Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
మనుషులు రోజురోజుకు మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారు. వావివరసలు పక్కనపెట్టేసి వివాహ బంధంతో ఒకటి అవుతున్నారు. హిందూ సంప్రదాయంలో అన్నా- చెల్లెళ్ళ బంధాన్ని అందరూ గౌరవిస్తారు. ప్రేమిస్తారు. అన్నా- చెల్లెళ్ళలో ఒకరంటే ఒకరికి అనంతమైన ప్రేమ, అభిమానం ఉండి ఉంటుంది. అన్నయ్యపై చూపే ప్రేమకు కానుకగా చెల్లికి మంచి వరుడిని చూసి పెళ్లి చేయాలని అన్నయ్యలు తపిస్తారు. కాని ఓ మూర్ఖుడు కక్కుర్తిపడి సొంత చెల్లినే పెళ్లి చేసుకొని మానవ సంబంధాలను మంటగలిపాడు. సొంత చెల్లిని ఓ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. కారణం.. ప్రభుత్వం నుంచి వచ్చే తాయిలాలను పొందేందుకోసం. సర్కార్ ఇచ్చే సాయం కోసం మనవ సంబంధాలను అపహాస్యం చేస్తూ సొంత చెల్లికి మూడు ముళ్ళు వేశాడు. ఇలాంటి వాడిని ఏం చేసినా తప్పు లేదంటూ అందరూ ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నజరానాల కోసం ఇంతటి దారుణానికి ఒడిగడుతాడా నీచుడు అంటూ “ఛీ” కొడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో…
1976 లో అమితాబ్, రాఖి, శశి కపూర్ నటించిన ‘కబి కబి’ సినిమాలోని ‘కబి కబి మేరే దిల్ మే కయాలు ఆతి హై’ పాట మీకు గుర్తుందా? గుర్తులేదా? శశి కపూర్ శోభనం గదిలో రాఖి నగలు ఒకొక్కటిగా ఒలుస్తూ ఉంటాడు. తర్వాత ఆమె ముసుకు తీసి ఆమె చేతులు పిసుకుతారు. ఇప్పుడు గుర్తుకు వచ్చిందన్నమాట! అప్పట్లో ఆ పాట దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. తొలిసారి శోభనం సీన్ చూపడం, ఆమె నగలు మెల్లిగా తొలగించి నందుకే ఆ సినిమాను బ్యాన్ చేయలని పార్లమెంట్ దద్దరిల్లిది. సెన్సార్ వాళ్ళను సస్పెండ్ చేశారు. అది సినిమా కాబట్టి సరిపోయింది. సరిగ్గా ఇప్పుడు అలాంటి శోభనం సీన్ సోషల్ మీడియాలో సంచలం రేపుతోందో. సోషల్ మీడియా అనేది ఇప్పుడు సెల్ ఫోన్ లో ఇమిడిపోయిన ప్రపంచం. పుట్టిన రోజులు మొదలుకొని గిట్టిన రోజుల విడియోలను ఎలాంటి సెన్సార్ లేకుండానే పెట్టుకోవచ్చు. ఎంతమంది…
సినీతరాలకు రకరకాల వింత రోగాలు వస్తున్నాయి. హీరోయిన్ సమంత “మయోసైటిస్” అనే వ్యాధితో పోరాడి చావు గండం నుంచి బయటపడగా.. తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అస్వస్థతకు గురయ్యానంటూ ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ పోస్ట్ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గుండెకు సంబంధించిన వ్యాధితో చాలా కాలం నుంచి బాధపడుతున్నాను. ఈ సమస్య నుంచి తొందరగా కోలుకునేందుకు శక్తిని కూడదీసుకుంటున్నాను. అయితే.. తాను మళ్ళీ ఆరోగ్యం ఉండాలంటే మీ అందరి దీవెనలు కావాలంటూ రేణు దేశాయ్ చేసిన పోస్ట్ ఎమోషనల్ గా ఉంది. రేణు దేశాయ్ ఈ పోస్ట్ చేసిన వెంటనే పవన్ అభిమానులు.. ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆమెపై ప్రత్యేక తరహ అభిమానం చూపిస్తున్నారు. ఆమెని తమ సొంత వదినలాగానే ట్రీట్ చేస్తూ.. త్వరగా కోలుకోవాలంటూ…
