Author: Prashanth Pagilla

(టర్కీ భూకంపంలో తన ప్రాణం వదిలి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి) అమ్మ! ఎందుకే నీ ఊపిరి నాకు ఊపిరిగా పోశావు బతికినంత కాలం గుండెనిండా ఊపిరి పోసుకోమని గాలి నిచ్చావు! ఎందుకే నాకు కడుపునిండా పాలిచ్చావు బతికినంత కాలం బొజ్జ నిండా తినమని పాడిపంటలిచ్చావు! ఎందుకే నాకు లాలపోసి జోలపాడావు బతికినంత కాలం ఆడుకోమని నది జలాలనిచ్చావు! ఎందుకే నన్ను నవమాసాలు మోశావు బతికినంత కాలం నన్ను మోయమని నెల నిచ్చావు! ఆ నేలతల్లి నన్ను కలకాలం మోయానని కంపించింది. టర్కీని నేల కడుపులో దాచుకుంది బతికినోళ్లకు పురిటినొప్పులు మిగిల్చింది. నీ గర్భంలో ఉన్న నన్ను కాలగర్భంలో కలిసిపోకుండా కడవరకు పోరాడవు! నన్ను నీ గర్భంలోంచి బయటపడేసే నువ్వు మాత్రం కాలగర్భంలో కలిసిపోయావు! అమ్మ! ఎందుకే నీకు ఇంత నిస్వార్ధం నీ కన్నపేగుకై గుండె పేగులు ఎలా తెంచుకున్నావు? – మోహన రావు దురికి టర్కీ భూకంపంలో ఓ…

Read More

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ను విడుదల కానుంది. ఇక, తెలంగాణలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి పరిధిలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు: 1. ప్రకాశం నెల్లూరు చిత్తూరు 2. కడప అనంతపురం కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు: 1. ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు 2. కడప- అనంతపురం- కర్నూలు 3. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం రెండు తెలుగు రాష్ట్రాల షెడ్యూల్… ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ మార్చి 13న పోలింగ్ మార్చి 16న కౌంటింగ్

Read More

భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్ కార్డియాలజిస్ట్ అసీమ్ మల్హోత్ర ‘కోవిషిల్డ్ వ్యాక్సిన్’ చాలా ప్రమాదకమని సంచలన ప్రకటన చేశాడు. ఈ వాక్సిన్ దుష్ప్రభావాలు mRNA వాక్సిన్ల కంటే ప్రమాదకరమని తాను జరిపిన ప్రయోగాల ఫలితాలను ప్రకటించారు. ఆస్ట్రేజన్ సంస్థ విడుదల చేసిన దీనివలన గుండెపోటు, పక్షవాతం లాంటి ప్రమాదక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన పరిశోధనాలల్లో తేలింది. ఇది నిజమని నమ్మడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. బ్రిటన్ లో ఈ వ్యాక్సిన్ పొందిన పదిశాతం మందిలో ఈ దుష్ప్రభావాలు కనిపించాయి. కరోనా మహమ్మారి వలన దేశంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాకు విరుగుడుగా వచ్చిన వ్యాక్సిన్ లతో చాలామంది కోవిడ్ ను జయించారు. ‘కోవిషిల్డ్ వ్యాక్సిన్’ ను తీసుకున్నవారిలో చాలామంది అనారోగ్య సమస్యలు వెలుగుచూస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చిన మొదట్లోనే ఈ టీకాలు మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు కూడా చెప్పారు. కాని తక్షణ ప్రమాద నివారణిగా…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజుకో అరెస్ట్ జరుగుతోంది. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, బోయినపల్లి అభిషేక్ లను అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నా వారికింకా బెయిల్ మంజూరు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును తాజాగా అరెస్ట్ చేశారు. మూడు రోజుల కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ వ్యవహారంతో ఒక్కొక్కరిగా సంబంధమున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ కేసుతో అసలు వారిని అరెస్ట్ చేయడం లేదని ఈ కేసుపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ వ్యూహాత్మకంగానే ఈ కేసును సీబీఐ, ఈడీ డీల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం సౌత్ గ్రూప్ అంతా ఒకరి లబ్ది కోసమే జరిగిందనీ… ఇందుకు సంబంధించి ఆధారాలను కూడా ఈడీ సేకరించింది. కేసులో అసలు నిందితుల చుట్టూ ఉచ్చు బిగించేందుకు ఒకరి తరువాత ఒకరిని అరెస్ట్ చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. చార్జీషీట్ లో ఢిల్లీ సీఎం…

