Author: Prashanth Pagilla

మా పులి మాంసం తినదు, పులిహోర తిని పెరుగుతోంది అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పచ్చి అబద్దాలు చెపుతుంటే కెసిఆర్ చిరు నవ్వులు చిందించారు. బి జె పి నేతలు దానికి జై కొట్టారు అసెంబ్లీలో. మొదటినుంచి బిఆర్ఎస్ కి అనుబంధ సంస్థగా ఎంఐఎం ఉన్నదని అందరికి తెలుసు. 90 శాతం ముస్లింలు ఉన్న పాతబస్తి లో 38 శాతం కరెంట్ బిల్ కట్టరని అందరికి తెలుసు. అంటే ఏడాదికి దాదాపు రూ 800 కోట్లు. నేడు విద్యుత్ శాఖ నష్టాల్లో పుడుకుపోవడానికి పాతబస్తే కారణం అని ఆ శాఖ పలుమార్లు ఆధారాలతో సహా బయటపెట్టింది. ఆ డబ్బులు వసూలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని లోగడ మొట్టికాయలు వేసింది. అయినా ఎంఐఎంతో కుదిరిన చీకటి ఒప్పందం మేరకు మౌనం వహించి ఆ నష్టాన్ని తెలంగాణ మొత్తం కట్టేలా విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచింది. ప్రభుత్వ అసమర్థ పరిపాలన వల్ల యావత్తు తెలంగాణ…

Read More

పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ను డైనమేట్లు పెట్టి పేల్చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించగానే.. అలాంటి ప్రకటనలు చేయడానికి ఆయనెవరు.? చేస్తేగీస్తే తానే చేయలనుకున్నారో ఏమో కాని బండి సంజయ్ తెరమీదకు వచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త సచివాలయం డోమ్ లను కూల్చివేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంస్కృతి, సంప్రదాయమని టచ్ ఇచ్చారు. ఇలాంటి నిర్మాణాలు భారతీయత కాదని బండి సంజయ్ ఎందుకు అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి. తాజ్ మహల్ నామూనాను పోలి ఉందని బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తాజ్ మహల్ ను చూసేందుకు హిందువులు వెళ్తుంటారు. ముస్లింలు వెళ్తుంటారు. ప్రేమకు గుర్తింపుగా నిర్మించిన తాజ్ మహల్ నమూనా ఆధారంగా కొత్త సచివాలయం నిర్మిస్తే తప్పేంటి..?అనేది బీజేపీ నేతలకు కూడా ఓ పట్టాన అర్థం కావడం లేదు. పైగా.. మతకోణంలో ఆలోచించడం ఏంటని బండి సంజయ్ తీరును తప్పుబడుతున్నారు.…

Read More

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టుల పర్వం కంటిన్యూ అవుతోంది. దేశంలోని అనేకమంది ప్రముఖులకు ఈ లిక్కర్ కుంభకోణంతో సంబందం ఉన్నట్టు గుర్తించిన ఈడీ… ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వారికి సంబంధించిన ఇల్లు, కార్యాలయాలతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా అనేక సార్లు సోదాలు నిర్వహించి కీలక సమాచారం,ఆధారాలు సేకరించింది. ఓ వైపు సోదాలు చేస్తూనే అరెస్టులు మొదలుపెట్టింది. ఇటీవల కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును అరెస్ట్ చేయగా..తాజాగా ఎంపీ కుమారుడిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ తో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డికి సంబదించిన వాళ్ళుకు నోటీసులు జారీ చేసిన ఈడి… శనివారం ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు రాఘవ రెడ్డిని అరెస్టు చేయడం సంచలనం కలిగిస్తుంది. ముందు ముందు ఇంకెవరిని అరెస్ట్ చేయబోతున్నారో అని ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ఈ…

Read More

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి “యాత్ర”తో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. పోడు భూములకు పట్టాలిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుటా హుటినా ప్రకటించారు. ములుగు నుంచి యాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి పోడు భూముల ఇష్యూనే ప్రధానంగా ప్రస్తావించారు. 2018 ఎన్నికల సమయంలో పోడు భూములకు పట్టాలిస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిందనీ, నాలుగేళ్ళు అవుతున్నా కేసీఆర్ హామీని నెరవేర్చలేదని రేవంత్ గుర్తు చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలోనూ పోడు భూములపై గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు నటించారని ఇప్పటివరకు మళ్ళీ ఆ ఊసే లేదని రేవంత్ ప్రతి ప్రసంగంలో చెప్తూ ఈ ఇష్యూను హైలెట్ చేశారు. పోడు భూములకు పట్టాలను బీఆర్ఎస్ సర్కార్ ఇవ్వకపోతే కాంగ్రెస్ ఇస్తుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరో పది నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనీ … పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలివ్వాలనే ఫైల్ మీద మొదటి సంతకం చేస్తుందని ప్రకటించారు.…