మనకు మంచినీటి పైపులు, డ్రైనేజీ పైపులు రెండు పక్కపక్క నే ఉంటాయి. కానీ అవి కలవవు. కాలవకూడదు కూడా. మన దేశ రాజకీయం ఎప్పుడో డ్రైనేజీ పైపుల్లా మారింది. మన దేశంలో న్యాయవ్యవస్థ మంచినీటి పైపులా ఇంకా పవిత్రంగా ఉన్నది. మన దేశంలో అన్ని రంగాలు కలుషితమయినప్పటికి న్యాయవ్యవస్థ ఒక్కటి ఇంకా కలుషితం కాలేదు. అందుకే మన రాజ్యాంగం న్యాయవ్యవస్థకు ప్రతేక్య ఎస్టేట్ హోదా నిచ్చింది. ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి ఈ రెండు పైపులను కలపాలని చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బిజెపి తమ పబ్బం గడుపుకోడానికి న్యాయవ్యవస్థకు పదవుల ఎరను చూపుతోంది. అంటే ఇకపై బిజిపి ప్రభుత్వానికి జడ్జీలు అనుకూలంగా ఉంటే మీ పదవీ విరమణ తర్వాత గవర్నర్, ఎం పి లాంటి పదవులు ఇస్తాము అనే సందేశాన్ని పరోక్షంగా పంపుతున్నారు. ఈ మిషన్ ను బి జె పి చాపకింద నీరులా ఎప్పుడో ప్రవేశపెట్టింది. 2014 లో…
మోడీ, అమిత్ షా లు పగబడితే సీన్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. కర్ర విగకుండా పామును చంపడం ఈ ఇద్దరి నేతల స్టైల్. రాజకీయ ప్రత్యర్ధుల్నే లెక్క చేయని ‘మోషా’ల ద్వయం.. వారిని ఇరుకునపెట్టె కథనం విడుదల చేసిన ఓ వార్త సంస్థను క్షమించి వదిలేస్తారా..? ఛాన్సే లేదు. గుజరాత్ లో గోద్రా అల్లర్లకు సంబంధించి బీబీసీ ఓ డాక్యుమెంటరీని ఆన్ లైన్ లో ఇటీవల రిలీజ్ చేసింది. ఈ గోద్రా అల్లర్లలో మోడీకి ప్రమేయం ఉందని ఆ డాక్యుమెంటరీలో ఉండటంతో మోడీకి ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగితే కక్ష సాధింపు చర్యలు అనుకుంటారు. పవర్ లో ఉన్నోడితే పెట్టుకుంటే ఎలా ఉంటుందో చేయాలని కొద్ది రోజులు ఆగి అసలు పిక్చర్ ను చూపిస్తుస్తున్నారన్నట్టు. గోద్రా అల్లర్ల గురించి ఎక్కడ చర్చ జరగకుండా మోషాల ద్వయం చూసుకుంటుంది. ఈ చర్చను పదేపదే లేవనెత్తిన వాళ్ళను అర్బన్…
అదానీ వ్యవహారంలో దేశ స్థాయిలో కాంగ్రెస్ ఇమేజ్ అమాంతం పెరిగింది. పార్లమెంట్ లో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ దెబ్బకు ప్రధాన మంత్రి మోడీ నీళ్లు తాగారు. తొమ్మిదేళ్లు అప్రతిహతంగా… తనకు ఎదురే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న మోడీకి అదానీ వ్యవహారం గుదిబండగా మారింది. ఇప్పటికే భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు అట్రాక్షన్ తెచ్చిన రాహుల్ గాంధీ తాజాగా పార్లమెంట్ లో అదానీ కుంభకోణంపై చెలరేగిన తీరు కాంగ్రెస్ ఇమేజ్ ను, రాహుల్ గాంధీ ఇమేజ్ ను ఆకాశంలో నిలబెట్టింది… సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజా వ్యాఖ్యలు బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. దక్షిణాదిలో… అదీ అర్బన్ ప్రాంతాల్లో అంతో ఇంతో పుంజుకున్నామన్న భావనలో ఉన్న బీజేపీకి అదానీ దెబ్బ మామూలుగా తగలలేదు. దక్షిణాదిలో ముఖ్యంగా కర్నాటక, తెలంగాణలో మాత్రమే బీజేపీ ఉనికి ఉంది. ఆ ఉనికి సైతం దెబ్బతింటున్న సమయంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు…
మొదటినుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన నాలుకకు ఉన్న దురదను ప్రెస్ మైక్ తో గోక్కున్నాడు. ఇంట్లో ఉన్న ఎలుకలను చంపుతున్నాని ఇంటికి నిప్పు పెట్టినట్లు ఇంది ఆయన పద్దతి. కాంగ్రెస్ స్టార్ క్యంపెనర్ గా నోటికొచ్చింది వాగారు. అతను చేసిన వ్యాఖ్యలు బిజెపికి మేలు చేసేవిదంగా ఉన్నాయి. కాంగ్రెస్ కొంప ముంచేలా ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్లు అందరు ఎకమయినా, రేవంత్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 40 నుంచి 50 సీట్లు గెలవలేదని చిలక జోస్యం చెప్పారు. ఏ చెట్టు కింద కూర్చున్నాడో ఆ చెట్టు కొమ్మలు విరచాలని చూస్తున్నారు. మరో పార్టీలోకి దూకడానికి సిద్దపడినట్లు ఉన్నాయి ఈ ‘జంప్ జిలాని మాటలు’. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపించలేదని అన్నారు. అందుకుగాను మరో జాతీయ పార్టీ బిఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని ఓ దిక్కుమాలిన సలహా…
