Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
22రోజులపాటు చావుతో పోరాడి ఓడిపోయాడు నందమూరి తారకరత్న. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తిరిగి మామూలు మనిషిలా మళ్లీ వస్తాడని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తీరని శోకాన్ని మిగుల్చుతూ తారక రత్న సెలవు తీసుకున్నాడు. నారా లోకేష్ చేపట్టిన ‘ యువగళం ‘ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. దీంతో అతన్ని వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు . ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూర్ నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిన తారకరత్నను స్పృహలోకి తీసుకొచ్చేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. విదేశాల నుంచి న్యూరో వైద్యులను రప్పించారు వారి పర్యవేక్షణలో వైద్యం కొనసాగింది. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కార్డియాలజిస్ట్, న్యూరో స్పెషలిస్టులు తమ అనుభవాన్ని మొత్తం వెచ్చించి వైద్యం అందించినా తారకరత్న మళ్లీ స్పృహలోకి రాలేదు. 22రోజులపాటు మృత్యువుతో పోరాడి నేడు కన్నుమూశాడు.…
తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు తెలుస్తోంది. 22 రోజులుగా బెంగళూర్ నారాయణ హృదలయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. మరికాసేపట్లో నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. కోమాలోకి వెళ్లిన తారక రత్నను స్పృహ లోకి తీసుకొచ్చేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. ఇటీవల ఆయనకు బ్రెయిన్ స్కాన్ చేశారు. తారకరత్న ను కాపాడుకునేందుకు విదేశీ వైద్యుల బృందంను ఇండియాకు రప్పించారు.వారి ఆధ్వర్యంలో తారకరత్నకు ప్రత్యేక చికిత్స కొనసాగుతోంది. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగు పడటం లేదని సమాచారం. మరోవైపు… తారకరత్న ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది అనే సమాచారం అందుకున్న నందమూరి కుటుంబ సభ్యులు వెంటనే బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి బయల్దేరి వెళ్లారు. హీరో బాలకృష్ణ తన షెడ్యూల్ ను కూడా పక్కన పెట్టేసి హుటాహుటిన బెంగళూర్ బయల్దేరారు. జనవరి 26న టీడీపీ యువనేత…
వచ్చే ఎన్నికలు టీడీపీకి సవాల్ గా మారాయి. మరీ ముఖ్యంగా నారా ఫ్యామిలీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు – లోకేష్ లు అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు సమయం సమీపిస్తు ఉండటంతో వరుస పర్యటనలతో చంద్రబాబు దూకుడు పెంచుతుంటే.. యువగళం పేరిట పాదయాత్రకు లోకేష్ శ్రీకారం చుట్టారు. 400రోజులు,4000కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర కొనసాగనుంది. లోకేష్ కు ఈ యాత్ర కీలకంగా మారింది. టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ రేంజ్ మరింత పెరుగుతుంది. అదే సమయంలో టీడీపీ ఓటమి పాలైతే ఆయన నాయకత్వంపై పెదవి విరుపులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం మెండుగా ఉంది. ఈ పాదయాత్ర ద్వారా వైసీపీ వైఫల్యాలను వివరించి పార్టీని అధికారంలోకి తీసుకువస్తే లోకేష్ ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు అవుతుంది. ఇక, ఇప్పటివరకు ఈ యాత్రలో టీడీపీ నేతలే పాల్గొనగా..జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఇటీవల ఓ…
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. పార్టీలోకి వైఎస్సార్ సన్నిహితులు, కాంగ్రెస్ పార్టీ నేతలు బోలెడు మంది వస్తారని పార్టీ ఏర్పాటుకు ముందు షర్మిల లెక్కలు వేసుకున్నారు కానీ పార్టీ ఏర్పాటు తరువాత పేరున్నా నేతలెవరూ షర్మిల పార్టీ వైపు చూడటమే లేదు. అసలు వైఎస్సార్ తెలంగాణ పార్టీ కూడా ఉందా..? అనే స్థితి నెలకొనడంతో విధిలేని పరిస్థితుల్లో షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. పాదయత్ర చేస్తూ పార్టీకి కాస్త ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం కూడా పెద్దగా ఫలించలేదు. దాంతో ఆమె ఏ నియోజకవర్గాలకు వెళ్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం స్టార్ట్ చేసి మీడియాలో కవరేజ్ సంపాదించుకున్నారు. గతంలో పాదయాత్ర చేసి అన్నకు తోడుగా నిలిచినా షర్మిల ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. షర్మిల పాదయత్రను అడ్డుకుంటామని బీఆర్ఎస్…
