Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై మరోసారి చర్చ జరుగుతోంది. తాజాగా అభ్యర్థులను మార్చి మహిళలకు కొన్నిచోట్ల బీఆర్ఎస్ అవకాశం ఇవ్వడం అనుమానమే. ఎందుకంటే ఈ బిల్లు పాసైనా మహిళా రిజర్వేషన్ వెంటనే అమల్లోకి రావడం కష్టమే. అయినప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించడంతో అన్ని పార్టీలు మహిళలకు ఈ ఎన్నికల నుంచే గణనీయమైన సీట్లను కేటాయించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పెండింగ్ లో ఉంచిన నర్సాపూర్ , గోషామహల్, నాంపల్లి, జనగామ నియోజకవర్గాల్లో రెండు స్థానాలను మహిళలకు అవకాశం ఇవ్వాలనుకుంటోంది. తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించడం, ఈ క్రెడిట్ పొందేందుకు కవిత ఆరాట పడుతుంది. దీంతో బీఆర్ఎస్ పెండింగ్ లో ఉంచిన నాలుగు స్థానాల్లో కనీసం రెండు స్థానాల్లో అయిన మహిళలకు టికెట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ బాస్ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డిని బరిలో…
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారంలోపు లోక్ సభ , రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందితే.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ బిల్లులో ఉంటాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే వెంటనే వీటిని అమలు చేయడం కష్టం అవుతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగే వరకు మహిళా రిజర్వేషన్ ను అమలు చేయడం కష్టం. అందుకే బిల్లులో మహిళా రిజర్వేషన్ ను ఎప్పట్నుంచి అమలు చేయాలనే దానిపై కాలపరిమితి పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలకు సమయం సమీపించడంతో 2029 నుంచి మహిళా రిజర్వేషన్ ను అమలు చేసే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే అన్ని పార్టీలు 33శాతం మహిళలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. మహిళా రిజర్వేషన్ అమల్లోకి…
సినిమాలు మనిషిలో భావావేశాన్ని వెంటనే రగిల్చెందుకు ఓ మాధ్యమంగా ఉపయోగపడుతాయి. ఇప్పుడు ఆ మాధ్యమాన్ని తమ వ్యూహాలను, ఆలోచనలను ప్రజల మెదల్లోకి చొప్పించేందుకు ఓ సాధనంగా వాడుకుంటుంది బీజేపీ. కశ్మీర్ ఫైల్స్ ను వెనకుండి ప్రోత్సహించి ప్రజల మధ్య విభజన రేఖలు గీసిన బీజేపీ పెద్దలు…ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ తరహాలో తెలంగాణలో ఓ సినిమా తెరకెక్కించి హిందూ – ముస్లిం మధ్య విష బీజాలు నాటేందుకు సినిమాను రూపొందించారు. ఆ సినిమాయే రజాకార్. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో అనుష్య త్రిపాఠి హీరోయిన్ గా రజాకార్ సినిమాను బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా విజువల్స్, ఎమోషన్స్ ను అద్భుతంగా తెరకెక్కించారు కానీ, సినిమా స్టోరీ అంతా ఓ వర్గాన్ని శత్రువుగా చూపాలనే ఉత్సుకత ఉన్నట్లు తాజాగా విడుదల చేసిన టీజర్ లో స్పష్టంగా కనిపిస్తుంది. మతం మారని హిందువులను చిత్ర హింసలకు గురి చేసినట్లు, హిందూ మహిళలను…
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ప్రకటించారు. ఆరు గ్యారంటీలు: 1.మహాలక్ష్మి స్కీమ్ – మహిళలకు ప్రతి నెలా రూ. 2,000 సాయం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్. 2.రైతు భరోసా – రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్. 3.గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు. 4.ఇందిరమ్మ ఇండ్లు – ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం కేటాయింపు. 5.యువ వికాసం – విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు.…
హైదరాబాద్ లో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో ఉదయం స్కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించగా..ఆ తరువాత కేసీఆర్ ఫోటోతో బుక్ మై సీఎం అనే పోస్టర్లు ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. ఇటీవలి కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడ పేసీఏం …40 పర్సెంట్ యాక్సెప్టేడ్ పేరుతో బసవరాజ్ బొమ్మై ఫోటోతో పోస్టర్లు వెలిశాయి. ఈ ప్రచారం కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపిందని తేలింది. తాజాగా తెలంగాణలోనూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్ ఫోటోతో బుక్ మై సీఏం – స్కామ్ 2023 అంటూ పోస్టర్లు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశం అవుతోంది. ఈ పోస్టర్ల వెనక ఎవరు ఉన్నారనేది స్పష్టత లేదు కాని, ఇది కాంగ్రెస్ పనేనని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. కర్ణాటక ఎన్నికల సమయంలో పేసీఎం అనే ట్యాగ్ ఏవిధంగా ప్రభావం చూపిందో.. తెలంగాణ సీఎంపై అలాగే ప్రయోగించాలని కాంగ్రెస్…
