Author: Prashanth Pagilla

బాలీవుడ్ నటి రాఖీ సావంత్. ఎప్పుడు ఎదో ఒక విషయమై వార్తల్లో నానుతూనే ఉంటుంది. తాజాగా ఆమె భర్త ఆదిల్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఓ అమ్మాయితో ఆదిల్ ఎఫైర్ పెట్టుకున్నాడని ఆరోపించింది. భర్త ఆదిల్ ఖాన్ తో వివాదం ఏంటని రాఖీ సావంత్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఆదిల్ ఓ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని..విషయం తెలిసి నిలదీస్తే ఆమెను వదిలేస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపించింది. ఆదిల్ ఖాన్ ఎప్పుడు అబద్దాలు చెప్తుంటాడని తెలిపింది. పైగా, ఆ అమ్మాయి ఆదిల్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆమె వద్ద ఆదిల్ చండాలమైన వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. అవి బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుందని వివరించింది. దయచేసి ఆదిల్ ను ఇంటర్వ్యూలు చేసి హీరోను చేయకండి.. మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ ఎమోషనల్ అయింది రాఖీ సావంత్. మీడియాలో కనిపించి ఆదిల్ హీరో కావాలనుకుంటాడని విమర్శించింది. తాను…

Read More

గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంపై అందరికీ అనుమానాలు ఉన్నాయి. హిండెన్ బర్గ్ నివేదిక రిలీజ్ కాగానే అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఆయన అడ్డాదారిలో సంపాదించారని ఆ నివేదికతో ఓ స్పష్టత వచ్చింది. అదానీ వ్యాపారంపై హిండెన్ బర్గ్ నివేదిక గురించే ప్రధాన చర్చ. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలోనూ బడ్జెట్ కు ఏమాత్రం తీసిపోకుండా హిండెన్ బర్గ్ నివేదికపై చుట్టూ చర్చ జరగడం విశేషం. నిజానికి..కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అప్పులు తీసుకొని పోర్టులు, అయిర్ పోర్టులు , ట్రైన్లు ఇలా కనిపించవన్నీ కొనిపడేశారు అదానీ. చివరికీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే ఎన్డీటీవీని కూడా కొనేశారు. వీటన్నింటిని కొనుగోలు చేసేందుకు అదానీ దగ్గర బోలెడంత డబ్బు ఉంది కాని ,అమ్మేవారు ఎలా అమ్ముతున్నారు…?లాభాలు దండిగా వస్తున్నా ఆ సంస్థలను విక్రయిస్తున్నారంటే వారిపై ఎవరి ఒత్తిళ్ళు ఉన్నాయనేది అందరి సందేహం. ఎయిర్ పోర్టులు, పోర్టులు, మీడియా కంపెనీలను అదానీ కొనడం వెనుక…

Read More

తెలంగాణ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఎన్నికల సంవత్సరం కావడంతో బడ్జెట్ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. రూ. మూడు లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టనుందని మీడియాకు ప్రభుత్వం లీకులు ఇస్తోంది. నిజానికి..ఈ మూడు లక్షల బడ్జెట్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలకు ఏమాత్రం సరిపోదు.. ఇది పక్కనపెడితే… ఆ మొత్తం కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారో బడ్జెట్ పద్దులో చూపించాలి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ నిధుల సమీకరణ చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవ్వలేదు. కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు, పెండింగ్ నిధులు రాలేదు. అప్పుల ద్వారానైనా నెట్టుకొద్దామనుకుంటే అప్పులపై పరిమితి విధించింది కేంద్రం. దీంతో వచ్చే ఆర్ధిక సంవత్సరంలో నిధుల సమీకరణ తెలంగాణ సర్కార్ కు సవాల్ గా పరిణమించింది. కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో భారీగా నిధులు సమకూరుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకోవడం ఆ తరువాత ఆ…