Read More

తెలంగాణ బిజెపి రెండుగా చీలింది. ఒక గ్రూప్ కి బండి సంజయ్ నాయకుడు. వీళ్ళు బిజెపి గూటి పక్షులు. మరో గ్రూప్ కి ఈటల రాజేందర్ నాయకుడు. ఈయన గ్రూప్ లో వలస పక్షులు ఉన్నాయి. బండి సంజయ్ కి డైపర్ బలుపు ఎక్కువుంటే ఈటల కాస్త టంగ్ పవర్ ఎక్కువ. బండి సంజయ్ కి బిపి ఎక్కువుంటే ఈటలకి షుగర్ లెవల్ ఎక్కువ. బండి సంజయ్ కి కొలస్ట్రాల్ ఎక్కువుంటే ఈటలకి హిమోగ్లోబిన్ ఎక్కువ. దొందు దొందే. ఒకరి మీద మరొకరు సిగపట్లు పట్టుకుంటున్నారు. చీలిన ఈ పార్టీని ఫెవికాల్ పెట్టి అతికించాలని నడ్డా చేసిన ప్రయత్నాలు ఈ గద్ద మీద పలించలేదు. ఇద్దరినీ కలపాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బెడిసి కొడుతున్నాయి. ఇటీవలి సమావేశంలో పార్టీలో కోవర్టులు ఉన్నారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని అమిత్ షా కు నడ్డా మోశాడు. ఈటలను పికేయడం…

Read More

పోడు భూముల సమస్యపై కేసీఆర్ మళ్ళీ మొదటికొచ్చారు. పోడు పట్టాలు ఇస్తామని అంటూనే అఖిలపక్ష సమావేశం ప్రస్తావన తీసుకొచ్చారు. నిజంగా..కేసీఆర్ కు పోడు భూములను అర్హులైన వారికీ కట్టబెట్టి పట్టాలిచ్చే యోచనే ఉంటె..అఖిలపక్ష సమావేశం ప్రస్తావన తీసుకురారు. కానీ ఆయన అదే చేశారు. అన్ని పార్టీలు అంగీకరిస్తే పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని కేసీఆర్ ప్రకటించారు. అన్ని పార్టీలు ఒప్పుకున్నంత మాత్రాన పట్టాలు ఇచ్చేయోచ్చా అంటే..? ఇవ్వలేం. కాని కేసీఆర్ మాత్రం కొత్త వాదనను వినిపిస్తున్నారు. అటవీ భూములకు పట్టాలివ్వాలంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం 2005కి ముందు నుంచి పోడు భూముల్ని సాగు చేసుకుంటున్న వారికి మాత్రమే పట్టాలివ్వాల్సి ఉంటుంది. 2005 డిసెంబర్‌ 13 కంటే ముందు అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజనులందరికీ భూమిపై హక్కు కల్పిస్తూ పట్టాలు ఇవ్వాలి. లక్షా 60 వేల ఎకరాలు మాత్రమే…

Read More

గద్దకు దాన వేయకు పుణ్యమే. కానీ కాకులను చంపి వేయడం పాపం. దుమ్ము దూలి తగ్గించాలంటే నగరంలోని రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రాథనా మందిరాలు కూల్చే చట్టాన్ని తీసుకు వస్తామని కేటిఅర్ శాసనసభలో ప్రకటించారు. ఇక ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే రోడ్డు మీద ఉండే ప్రార్ధన మందిరాలు కుల్చాలి అని బిఆర్ఎస్ లోగడ చూసింది. దానిని బిజెపి అడ్డంగా వాడుకుని నగరంలో కార్పొరేట్ ల సంఖ్యను పెంచుకుంది. ఇప్పుడు ఆ నినాదాన్ని మార్చారు. దుమ్ము దూలి తగ్గించడానికి అని కొత్త నినాదం ఎత్తుకున్నారు. ప్రార్ధన మందిరాల ద్వార దుమ్ము దులి ఎలా వస్తుది? ఆవి సిమెంట్ ఫ్యాక్టరీ లా? కేమికాల్ ఫాక్టరీ లా? ప్రార్ధన మందిరాలు మన దారికి అడ్డంకుāలు కాదు. మన మతాలకు, మన విశ్వాసాలకు, మన సంస్కృతికి రహదారులు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యలను ఎలా తగ్గించాలి అని అడిగితే – మంచం పట్టిన బామ్మను ముందు చంపండి…

