Author: Prashanth Pagilla

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధికార పార్టీ నేతల మధ్య లడాయి ప్రారంభమైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు. ప్రోటోకాల్ ను పక్కన పెట్టేసి.. తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని శ్రీనివాస్ గౌడ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేటీఆర్ కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ లో ముసలం ఏర్పడినట్లు తెలుస్తోంది. క్రీడాకారులు.. కళాకారులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీకి గువ్వల బాలరాజ్ ను ఆహ్వానించకపోవడం పట్ల అసంతృప్తికి లోనయ్యారు. కొంతమంది క్రీడాకారులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఇళ్ల స్థలాల్ని ఇవ్వటాన్ని ప్రస్తావిస్తూ.. కిన్నెరతో అంతరించిపోతున్న కళను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చి ఆమధ్య పద్మశ్రీ అవార్డును పొందిన కిన్నెర మొగులయ్యకు బీఎన్ రెడ్డి నగర్ లో జాగా ఇవ్వటాన్ని గువ్వల తప్పు పట్టారు. కిన్నెర…

Read More

టీమిండియా యువ క్రికెటర్ పృధ్వీ షా పై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. కారులో వెళ్తుంటే కూడా వదలకుండా దాడికి యత్నించి కొంతమంది తమ ఆగ్రహాన్ని చల్లబర్చుకున్నారు. సెల్ఫీలు అడిగితే తమను పట్టించుకోకుండా కేవలం ఇద్దరికి మాత్రమే సెల్ఫీలు ఇస్తాడా..? అనే ఆగ్రహంతో పృద్వీ షాపై రెచ్చిపొయారు. ఇంతకీ విషయం ఏంటంటే.. బుధవారం పృధ్వీ షా తన స్నేహితులతో కలిసి ముంబైలోని శాంతా క్రూజ్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్ళాడు. అక్కడే షా ను చూసిన కొంతమంది సార్.. సెల్ఫీ అంటూ దూసుకొచ్చారు. అందరికీ సెల్ఫీలు ఇవ్వడం కుదరదని.. ఓ ఇద్దరికే మాత్రమే సెల్ఫీలు ఇచ్చేసి హోటల్ లోపలికి వెళ్ళడంతో మిగతా వారు నొచ్చుకున్నారు. ఇది తమను కించపర్చడమేనని అతిగా ఊహించుకున్నారు. ఇంకేముంది.. తమను పట్టించుకోని షా పై దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. హోటల్ నుంచి తిరిగి వెళ్తుండగా పృథ్వీ పై దాడికి పాల్పడ్డారు.…

Read More

మానవ మనుగడలో గబ్బిలాలు పరోక్షంగా సాయం అందిస్తాయి. గబ్బిలాలు లేకపోతేఈ భూమ్మీద మనుషులకు తినేందుకు తిండి గింజలు కూడా కరువు అవుతాయి. అయితే.. వీటిలో అన్ని మంచి చేసేవే ఉండవు. హనీకరమైన గబ్బిలాలూ ఉంటాయి. ఆ గబ్బిలాలే ఇప్పుడు కొత్త వైరస్ ను మనుషుల మీదకు మోసుకోస్తున్నాయి. ఈ గబ్బిలాలు మోసుకోస్తోన్న ప్రాణాంతక వైరస్ తో చాలా దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ముప్పు తప్పదని ఇండియాను హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనా వైరస్ నుంచి ప్రపంచం పూర్తిగా బయటపడనే లేదు. అప్పుడే మరో కొత్త వైరస్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఈక్వటోరియల్ గినియాలో మార్ బర్గ్ అనే కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇది సూపర్ స్ప్రెడర్. కరోనా మహమ్మారిని మించిన మొనగాడి వైరస్. కరోనా నుంచి కోలుకోవాలంటే 14రోజులు క్వారంటైన్ లో ఉంటె సరిపోతుంది కానీ ఈ మార్ బర్గ్ సోకితే 21రోజులపాటు మన…

Read More

సినీ ఇండస్ట్రీకి ఏమైందో ఏమో. ఈ మధ్య కాలంలో అనేక విషాదవార్తలు సినీ ఇండస్ట్రీ నుంచే వచ్చాయి. సినీ దిగ్గజాలు ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు. ఈ విషాదం నుంచి ఇండస్ట్రీ తెరుకునే లోపే ఆందోళనకు గురి చేసే వార్తలు వెలువడుతున్నాయి. దీంతో అంత అసలు ఏమైందో ఈ సినీ ఇండస్ట్రీకి.? ఇలా రోగాల బారిన పడుతున్నారంటూ చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. చావు- బతుకులతో పోరాటం చేసింది. ఎలాగోలా ఆ జబ్బును జయించింది. యధావిదిగా షూటింగ్ లు చేసుకుంటుంది. అభిమానులను అలరించేందుకు రెడీ అయింది. కొత్త ప్రాజెక్టులపై సైన్ చేసేందుకు సిద్దం అయిందని.. మరికొద్ది రోజుల్లో హైపర్ యాక్టివ్ అవుతుందని అంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో ఆమె మరింత బిజీ కానుందని సమంత సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇది సంతోషం కల్గించే వార్తే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కోలుకుందనే…

Read More

సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కోర్టు తీర్పుపై దాఖలైన పిటిషన్ ను జస్టిస్ బీఆర్ గవాయి , జస్టిస్ మనోజ్ మిశ్రా లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించి..సీబీఐని కంట్రోల్ లో ఉంచేలా ఆదేశించాలని వాదనలు వినిపించగా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి ఈ విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ తీర్పును సవాల్ చేస్తు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సిట్ అధ్వర్యంలోనే జరిగితేనే వాస్తవాలు బయటపడుతాయని.. సీబీఐకి అప్పగించవద్దని.. సీబీఐకి అప్పగిస్తే విచారణ అంత పక్కదారి…

Read More

ఏపీలోనూ బలపడాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. సోము వీర్రాజు, జీవీఎల్ లాంటి నేతలతో పొసగకనే ఆయన బీజేపీని వీడారు. సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ మరింత బలహీన పడుతుందని…వైసీపీ అనుబంధ సంస్థగా ఏపీ బీజేపీ మారడంతోనే పార్టీకి కన్నా లక్ష్మినారాయణ గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏపీ బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన దారెటు..? అనే చర్చ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో చేరే ఉద్దేశ్యంతోనే ఆయన బీజేపీని వీడారనే అంటున్నా..మరో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై దృష్టిపెట్టిన కేసీఆర్ కాపు సామజిక వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తోన్న నేపథ్యంలో.. కన్నాకు బీఆర్ఎస్ ఆహ్వానం అందిందని ఆయన కారెక్కుతారని చర్చ జరుగుతోంది. దీంతో ఆయన పొలిటికల్ జర్నీపై అందరిలోనూ…

Read More

బెంగళూర్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం ఇంకా ఏమాత్రం కుదుటపడలేదు. మెదడు పైభాగం దెబ్బతినడంతో రక్తప్రసరణ లేక వాపు ఏర్పడింది. అలాగే నీరు చేరిందని వైద్యులు గుర్తించారు. విదేశాలకు తీసుకెళ్లాలని భావించిన…అలా చేస్తే ఇబ్బంది అవుతుందని ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. విదేశాలకు చెందిన పేరుమోసిన న్యూరో వైద్య నిపుణులను ఇండియాకు రప్పిస్తున్నారు. ప్రస్తుతం నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బట్టి చూస్తే ఆయన కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. వైద్యులు తారకరత్న బ్రెయిన్ ను స్కాన్ చేయగా.. ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదని రికవరీ కావడానికి సమయం పడుతుందని తెలిపారు. కాస్త… ఊరట కల్గించే అంశం ఏంటంటే.. ఇంతకుముందుతో పోలిస్తే ప్రస్తుతం వైద్యానికి తారకరత్న వేగంగా స్పందిస్తున్నారని అంటున్నారు. అతనిని తొందరగా స్పృహలోకి తీసుకొచ్చేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూరో విభాగానికి చెందిన ఫేమస్ వైద్యులను ఇండియాకు రప్పించి.. తారకరత్నకు ట్రీట్మెంట్ ఇప్పించాలని…

Read More

”కాసింత కొమ్ము సెనగ పిండిని గోధుమ పిండి కలిపి రొట్టెలు చేసుకుని తింటే మధుమేహం పోతుందిరా” అని మూలకు పడున్న ముసలమ్మా చెపితే పాతకాలం మనిషి అని కొట్టిపడేస్తాము. 90 ఏళ్ళు నిండినా ఆమెకు మధుమేహం రాకుండా ఎందుకు చావలేదో మనకు అర్థమై చావదు. 18 ఏళ్లకే మనకు మధుమేహం ఎందుకు వచ్చిందో అంతకంటే అర్థమై చావదు. 45 ఏళ్ల అమ్మ రోజు మధుమేహం మాత్రలు ఎందుకు వేసుకుంటుందో భోదపడదు. 50 ఏళ్ల నాన్న మధుమేహం నిరోధక ఇంజక్షలు తనకు తాను ఎందుకు తీసుకుంటాడో తెలియదు. ‘మందు’కు అలవాటు పడక పోయినా మనం ‘మందుల షాప్’కి వెళ్ళడం అలవాటు పడ్డాము.  ‘కొమ్ము సెనగ పిండిని గోధుమ పిండి కలిపి రొట్టెలు చేసుకుని తింటే మధుమేహం పోతుంది’ అని మన ఆయుర్వేద డాక్టర్లు చెపితే నవ్వుతాము. తాత్కాలిక ఉపశమనానికి అలవాటుపడిన మనం శాశ్వతం పరిష్కాల కోసం ఏనాడో మరిచాము.కానీ ఇదే ఫార్ములాను ఫారిన్…

Read More

తుర్కియే, సిరియాలో భూకంపం వస్తే తెలంగాణలో భూ ప్రకంపనలు రావడం ఏమిటని అశ్చర్య పోతున్నారా? ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలల్లో ఉన్న ముస్లింలల్లో చాలా మంది నైజాం పరిపాలనలో తుర్కియే నుంచి వలస వచ్చారు. అందుకే వాళ్ళను ‘తుర్కొల్లు’ (ముస్లిం) అని తెలంగాణలో ఇప్పటికి పిలుస్తారు. మొదటినుంచి మన దేశం శాంతి కాముక దేశం. ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు. కానీ మన దేశం మీద 18 దేశాలు దండయాత్ర చేసాయి. వాళ్ళల్లో చాలామంది ఇంక్కడే స్థిరపడ్డారు. అందుకే అనేక భాషలు, అనేక మతాలకు మన దేశంలో వెలసిల్లాయి. దానికి కారణం మన దేశంలో సిరి సంపదలు. దానికి మించి సామంత రాజుల పరిపాలలో ప్రతి జిల్లా ఒక దేశంగా మనుగడ సాగించడమే. అప్పటికే వైష్ణవులు, శివులు పేరుతో మత కలహాలు (ఇవి నాడు కులాలు కాదు) మనలో ఐక్యమత్యం లేకపోవడం. నేక్కర్లు కూడా వేసుకోవడం…

Read More

ఫిబ్రవరి 17న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు. బీఆర్ఎస్ బాస్ జన్మదిన వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యాడర్ ఫుల్ ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయింది. కానీ ఇదే  ఫిబ్రవరి 17  నలుగురు  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేసీఆర్ కు తంటాలు తెచ్చి పెట్టింది. కారణం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సుప్రీంకోర్టులో 17వ తేదీన విచారణకు రానుండటమే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తె ఓకె. లేదంటే సీబీఐ రంగంలోకి దిగి పంజా విసిరే అవకాశం ఉంది. కేసీఆర్ జన్మదినం రోజున ఆ పార్టీ నేతలకు మజా లేకుండా చేసే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు చూస్తుంటే రేపటి నుంచే రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే కేసీఆర్ జన్మదినం రోజే రాజకీయ యుద్దంలో బీఆర్ఎస్ చతికిల పడినట్లే. సీబీఐ…

Read More