Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా! అని తెలుగు సినిమా తొలి గాయకుడు ఎం.ఎస్. రామారావు ఏడుస్తూ ఈ పాటను పాడి తెలుగు ప్రజలను ఏళ్ల తరబడి ఎడిపిస్తున్నాడు. దీని అర్థం తెలుసా? ఈ విశాలమైన తాజ్ మహల్ సమాధిలో, ప్రశాంతంగా ఉన్న ఆగ్రా శ్మశాన వాటికలో, ఏకాంతంగా ఉన్న నీ సమాధిలో హాయిగా నిదురించు జహాపనా (ముంతాజ్ ముద్దుపేరు) అని శవాన్ని జో కొట్టడం. తాజమహల్ కట్టిన తర్వాత మొఘల్ చక్రవర్తి షాజహాన్, అతని వంశస్తుల సమాధులు కూడా అక్కడే కట్టాలని ఎవరో సూచించారు. కానీ దానికి చక్రవర్తి షాజహాన్ ఒప్పుకోలేదు. ఆమె చితి నిద్రకు భంగం వాటిల్లుతుందని భయపడ్డారు. ఒంటరిగా , ప్రశాంతంగా ఆమెను శాశ్వతంగా నిదురపోనివ్వాలి అని చెప్పాడు. ఆమె మీద అతనికున్న అమర ప్రేమ అది. ఆమె అతనికి ప్రేయసి కాదు. భార్య. ఆమెతో తనివితీరా దాంపత్యం చేసి పన్నెండు మంది పిల్లలను…
ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నోటి దురదతో చేసిన కామెంట్స్ బండి సంజయ్ కి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అయ్యింది. కాదు….కాదు…. కోతికి విస్కీ బాటిల్ దొరికినట్లు అయ్యింది. దీనిని పట్టుకుని బిఆర్ఎస్, కాంగ్రెస్ జతకట్టాయని అక్రమ సంబంధం అంటగట్టాడు. ఆ మాట కొస్తే బిజెపి, బిఆర్ఎస్ కి మొదటినుంచి అక్రమ సంబంధం ఉన్నదని కాంగ్రెస్ వాదించింది. దానిని నిజం చేస్తూ బండి నేడు రైడింగ్ లో దొరికాడు. అది ఎలాగో చెప్పాలంటే కొంచం వెనక్కి వెళ్ళాలి. రెండేళ్ళ కిందట జరిగిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో లింగోజీ గూడ డివిజన్ నుంచి బిజెపి కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ గెలిచారు. ఆయన ప్రమాణస్వీకారం చేయకుండానే చనిపోయారు. మళ్ళి ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం కోసం మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, నేతలు నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానున్న కేటీఆర్ ను…
పేరుమోసిన స్వామిజీల ఆశీస్సుల కోసం గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్యాత్మిక క్షేత్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బీజేపీకి కౌంటర్ గానే ఆమె ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్నారన్న అభిప్రాయాలు వినిపించాయి. కానీ ఆమె హిందూ దేవాలయాలు , పేరుమోసిన బాబాల చుట్టూ అదేపనిగా తిరిగేందుకు అసలు కారణం మరొకటి ఉందన్న మాట వినిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత. ముఖ్యమంత్రి కేసీఆర్ గారాలపట్టి. కేటీఆర్ కంటే కూడా కవితకే వ్యక్తిగతంగా కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని బీఆర్ఎస్ నేతలు చెప్పేమాట. అలాంటి కవితకు పెద్ద కష్టమొచ్చింది. లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు మారుమోగుతోంది. సీబీఐ అధికారులు ఈ విషయమై నోటిసు ఇచ్చి విచారించారు కూడా. త్వరలోనే కవితను మరోసారి విచారిస్తారని కేంద్ర దర్యాప్తు సంస్థలు లీకులు ఇస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసిన దర్యాప్తు సంస్థలు ఒక్కొక్కరిని అరెస్ట్ చెస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో బోయినపల్లి అభిషేక్…
