్రత్యేకంగా కేంద్రం ఏమి కేటాయించలేదు. ఇక, ఏపీని కూడా నిర్మలమ్మ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి రూ. 47 కోట్లు, పెట్రోలియం వర్సిటీకి రూ. 168 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 683 కోట్లు కేటాయించారు. దాంతోనే కేంద్రం చేతులు దులిపేసుకుంది తప్పితే ఏపీపై పెద్దగా కరుణ…