Read More

తెలంగాణలో నూతనంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ లో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైయిన అధికారులు ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేసి రప్పించారు. సకాలంలో స్పందించడంతో ఫైర్ ఇంజన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేసింది. అయితే ఆ భవనంలో వుడ్ వర్క్ చేస్తుండగా షాట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవించి వుండొచ్చు అంటున్నారు అధికారులు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నూతన సెక్రటేరియట్ ను ప్రారంభం కావాల్సి వుంది. అయితే ఈ సంఘటన గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ వెంటనే స్పందిస్తూ.. ఇది ఎవరైనా కావాలనే చేశారా..?లేక సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్న వాటిపై అధికారులు విచారణ జరపాలని కేసీఆర్ ఆదేశించారు. https://youtu.be/ZeKjTRYp3gg సచివాలయంలో మంటలు చెలరేగడంతో అక్కడి స్థానికులు కూడా ఆందోళన చెందారు.ఈ ఘటన పై ప్రభుత్వం విచారణ జరపనుంది.

Read More

14ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు మేనమామ వరుసయ్యే కామాంధుడు. అతని బారి నుంచి తప్పించుకునేందుకు ఆ బాలిక యత్నించగా నోట్లో యాసిడ్ పోసి దారుణంగా ప్రవర్తించాడు. ఐదు నెలలపాటు చావు -బ్రతుకుల మధ్య పోరాడిన ఆ చిట్టి తల్లి మృత్యువును ఓడించలేక.. ఈ లోకాన్ని వదిలివెళ్ళింది. మనస్సును మెలితిప్పే ఈ విషాదకర సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…ఈ గ్రామానికి ఓ మాజీ ఉపాధ్యాయుడికి తొలుత కుమారుడు పుట్టాడు. 18ఏళ్ల వయస్సులో అతను మృతి చెందాడు. ఆ తరువాత చాలా కాలానికి కుమార్తె పుట్టింది. దాంతో కుమార్తెను అపురూపంగా పెంచుకున్నాడు ఆ ఉపాధ్యాయుడు. తనే లోకంగా బ్రతుకుతున్నాడు. తన కూతురికి చిన్న ప్రమాదం జరిగినా గుండెలవిసేలా తల్లడిల్లెవాడు ఆ తండ్రి. ఈ క్రమంలోనే అనుకోని సంఘటన ఆ తండ్రికి కూతురిని లేకుండా చేసింది. ఓ కామాంధుడి ఆకలికి అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ చిట్టితల్లి…

Read More

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ,కళాతపస్వి కె. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమాకు కొత్త వన్నె తీసుకొచ్చారు. గుంటూరు జిల్లా రేపల్లె మండంలోని పెద పులివర్రు గ్రామం కె.విశ్వనాథ్‌ స్వస్థలం. 1930 ఫిబ్రవరి 19న శ్రీ కాశీనాధుని సుబ్రహ్మణ్యం, శ్రీమతి సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు. చెన్నైలోని ఒక స్టూడియో సౌండ్‌ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తరువాత ఆత్మగౌరవం సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. శంకరాభరణం, సాగరసంగమం, శృతి లయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి ఎన్నో చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు. నటుడిగా కూడా ఎన్నో సినిమాలో చేశారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషికి 2016లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు దక్కింది. రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అనారోగ్యంతో ఆయన…

Read More

నందమూరి తారకరత్న ఆరోగ్యం కాస్త కుదుటపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అటు నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుకుంటున్నారు. టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు బెంగళూర్ లో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించి వెళ్తున్నారు. అయితే తారకరత్న గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎదో ఒక కథనం ప్రచారం అవుతూనే ఉంది. ఇటీవల ఆయన చివరి కోరిక గురించి ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. బాలయ్య అంటే తారకరత్నకు బాగా ఇష్టం. తన తండ్రి కంటే కూడా బాలకృష్ణను ఎక్కువ ఇష్టపడుతాడు. బాలయ్య కూడా అదే రీతిలో తారకరత్నను సొంత కొడుకులా ట్రీట్ చేస్తాడు. తారకరత్నకు గుండెపోటు వచ్చిందని తెలియగానే బాలకృష్ణ తనకున్న పనులను పక్కన పెట్టేశారు. బెంగళూర్ లోనే మకాం వేసి తారక రత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. పక్కనుండి అన్ని సేవలు…