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పాదయాత్ర ద్వారా ఓ వైపు రేవంత్ రెడ్డి భరోసా కల్పిస్తుంటే.. పార్టీకి అంత సీన్ లేదని తేల్చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వచ్చేది హాంగ్ ప్రభుత్వమేనని.. కాబట్టి బీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్పేంటి అంటూ మాట్లాడారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలు. బీజేపీని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ ఉన్నాయి. చచ్చినా బీఆర్ఎస్ తో కలవబోమని రేవంత్ మొదలు రాహుల్ గాంధీ వరకు పదేపదే చెప్తున్నా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ తో కలిస్తేనే అధికారంలోకి వస్తామని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లో సీనియర్లంతా కష్టపడి పని చేస్తే పార్టీకి 40 నుంచి 50సీట్లు మాత్రమే వస్తాయని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్ళు.. రేవంత్ తో ఏమి కాదని.. ఒరిజినల్ కాంగ్రెస్ వాదులే పార్టీని పవర్ లోకి…
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానం ప్రదర్శించడంతో తెలంగాణ రాజకీయాల్లో కీలక చర్చ ప్రారంభమైంది. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరిస్తోన్న నేపథ్యంలో పాత మిత్రులను కేసీఆర్ కలుపుకుపోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈటలతోపాటు గతంలో పార్టీని వీడి వెళ్ళిన నేతలకు కేసీఆర్ గాలం వేస్తున్నారని కథనాలు వచ్చాయి. బీజేపీలో ఎలాంటి ప్రాధాన్యత లేక అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా తిరిగి సొంత గూటికి చేరనున్నారనే వార్తను ఓ పత్రిక ప్రచురించింది. అలాగే, ఈటల బీజేపీలోనే కంటిన్యూ అవుతారా ..? ఆయన కూడా జంప్ చేస్తారా..? అని రెండు వార్తలను ప్రచురించడంతో…ఆ పేపర్ క్లిప్పింగ్ లను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొండా పార్టీ మార్పుపై ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అంత తెలంగాణ ఉద్యమ ద్రోహులతో నిండిపోయిందని…ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారి ఫొటోలను…
పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగింది మేలన్నది అవుట్ డేటెడ్ సామెత. పరుగెత్తి లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం కంటే నిలబడి బీర్ తాగింది మేలు అన్నది అప్ డేట్ సామెత. పరుగెత్తి కెసిఆర్ చేసిన తొందరపాటు చర్యలవల్ల అన్ని పనులు వాయిదాలు పడుతున్నాయి. మొన్న సచివాలయం ప్రారంభోత్సవం, కొండగట్టు ఆంజనేయస్వామి సందర్శన వాయిదా పడింది. దీనికి చాలా రాజకీయ కారణాలు ఉన్నాయి. అందులో ప్రదానమైనది సెప్టెంబర్ 11, 2018 కొండగట్టు మీద ఘోర బస్సు ప్రమాదం జరిగి దాదాపు 60 మంది చనిపోయారు. నాడు వాళ్ళను పరామర్శించేందుకు కెసిఆర్ రాలేదు. చనిపోయినవాళ్ళ కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. అక్కడ బిఆర్ఎస్ దాదాపు ఉడుచుకుపెట్టిపోయేలా ఉందని సర్వేల రిపోర్టులు అందాయి. దాంతో చలించిన కెసిఆర్ తన తప్పులను సరిదిద్దుకునే పని మొదలుపెట్టాడు. అందులో భాగంగా హుటాహుటిన ఆ గుడికి 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన…