Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ సీఎం జగన్ సైతం సీబీఐ నోటిసులు అందుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్ , ఆయన భార్య భారతి ఫోన్లు అటెండ్ చేసే కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లను సీబీఐ విచారించడంతో త్వరలోనే జగన్ కు సీబీఐ నోటిసులు జారీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసులో జగన్ ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని కామెంట్స్ చేయడం ఇందులో భాగమనే అనుమానాలు కల్గుతున్నాయి. ఇదేదో కుట్ర అన్నట్లుగా సజ్జల స్టేట్ మెంట్ ఇవ్వడం పలు అనుమానాలను లేవనెత్తుతోంది. జగన్ కు వ్యతిరేకంగా ఏం జరిగినా అదంతా కుట్ర అనడం వైసీపీకి పరిపాటి అని చెప్పనక్కర్లేదు. వివేకా హత్యకేసులో చంద్రబాబు ముద్దాయి అని మొదట ప్రచారం చేశారు. ఆ తరువాత వివేకా కూతురు, అల్లుడే చంపించారని కూడా ఆరోపించారు. ఇప్పుడు కేసును సీబీఐ సీరియస్…
సమాజంలో ఆడవారికే కాదు మగవారికీ కూడా రక్షణ లేకుండా పోతోంది. ఈ మధ్య మగవారి మీద ఆడవారు దాడులకు పాల్పడుతోన్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మగ మహానుభావులు వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఓ నటుడి ఆత్మహత్య వ్యవహారం సంచలనంగా మారింది. తమిళ నటుడు, డ్యాన్సర్ రమేష్ జనవరి 27వ తేదీన తన బర్త్ డే రోజునే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఓ అపార్ట్ మెంట్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. రమేష్ రెండో భార్య వేధింపుల వలెనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని మొదటి భార్య ఆరోపించింది. రమేష్ ను రెండో భార్య విపరీతంగా వేధించేదని.. ఆ వేధింపులను భరించలేకే బలవన్మరణం చేసుకున్నాడని ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఆమె ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఆ వీడియోలో రెండో భార్య రమేష్ ను దారుణంగా…
టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోల సరసన నటించింది అందాల నటి మీనా. టాలీవుడ్ , బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండని మీనా గురించి ఫేక్ వార్తలు ప్రచురితం అవుతున్నాయి. ఆమె రెండో పెళ్లి చేసుకోనుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. నటి మీనా భర్త పలు అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా తన కూతురితోనే ఉంటుంది. అయితే.. కూతురి భవిష్యత్ కోసం రెండో పెళ్లి చేసుకోవాలని మీనాపై ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారని..దాంతో రెండో పెళ్లికి ఆమె కూడా అంగీకారం తెలిపిందని ప్రచారం జరిగింది. వరుడు ఆమె చిన్న నాటి స్నేహితుడు అని.. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అతను మీనాను పెళ్లి చేసుకునేందుకు ఒకే చెప్పాడని ఆ మధ్య వార్తలు…
2018ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించేందుకు కేసీఆర్ చాలానే హామీలు ఇచ్చారు. కేసీఆర్ ను నమ్మి జనాలు రెండోసారి అధికారం కట్టబెట్టారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చుతామంటూ గత బడ్జెట్ లో నిధులు కేటాయించారు కాని విడుదల అవ్వలేదు. ఇప్పుడు ఆ హామీలే కేసీఆర్ సర్కార్ ను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రైతు రుణమాఫీ : రైతును రాజు చేస్తామని.. తమకు మరోసారి అవకాశం ఇస్తే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామంటూ రైతులను తనవైపు తిప్పుకున్నారు. కేసీఆర్ ను నమ్మి రైతులంతా ఏకపక్షంగా కారు గుర్తుకు ఓటేశారు. నాలుగేళ్ళు అవుతున్నా రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు. బ్యాంకర్ల నివేదిక మేరకు 47.4లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా తేల్చారు. ఇందుకోసం 24,738కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వానికి నివేదించారు. కాని ఇప్పటి వరకు కేవలం రూ.3,881 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇంకా రూ.20,857 కోట్లు…
మనిషి తనం చచ్చిపోతుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్యను ఓ కిరాతకుడు తెగనరికాడు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై సినిమా తరహాలో వెంటాడి భార్యను రోడ్డుపై హతమార్చాడు. ఈ సంఘటన స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశం నగర్ లో అందరూ చూస్తుండగానే రోడ్డుపైన భార్యను కిరాతకంగా చంపాడు భర్త. గత కొంతకాలంగా వీరి సంసారం వివాదాలతోనే సాగేది. లంగర్ హౌస్ లో మహమ్మద్ యూసుఫ్ కు కరీనా బేగంతో ఏడు సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. సంవత్సరం నుంచి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఆమెపై కక్ష పెంచుకున్న భర్త ఆమెను చంపాలనుకున్నాడు. శక్రవారం కాపు కాసి కరీమా బేగం స్కూల్ కి వెళ్తున్న సమయంలో ఐరన్ రాడ్డుతో ఆమెపై దాడి…