Read More

దొంగలను పోలీసులు పట్టుకుంటే అది చట్టం. మరి పోలీసులే దొంగతనం చేస్తే ఏ చట్టం పట్టుకుంటుంది? విజయ్ మాల్యా, నిరవ్ మోడీ, అదానీ లాంటి నేరస్తులు బ్యాంక్లో లోన్లు తీసుకుని పంగనామం పెట్టారు. వాళ్లను క్షమించి.. మరి పంగనామాలు పెట్టుకుని రామనామాన్ని నిరంతరం స్మరించే బీజేపీ నేతలే లోన్లు తీసుకుని పంగనామం పెడితే ఎలా? వీళ్లను ఎలా క్షమించాలి ప్రజలు? పూజారి విగ్రహం దొంగిలిస్తే ఏ దేవుడు క్షమిస్తాడు? బీజేపీ నేతలు రాణి రుద్రమ, జిట్టా బాలకృష్ణ రెడ్డి తమకున్న పలుకుబడితో లక్ష్మీ విలాస్ బ్యాంకులో 18 కోట్ల లోను తీసుకున్నారు. అక్కడివరకు బాగానే ఉంది. కానీ తిరిగి చెల్లించలేదు. కనీసం వడ్డీ కట్టమని బతిమాలినా కట్టమని దబాయించారు. ఈ ఇద్దరి నేతలపై ఒత్తిళ్ళు అధికం కావడంతో వీరిద్దరూ కమిట్ మెంట్ మేరకు బీజేపీలో చేరినట్లు తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ లోన్ ఒత్తిళ్ళ నుంచి విముక్తి కల్పిస్తామనీ బీజేపీ నేతలు…

Read More

ఫిబ్రవరి 14న పుల్వామా సంస్మరణ దినం నిర్వహిస్తోంది మోడీ సర్కార్. అదే రోజు ఫిబ్రవరి 14న ఆవు కౌగిలింత అనే రోజని కేంద్ర సర్కార్ ప్రకటించింది. అదే రోజు జరుపుకునే వాలంటైన్ డే ని రద్దు చేయాలనీ శాసించారు. పది రోజుల ముందు ప్రేమికులు ప్రత్యేకంగా చాక్లెట్ డే అని, ప్రపోజ్ డే, కిస్ డే అనే రోజులను జరుపుకుంటారు. భారతీయ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఈ స్పెషల్ డేస్ ఉన్నాయనేది బీజేపీ వాదన. కాబట్టి ఈ పది రోజుల్లో ఎదో ఒక రోజు ఈ కౌ హాగ్ డే ను ప్రకటించిన సరిపోయేది కాని..పుల్వామా అమర వీరుల సంస్మరణ దినం రోజునే ఈ కౌ హాగ్ డే జరుపుకోవాలని ప్రకటించడం విడ్డూరంగా ఉంది. దీనితో దేశానికి ఎం సందేశాన్ని ఇవ్వాలని ఆరాటం? దేశాన్ని కాపాడే అమరవీరుల కంటే మతమే గొప్పా అని చాటడమా? ఇండియాలో వాలంటైన్స్ డే ను జరుపుకుంటున్నారు. సనాతన…

Read More

యశస్వి కొండెపూడి..సంగీత ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. సరిగమప సింగింగ్ షో లో జాను మూవీలోని లైఫ్ ఆఫ్ రామ్ అనే సాంగ్ పాడి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ షో లో సింగింగ్ టైటిల్ ను కూడా గెలుచుకున్నాడు. యూట్యూబ్ లో యశస్వి సాంగ్ ట్రెండింగ్ లో నిలిచింది. సినిమాలోని పాట కంటే కూడా యశస్వి సాంగ్ అద్భుతంగాను పాడాడని చెప్పుకొచ్చారు. సరిగమప సింగింగ్ కు జడ్జిలుగా వ్యవహరించిన వారు కూడా యశస్వికి మంచి ఫ్యూచర్ ఉందని ప్రోత్సహించారు. ఒక్క సాంగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు యశస్వి. సినిమాల్లో కూడా యశస్వికి అవకాశాలు వచ్చాయి. పలు ఈవెంట్స్ లో సిగ్గు పడుతూ కనిపించే ఈ యంగ్ సింగర్ మాట్లాడటానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడు. అలాంటి యశస్వి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తనది కాని స్వచ్చంద సంస్థను తానే నడుపుతున్నానని…సమాజ ఉద్దరకుడిగా చెప్పుకున్నాడని నవసేన ఫౌండేషన్…