అవును. ఈ వార్త మీకు అతిశయోక్తిగా అనిపించొచ్చు. కానీ జరుగుతోన్న పరిణామాలను సునిశితంగా గమనిస్తే ఈ డౌట్ రాక మానదు. ఆప్ – బీఆర్ఎస్ రెండు పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని తాపత్రయపడుతోన్న పార్టీలే. ఈ ప్రయాణంలో బీఆర్ఎస్ కన్నా ఆప్ ముందంజలో ఉందన్నది స్పష్టం. ఈ విషయం బీఆర్ఎస్ నేతలకూ తెలుసు. ఆప్ కు దీటుగా బీఆర్ఎస్ ను జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించేలా చేయాల్సిన బీఆర్ఎస్ నేతలు ఆ పని చేయడం లేదు. కానీ ఆ బాధ్యతను ఆప్ సీఎం తీసుకోవడం గమనార్హం. పంజాబ్ ఆప్ సీఎం భగవంత్ మాన్ కు బీఆర్ఎస్ సీఎం పాలన నచ్చింది. తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని దాని గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనల వలన తెలంగాణ అభివృద్ధి గురించి తెలుసుకొని… పంజాబ్ లో ఎంతమేర అమలు చేస్తారో…?చూడాలి. భగవంత్ మాన్ టూర్…
ఇద్దరు పిల్లలు పుట్టాక ఇక చాలు అనుకునే వయసుమీరిన దంపతులకు, పెళ్లి కాగానే ఇప్పట్లో పిల్లలు వద్దనుకునే నవదంపతులకు, పెళ్ళికి ముందే గర్భం వస్తుంది అని భయపడే ప్రేమికులకు గొప్ప శుభవార్త. ఇకపై ఆడవాళ్ళు గర్బ నిరోదక మాత్రలు వాడవలసిన పని లేదు. ఇకపై మగవాళ్ళు వాడితే చాలు. అవును. మగవాళ్ళకు కూడా గర్భ నిరోధక మాత్రలు రాబోతున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ కి చెందిన వెయిల్ కార్నెల్ మెడికల్ స్కూల్ చేసిన ఈ పరిశోధన విజయవంతమైంది. ముందుగా ఎలుకల మీద ప్రయోగం చేసి ఫలితాలు రాబట్టి ఇప్పుడు మగవాళ్ళ మీద ప్రయోగాలూ చేస్తున్నారు. ఈ అద్భుత ప్రయోగం గురించి నేచుర్ కమ్యూనికేషన్స్ జర్నల్ ఈ నెల 14న ప్రచురించింది. ఇది ఎలా పనిచేస్తోందో వివరించారు. ఈ మాత్ర మగవాళ్లలోని ఏ హార్మోనియానికి హాని తలపెట్టదు. మగవాడి వీర్యంలో చాలావరకు గంజిలాంటి జిగురు ద్రవమే ఉంటుంది. చాలా తక్కువ శాతంలో వీర్య కణాలు…
అనేక పరిణామాల మధ్య ఏపీ క్యాడర్ లో చేరిన సీనియర్ ఐఏఎస్ సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ కు మొగ్గు చూపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నత హోదాలో పని చేసిన సోమేశ్ కుమార్…ఏపీ ప్రభుత్వంలో చిన్న స్థాయిలో పని చేయడం ఇష్టం లేక వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నా…అసలు మతలబు వేరే ఉందన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాలని హైకోర్టు తీర్పునివ్వడం… ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సిందేనని డీవోపీటీ ఆదేశించడంతో సోమేశ్ కుమార్ విధిలేని పరిస్థితుల్లో ఏపీలో రిపోర్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సాన్నిహిత్యం ఉండటంతో సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్ళినా అక్కడ కూడా ఆయనకు మంచీ ప్రాధాన్యత గల పోస్టును ఆఫర్ చేస్తారని అనుకున్నారు. సోమేశ్ కుమార్ ఏపీ సీఎం జగన్ ను కలిసినప్పుడు గౌరవం తగ్గకుండా చూసి పోస్టింగ్ ఇస్తామని తనకు ఆఫర్ చేశారు. అయినా..…
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఏమో కానీ వైసీపీ నేతలకు మాత్రం నిద్ర పట్టడం లేదు. యాత్ర చేస్తానంటే ‘వారాహి’ వాహనం నిబంధనలకు విరుద్దంగా ఉందని అభ్యంతరం తెలిపింది. తాజాగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎందుకు చేయడం లేదని వాకబు చేస్తూ వైసీపీ నేతలు తమ పైత్యాన్ని బయటపెట్టుకుంటున్నారు. వాళ్ళో వాలకం. వాళ్ళో ప్రపంచం. వాళ్ళు అంతే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏడాది ముందే పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభించారు. మధ్యలో ఆగినా.. యాత్రను అయితే కంప్లీట్ చేశారు. ఈ సారి మాత్రం ఇక రోడ్డెక్కుతున్నానని ప్రకటించి ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి పూజలు కూడా చేయించారు. కానీ వారాహి రోడ్డుమీదకు రావడానికి ఆలస్యం అవుతోంది. మొదట్లో వారాహిపై అభ్యంతరం తెలిపిన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు వారాహి ఎందుకు రోడ్డు మీదకు రావడం లేదని వాళ్ళలో వాళ్లు పంచాయితీ పెట్టుకుంటున్నారు. ఏంటో ఈ…