Read More

పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చివేస్తె తప్పేంటని ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుండగానే.. నూతన సచివాలయంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోములు కూల్చివేస్తామని వ్యాఖ్యానించారు. తెలంగాణ నూతన సచివాలయం భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేదని బండి సంజయ్ విమర్శించారు. తాజ్ మహల్ తరహాలో ఉన్న సచివాలయ డోములు తెలంగాణ సంస్కృతికి భిన్నంగా ఉన్నాయని…వాటిని కూల్చి, తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక మార్పులు చేస్తామని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం అధినేత ఒవైసీ కళ్ళలో ఆనందం కోసమే తాజ్ మహల్ నమూనాతో కొత్త సచివాలయాన్ని కేసీఆర్ నిర్మించారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సంస్కృతిని వదిలేసి తాజ్ మహల్ నమూనాతో సచివాలయ డోమ్ లను నిర్మించారని మండిపడ్డారు. https://youtu.be/LJ78sw93REY మంత్రి కేటీఆర్ రోడ్డు పక్కన ఉన్న…

Read More

తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామని కెసిఆర్ ఇచ్చిన ప్రకటనలు కోకా కోలా – తమ్సప్ వ్యాపార ప్రకటనల కంటే వంద రెట్లు ఎక్కువ. దానికి తోడూ హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చుతాము – విశ్వదాభిరామా వినుర వేమా అని నీతులు చెప్పారు. బాగానే ఉంది. తెలంగాణ బడ్జెట్ చూస్తే మూల విరాట్టుడే మూలకు కూర్చుంటే – నైవేద్యం లేదని ఉత్సవ విగ్రహాలు ఏడిచినట్లు ఉంది. ప్రధానమైన శాఖలకు ఎలాగో అరకొర నిధులు కేటాయించారు. కనీసం చిన్న చిన్న శాఖలకు కూడా సరిపడే నిధులు కేటాయించలేదు. దీనికి తోడూ బిఆర్ఎస్ లో చెక్క భజన చేసేవాళ్ళు మరీ ఎక్కువయ్యారు. రాజు గారు దగ్గినా చప్పట్లు కొట్టడం – పిత్తినా చప్పట్లు కొట్టడం లాగా ఆర్థిక మంత్రి ఏం చెప్పినా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బల్లలు బాడుడే బాదుడు. ఇదెక్కడి చెక్క భజన? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ది కి రూ.11,372 కోట్లు కేటాయిస్తారా? దానికి బిఆర్ఎస్…

Read More

టీమిండియా సారధి రోహిత్ శర్మ కొత్త రికార్డును నెలకొల్పాడు. దాదాపు రెండేళ్ళ తరువాత రోహిత్ సెంచరీ చేశారు. టెస్టుల్లో 9వ శతకం బాదిన రోహిత్ శర్మ ఓ అరుదైన ఫీట్ ను సాధించాడు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ రోల్ లో అతను సెంచరి బాదాడు. 2021లో ఇంగ్లండ్ పై చివరిసారిగా రోహిత్ సెంచరీ చేశారు. స్పిన్ కు అనుకూలిస్తోన్న నాగపూర్ పిచ్ పై ఒకరెనుక ఒకరు పెవిలియన్ కు క్యూ కడుతుంటే రోహిత్ ఒక్కడే సెంచరి చేశాడు. ఆస్ట్రేలియాపై కెప్టెన్ గా తొలి సెంచరీ చేసిన రోహిత్ శర్మ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20, వన్డే, టెస్టు మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఏకైక భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా పాక్ కెప్టెన్ బాబర్ అజాం, ఫాఫ్ డుప్లెసిస్, తిరకరత్నే దిల్షాన్ మాత్రమే ఇంతకుముందు ఈ ఫీట్ సాధించారు.…

Read More