అవును.. మీరు చదివింది నిజమే. లీటర్ పెట్రోల్ ధర రూ.331.38లు కాగా..డీజిల్ రూ.329.18లకు చేరింది. ఇది మరెక్కడో కాదు మన పొరుగు దేశం. పాకిస్తాన్ లో. పెట్రోల్, డీజీల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. సొంత వాహనాలపై ప్రయాణించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఇంధన ధరలు పెరిగితే అన్ని వ్యవస్థలపై దాని ప్రభావం పడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ లో అదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను రూ.26.2 పైసలు, డీజిల్ ధరను రూ.17.34 పైసలు పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.331.38, డీజిల్ ధర రూ.329.18 కు చేరింది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రజలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ఆర్థిక శాస్త్ర నిపుణులు. ఓ వైపు ఇందన ధరలు పెరుగుతుంటే సర్కార్ మాత్రం ద్రవ్యోల్బణ పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపడుతామని చెప్తుంది. ధరలను అదుపు చేయడంలో విఫలం అవుతూ ప్రజలను ఏవిధంగా…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ హామీలను గుప్పిస్తోంది. ప్రజలను ఆకట్టుకునేందుకు తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. కర్ణాటక ఎన్నికల్లో ఎలాగైతే ఐదు గ్యారెంటీలను ముందుంచి ప్రచార పర్వంలో దూసుకెళ్ళిందో ఇప్పుడు తెలంగాణలోనూ గ్యారెంటీలను ప్రకటించనుంది కాంగ్రెస్. తుక్కుగూడలో నిర్వహించనున్న విజయభేరి బహిరంగ సభలో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించనున్నారు. మొదట కర్ణాటకలో లాగానే తెలంగాణలో ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తారని లీకులు ఇచ్చారు కాని ఇక్కడ మరో హామీని అదనంగా చేర్చినట్లు సమాచారం. ఏడు ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. పార్టీ నుంచి అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆరు గ్యారెంటీలు ఇవేనని సమాచారం. తెలంగాణకు సోనియమ్మ ప్రకటించే ఆరు గ్యారెంటీలు రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ ఏకకాలంలో రూ.2లక్షల రైతు రుణమాఫీ ఆసరా పింఛన్లు నెలకు రూ.4000 ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ మహిళలకు ప్రతి నెల రూ.2వేల ఆర్థిక సాయం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు…
ఈ నెల 18నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఎంపీలకు స్పష్టత ఇవ్వకుండానే సమావేశాన్ని ముగించారు కేసీఆర్. పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, యూసీసీ వంటి అంశాలపై చర్చ జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో కేసీఆర్ సొంత పార్టీ ఎంపీలకు క్లారిటీ ఇవ్వలేదు. కాని బీసీ, మహిళా రిజర్వేషన్లపై ప్రధానికి కేసీఆర్ లేఖ రాశారు. ఆయా బిల్లులు సభలో చర్చకు వచ్చినప్పుడు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుందామని.. మీతో టచ్ లో ఉంటానని కేసీఆర్ ఎంపీలతో అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందే ఎంపీలతో సమావేశమై పార్టీ వ్యూహాన్ని ముందే ఖరారు చేసుకునే కేసీఆర్ మొదటిసారి వేచిచూసే ధోరణిని అవలంభిస్తుండటం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి మద్దతుగా నిలవకపోతే ఏం జరుగుతుందో కేసీఆర్ కు తెలుసు. బీజేపీకి మద్దతుగా నిలిస్తే మోడీకి సాగిలపడ్డారనే సంకేతాలు జనాల్లోకి వెళ్తాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా…
కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్గిందని సంబరపడేలోపు మరో మహమ్మారి కేరళను వణికిస్తోంది. కొత్త వైరస్ వెలుగుచూడటంతో కేరళలో కొత్త భయాలు ముసురుకుంటున్నాయి. నిఫా వైరస్ వెలుగుచూడటంతో కేరళలో ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా…కేసుల సంఖ్య పెరుగుతుందనే హెచ్చరికల నేపథ్యంలో పినరయ్ సర్కార్ అలర్ట్ అయింది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ ధాటికి ఇద్దరు ప్రాణాలు వదిలారు. వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ మరణాల రేటు అధికమని రాష్ట్ర ఆరోగ్య శాఖ వీనాజార్జ్ వెల్లడించారు. కేరళలో కనిపించిన వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్ అని కేరళ సర్కార్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వైరస్ కేసులు ఐదుకు చేరాయి. ఈ నేపథ్యంలో కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ వ్యాప్తిపై అధికారులు సమీక్ష నిర్వహించారు. కేసుల సంఖ్య పెరుగుతుందన్న హెచ్చరికలతో కోజికోడ్ జిల్లాలోని అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించారు అధికారులు. రెండు రోజులపాటు సెలవులను ప్రకటించిన అధికారులు..పరిస్థితి అదుపులోకి రాకపోతే మరోసారి…
తెలంగాణ ప్రజలు తాము ఏం చెప్పినా నమ్మేస్తారనే ధోరణితో ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మహిళలకు 33శాతం టికెట్లు బీఆర్ఎస్ కేటాయించినట్లుగా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు అన్ని పార్టీల మెడలు వంచి మిగిలింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉందన్నట్లుగా కవిత అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పిన తరువాతే హైదరాబాద్ లో సోనియా, రాహుల్ గాంధీలు అడుగు పెట్టాలని కవిత డిమాండ్ చేయడం విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో జనం లేరని.. రాహుల్ గాంధీ అవుట్ డేటెడ్ లీడర్ అని కవిత ఎద్దేవా చేశారు. కవిత తన పార్టీలో మహిళలకు 33శాతం టికెట్లు ఇప్పించకుండానే ప్రత్యర్ధి పార్టీలను ప్రశ్నిస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కవిత డిమాండ్ చేసినట్లుగా 33శాతం మహిళలకు టికెట్లు ఇవ్వాలంటే 119నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 39స్థానాల్లో అవకాశం ఇవ్వాలి. కాని కేసీఆర్ ఇచ్చినవి కేవలం 7మాత్రమే. సొంత పార్టీలో మహిళా రిజర్వేషన్ల…