Read More

బెంగళూర్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో నందమూరి తారకరత్న చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం ఎలా ఉందొ తెలుసుకోవాలని చాలామంది ఆరాట పడుతున్నారు. అటు నందమూరి ఫ్యామిలీ కాని, ఇటు వైద్య వర్గాల నుంచి ఎలాంటి హెల్త్ అప్డేట్ లేదు. తారకరత్న అవుటాఫ్ డేంజర్ అని పైకి చెబుతున్నా.. లోలోపల ఏదో జరుగుతుందన్న అనుమానం నందమూరి అభిమానుల్లో ఉంది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ మాటలు ఈ అనుమానాలను మరింత పెంచేశాయి. తాజాగా ‘అమిగోస్’ సంబంధించి కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్యం గురించి విలేకరులు కళ్యాణ్ రామ్ ను ప్రశ్నించగా నేరుగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు చెబుతారు. మనం చెప్పకూడదని సమాధానం దాటేశారు. నిజంగా.. తారకరత్న హెల్త్ గురించి కళ్యాణ్ రామ్ కు అప్డేట్ లేకుండా ఉంటుందా..? లేకపోయినా తెలుసుకునేందుకు ఆయన ఆసక్తి చూపకుండా ఉంటారా..? అన్నది…

Read More

బి జె పి అండదండలతో పలు అక్రమాలు చేసిన నిరవ్ మోడీ, విజయ్ మాల్యా సరసన ఇప్పుడు గౌతమ్ అదానీ కూడా చేరిపోయాడు. బి జె పి అధికారంలోకి రావడానికి ఈ ముగ్గురు వేలాది కోట్లు దానం చేశారు. పది రూపాయల లాభం లేనిదే రూపాయి దానం చేయని నీచ్ – కొత్తే – కామినే గాళ్లు. అధికారంలోకి రాగానే బి జె పి అండతో బ్యాంకులలో లోన్లు తీసుకున్నారు. ఆ కేసులను ఇండియాలో బయటపడకుండా మోడీ ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కానీ నిజాన్ని దాచవలసిన అవసరం విదేశీ సంస్థలకు లేదు. వాళ్లు డబ్బుకు లొంగరు. అవినీతిని దగ్గరికి రానీయరు. ప్రజలకు స్వచ్ఛ మైన పాలలాంటి నిజాలు అందిస్తాయి. ఈ ముగ్గురి బాగోతలు ముందుగా విదేశీ సంస్థలు బయట పెడితే కానీ మనకు తెలియలేదు. ఇప్పుడు గౌతమ్ అదానీ విషయంలో కూడా అదే జరిగింది. అయితే నిరవ్ మోడీ,…

Read More

ఫిబ్రవరి నెలఖారులో అసెంబ్లీని రద్దు చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పర్యటనలు, సభలు తీసుకుంటున్న నిర్ణయాలు ఇందులో భాగమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్.. అధికార యంత్రాంగాన్ని కూడా బదిలీ చేశారు. మిగిలిన బదిలీలను కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇచ్చిన హామీలను సైతం త్వరితగతిన అమలు చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా పోడు భూముల సమస్యను పరిష్కరించాలని కేసీఆర్ భావిస్తున్నారు, దీనిపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. రెండు రోజుల్లో పోడు భూముల ఇష్యూపై స్పష్టత రానుంది. ఈ నెల 17న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ తరువాత పది రోజుల్లో అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు మానసికంగా కేసీఆర్ రెడీ అయిపోయారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు. ఫైనలైజ్ చేసిన అభ్యర్థుల పేర్లను లీక్ కానివ్వడం…

Read More