Read More

పెట్టుబడి దారుడు తనకు 20 శాతం లాభం వస్తుందంటే తన విస్తరణన కాంక్షను ఊరి సరిహద్దు దాటిస్తాడని ,యాభై శాతం లాభం వస్తుందంటే వాడ దాటతాడనీ , 80శాతం లాభం వస్తుందనుకుంటే రాష్ట్ర సరిహద్దులు దాటతాడని, చిట్ట చివరకి తాను మరణిస్తే 100 శాతం లాభం వస్తుందని తెలిస్తే ఆ క్షణాన చంపడానికి చనిపోవడానికి గడియ కూడా ఆగడని ఆస్థిని కూడా బెట్టుకొనే క్రమంలో విలువలను ఎలా విస్మరిస్తాడో కార్ల్ మార్క్స్ రెండువందల ఏళ్ల కింద ఊహించాడు. పవర్ దానికి ఉన్న వికృతి,విశృంఖలత స్వభావాన్ని వివరించాడు. ఆయన ఈ వూహ చేసేనాటికి ప్రపంచం మొత్తం వలస పాలనలో ఉన్నప్పటికీ పెట్టుబడి ఇంత వికృతంగా లేదు. మతం ఇంత ప్రమాదకరంగా లేదు. ఫాసిజం కనీసం పుట్టలేదు. ఇక్కడ అధానీ అనే పెట్టుబడి దారుడు అన్ని ప్రపంచ మూలల నూ తన కబంద హస్తాల లో ఉంచుకోవాలి అనే సాహస యాత్ర చేస్తున్నాడు. దానికోసం…

Read More

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ చార్జీషీట్ లో ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు పేర్లను చేర్చింది. అలాగే అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా రెడ్డిలు సహా 17మంది నిందితులపై ఈడీ అభియోగాలను మోపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులను గుజరాత్ ఎన్నికల కోసం ఆప్ వాడిందని ఈడీ పేర్కొంది. సాక్ష్యాలను ధ్వంసం చేసిన కవిత పేరును కూడా తాజా చార్జీషీట్ లో చేర్చింది. ఇకపోతే.. తాజాగా ఈడీ చార్జీషీట్ లో అరవింద్ కేజ్రీవాల్ పేరును చేర్చడంపై ఆయన స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా పని చేయాల్సిన ఈడీ.. అవినీతికి పాల్పడుతున్న వారిని ప్రశ్నిస్తోన్న వారిని వేధించి.. ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ చార్జీషీట్ అంత ఓ కల్పితమని మండిపడ్డారు. మొత్తం 428పేజీలతో ఈడీ రెండో చార్జీషీట్ ను రిలీజ్ చేసింది.ఈ…

Read More

బీహార్ లో జరుగుతోన్నఇంటర్ సెకండరీ సర్టిఫికేషన్ బోర్డు పరీక్షల సందర్భంగా ఓ ఎగ్జామ్ సెంటర్ లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రానికి వెళ్ళిన ఓ విద్యార్ధి ఎగ్జాం రాసేందుకు హాల్ లోకి వెళ్లి అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మనిష్ శంకర్ అనే విద్యార్ధి నలందాలోని అల్లమా ఇక్బాల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. సెకండరీ సర్టిఫికేషన్ బోర్డు పరీక్షలో భాగంగా బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్ లో అతను పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్ష రాసేందుకు వెళ్ళిన ఆ విద్యార్ధి.. ఎగ్జామ్ సెంటర్ లో అమ్మాయిలను చూసి షాక్ అయ్యాడు. పరీక్షా కేంద్రం మొత్తం వెతికినా ఒక్కరంటే ఒక్క అబ్బాయి కూడా కనిపించలేదు అతనికి. దాంతో కాస్త భయం భయంగానే పరీక్ష హల్ లోకి వెళ్ళిన మనీష్… అమ్మాయిలను చూసి బెరుకుతో కళ్ళుతిరిగి పడిపోయాడు. వెంటనే ఆ స్కూల్ సిబ్బంది మనీష్ ను ఆసుపత్రికి తరలించారు. ఆ పరీక్షా కేంద్రంలో…

Read More