జనసేన ప్రచార రథం ‘వారాహి’కి తెలంగాణలో ఉన్న కొండగట్టు ఆంజన్న సన్నిధిలో పూజ చేయించారు పవన్ కళ్యాణ్. అది మంగళవారం కావడం వలన ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆ భక్తులను పక్కకు నెట్టి విఐపి కోటాలో ఆయనకు పూర్ణకుంబ స్వాగతంతో ప్రత్యెక దర్శనం చేయించారు అర్చకులు. తన ప్రచార రథానికి తెలంగాణలో పూజలు చేయించిన పవన్ కళ్యాణ్ కు కొత్త అనుమానం వచ్చింది. తెలంగాణ దేవుడికి పూజలు చేయిస్తే ఆంధ్ర దేవుళ్ళకు కోపం రావచ్చు అనుకున్నారు. మనలాగే దేవుళ్ళకు కూడా ప్రాంతీయ ఫీలింగ్స్ ఉంటాయి అనుకున్నారు. విజయవాడలోని ఇంద్రకిలాద్రి దుర్గమ్మ దేవాలయానికి అదే జనసేన ప్రచార రథం వారాహికి డబుల్ ధమాకా లో రెండోసారి కూడా పూజ చేయించారు. తప్పులేదు. ఎవరి నమ్మకాలూ వాళ్ళవి. ఎవరి భక్తీ వాళ్ళది. మిగతా రాజకీయ నాయకుల్లా, సాటి భక్తుడిలా ఆ దుర్గమ్మ తల్లికి ఓ పట్టు చీరను కానుకగా చదివించారు. అక్కడివరకు బాగానే ఉంది.…
అవును. మీరు చదివింది కరక్టే. బిజెపి బ్లాకు దందాలోనే కాదు – వైట్ దందాలో కూడా నెంబర్ వన్. ఎలా అంటారా? అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడిఆర్) 2021 – 2022 ఏడాదికి గాను మన దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలు ప్రకటించింది. ఇందులో మొదటి స్థానంలో బిజెపి ఉంది. గత ఏడాది ఆ పార్టీకి అందిన విరాళాలు రూ. 614.53 కోట్లు. మిగతా పార్టిలు దరిదాపుల్లో కూడా లేదు. ఏ పార్టీ కూడా రెండో అంకెను దాటలేదు. ఇవి కేవలం పైకి కనిపించే వైట్ మని. వీటికి లెక్కలు – పత్రాలు ఉంటాయి. కానీ లెక్కలు – పత్రాలు లేకుండా బ్లాకులో బిజెపికి వచ్చే విరాళాలు వేరు. దేశంలోని దాదాపు వందకు పైగా కార్పోరేట్ కంపెనిలనుంచి వచ్చే విరాళాలు వస్తాయి. ‘హఫ్తా వసూల్’ అనబడే వీటిని అందంగా ‘విరాళాలు’ అనే ట్యాగ్ లైన్ పెడతారు.…
యాంకర్ అనసూయ. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఫేస్. జబర్దస్త్ కామెడి షోలో యాంకర్ గా చేసిన అనసూయ నటిగా అవకాశాలు రావడంతో బిజీ అయిపొయింది. యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి సినిమాలో సైడ్ రోల్స్ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ పలు వివాదాల్లో నిలుస్తుంటారు. ఆ మధ్య అంటీ అన్నారని సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసి షాక్ ఇచ్చారు. తనను అంటీ అన్నవారిని గుర్తించి బొక్కలిరగ్గొట్టాలని కోరారు. తాజాగా నెటిజన్లతో అనసూయ వాగ్వాదానికి దిగారు. ఇంతకీ విషయం ఏంటంటే..మంగళవారం వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది అనసూయ. నీతో నా జీవితం రోలర్ కాస్ట్ ఎక్కినట్లు ఉందని క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..ఇందులో వింతేముంది అక్కాయ్..వాడి దగ్గర డబ్బు ఉంది అందుకే అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఈ కామెంట్ చూడగానే అనసూయకు…