గతేడాది వేయి మంది ఉద్యోగులను తొలగించిన ఎడ్యూటెక్ కంపెనీ బైజూస్ తాజాగా మరో పదిహేను వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. గతంలో వేయి మంది ఉద్యోగులను తొలగించిన సమయంలో బైజూస్ చీఫ్ రవిచంద్రన్ ఓ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉద్యోగుల తొలగింపు అనివార్యంగా మారిందని..ఇక ఉద్యోగుల తొలగింపు ఉండబోదని స్పష్టం చేశారు కాని తాజాగా ఆ ప్రామిస్ ను బ్రేక్ చేశారు. బైజూస్ఇటీవలి కాలంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. యూనికార్న్ స్టార్టప్ గా ఎదిగిన తరువాత పూర్తిగా దారి తప్పిదన్న అభిప్రాయాలూ ఉన్నాయి. వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రకటిస్తూ.. ఉద్యోగులను తొలగిస్తోంది. నష్టాల నుంచి ఉపశమనం పొందేందుకు విద్యార్థుల తల్లిదంద్రులను వేదిస్తుందన్న ప్రచారం ఉండనే ఉంది. ఈ క్రమంలోనే కరోనా టైంలో అందరూ ఆన్ లైన్ చదువులపై ఆసక్తి చూపడంతో బైజూస్ బిజినెస్ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి పీకలదాక చేరింది. అందుకే నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తోంది.…
ఎదో సినిమాలో ఎప్పుడు వస్తానో నాకే తెలియదు…ఏం మాట్లాడుతానో కూడా తెలియదు అనే డైలాగ్ ఉంటుంది. చాలా ఫేమస్ డైలాగ్ . ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ కు ఈ డైలాగ్ అచ్చు గుద్దినట్లు సరిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటారా..సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలను చూస్తె ఇది నిజమనే అనిపిస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని చూసేందుకు తాను వెళ్తానంటే వద్దన్నారని ఆయన మండిపడ్డారు. సచివాలయం వద్దని తాను అనుకున్నానని, దేవుడు కూడా అనుకున్నాడని… అందుకే సచివాలయం కాలిపోయిందని చెప్పారు. దేవుడు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పారు. ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూడా గెలవలేరని, అలాంటి వ్యక్తి ప్రధాని అవుతారా? అని ఎద్దేవా చేశారు. కొత్త…
వీఆర్ఎస్ తీసుకొని బీఆర్ఎస్ లో చేరిన సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐటీ గుప్పిట్లో చిక్కుకున్నారు. ఆయన నివాసంలో నాలుగు రోజుల నుంచి వరుసగా ఐటీ అధికారులు కంటిన్యూగా సోదాలు చేస్తున్నారు. ఏదో మతలబు లేకపోతే ఐటీ అధికారులు వరుసపెట్టి సోదాలు నిర్వహించరు. ఆయన కలెక్టర్ గా కొనసాగిన సమయంలోనే వెంకట్రామి రెడ్డిపై రాజకీయపరమైన విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పెద్దల కనుసన్నలో పని చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడే కేసీఆర్ కు పాదాభివందనం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.కేసీఆర్ తో మొదటి నుంచి వెంకట్రామిరెడ్డికి సాన్నిహిత్యం ఉంది. ఆయన అండతోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. వెంకట్రామి రెడ్డి కలెక్టర్ గా ఉన్నప్పుడే ఆయన కుటుంబం రాజపుష్ప పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ స్థాపించారు. లగ్జరీ అపార్టుమెంట్లు, విల్లాలు అమ్మడం వంటివి చేశారు. ప్రభుత్వ పెద్దలకు ఆయన బినామీ అని..ప్రభుత్వ…
ఫామ్ హౌసులు ఉండటం కాదు. అందరికీ నివసించేందుకు ఇల్లు ఉండేలా చొరవ చూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ తమిళిసై చురకలటించారు. అభివృద్ధి అంటే కొత్త బిల్డింగులు కట్టడం కాదని.. దేశాన్ని నిర్మించడమని సెక్రటేరియట్ నిర్మాణంనుద్దేశించి సెటైర్లు వేశారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శలు చేశారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక.. గవర్నర్ విషయంలోనూ తగ్గేది లేదంటూ ప్రభుత్వం కూడా ఎదురుదాడి చేసింది. మంత్రులు , ఎమ్మెల్యేలు , బీఆర్ఎస్ నేతలు గవర్నర్ వ్యాఖ్యలను ఖండిస్తూ రెచ్చిపోయారు. గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేయకుండా బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని సర్కార్ డిసైడ్ అయింది. ఇందుకోసం నోటిఫికేషన్ ఇచ్చింది. బడ్జెట్ ఫైల్ ఆమోదం కోసం గవర్నర్ కు పంపితే.. సంతకం పెట్టకుండా పెండింగ్ లో పెట్టారు తమిళిసై. సర్కార్ కు సీన్ అర్థమై హైకోర్టుకు వెళ్ళింది. అక్కడ వాదనలో తేడాలు వచ్చేశాయి. దాంతో చేసేదేం లేక గవర్నర్ ప్రసంగం…
నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఆనం రాంనారాయణ రెడ్డితోపాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. టీడీపీలోకి వెళ్ళాలనే నిర్ణయించుకొని వారు పార్టీపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. అవసరమైతే బీఆర్ఎస్ లో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్ కొనసాగిన సమయంలో నెల్లూరు జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కుగా వ్యవహరించారు శ్రీధర్ రెడ్డి. జగన్ సీఎం అయ్యాక తనకు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డిలకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. రెండో దఫా మంత్రివర్గ విస్తరణలోనైనా…