శ్రీరెడ్డి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఫిలిం చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి సంచలనానికి తెరలేపి ఫేమస్ అయింది. తనను పలువురు హీరోలు, నిర్మాతలు , దర్శకులు సినిమా ఆవకాశాలు ఇస్తామని శారీరకంగా వాడుకున్నారని పేర్లతో సహా బయటపెట్టింది. కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టింది. చిత్ర పరిశ్రమకు నష్టం వాటిల్లెలా వ్యవహరించిందని శ్రీరెడ్డికి ఎవరూ టాలీవుడ్ లో అవకాశం ఇవ్వలేదు. దాంతో ఆమె తన మకాం హైదరాబాద్ నుంచి తమిళనాడుకు మార్చింది. యూట్యూబ్ చానెల్ క్రియేట్ చేసుకొని వీడియోలు చేస్తూ సంపాదిస్తోంది. చెన్నై వెళ్ళినా తన నోటి దూల మాత్రం మార్చుకోలేదు. అప్పడప్పుడు సోషల్ మీడియా వేదికగా సినీ తరాలను, రాజకీయ నాయకులపై దుమ్మెత్తిపోస్తూనే ఉంటుంది శ్రీరెడ్డి. వైసీపీ మౌత్ పీస్ గా ఉండే శ్రీరెడ్డి జగన్ ను ఏమైనా అంటే అంతెత్తున లేస్తుంది. వైసీపీ అధికార ప్రతినిధిగా చెలరేగిపోతుంది. పవన్ నుంచి చంద్రబాబు…
సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు. శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. 1.ఉపవాసం శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం…
ఈ మధ్యకాలంలో వచ్చిన ఒటీటీ టాక్ షో లో విశేష ఆదరణ పొందిన షో ఏదైనా ఉందంటే అది‘అన్ స్టాపబుల్ విత్ NBK’.బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న షో కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మొదటి సీజన్ కంటే రెండో సీజన్ కు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. కారణం.. సెకండ్ సీజన్ లో ప్రభాస్ , పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు పాల్గొనడమే. భారీ ఆదరణ పొందిన ఈ షో… రెండు సీజన్లతోనే నిలిచిపోనుందనే ప్రచారం జరుగుతోంది. సీజన్ 1 గ్రాండ్ ఫినాలే లో బాలయ్య బాబు మాట్లాడుతూ… సెకండ్ సీజన్ ఉంటుంది, త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటూ చెప్పాడు. కానీ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే లో మాత్రం ఇక సెలవు అనే అర్థం వచ్చేట్టు ‘ఈ జ్ఞాపకాలు చిరకాలం నా మదిలో ఉంటుంది’ అని అంటాడు బాలయ్య. అంటే దానికి అర్థం సీజన్ 3 లేదనీ…
సరిగ్గా నాలుగేళ్ళ కిందట వైజాగ్ పర్యటనలో ఓ పాపను కలిశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కండరాల బలహీనతతో బాధపడుతోన్న ఆ పాపను బతికించుకోవడం ఆ తల్లిదండ్రులకు కష్టంగా మారింది. పవన్ కళ్యాణ్ ను అమితంగా ఇష్టపడే ఆ పాప గురించి తెలుసుకొని పరామర్శించాడు జనసేనాని. పాపను తన ఒడిలో కూర్చోబెట్టుకొని మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఆరోగ్యం ఎలా ఉందని అడిగగా..నా హీరో మీరు సార్. మీ కాళ్ళను మొక్కవచ్చా అని పవన్ ను అడగడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పటి నుంచి ఆ పాప వైద్య ఖర్చులను మొత్తం తనే భరిస్తానని హామీ ఇచ్చాడు పవన్. పాప బ్రతకాలంటే రోజూ ఫిజియోతెరఫీ చేయల్సి ఉంటుంది కాబట్టి ఆ ఖర్చులను మొత్తం నాలుగేళ్ల నుంచి పవన్ కళ్యాణ్ భరిస్తున్నారు. అయితే, తాజాగా చికిత్స పొందుతూ ఆ పాప కన్నుమూసింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్…
‘రాజా వారు రాణి వారు’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం తనదైన సినిమాలతో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదటి సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినా తరువాతి చిత్రమైన “SR కళ్యాణ్ మండపం” తో సూపర్ హిట్ ను అందుకున్నాడు. అదే ఊపును కంటిన్యూ చేయాలని సెబాస్టియన్ చేసినా ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తరువాత సమ్మతమే అనే చిత్రంతో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ : ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం( విష్ణు) ఓ అనాధ. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధాశ్రమంలో ఉంటూ పెద్దయ్యాక ఓ గ్రంథాలయంలో పని చేస్తూ ఉంటాడు. తను ఏం చేసినా నలుగురికి ఉపయోగపడాలనేది విష్ణు మనస్తత్వం. అలాంటి మంచి మనస్సున్న విష్ణుకు…
మనిషికి మనిషి శత్రువు ఎప్పుడో అయ్యాడు. ప్రేమ సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి. బయటకు చెప్పడం లేదు కానీ ప్రతి మనిషి మధ్య ఉన్నది కేవలం ఆర్ధిక సంబంధమే. ప్రపంచీకరణ మనుషుల మధ్య అనుబంధాన్ని కత్తిరించింది.ఫలితంగా మనిషికి మనిషి అవసరాలను తీర్చే వస్తువు అయ్యాడు. సాటి మనిషిని ప్రేమించడం, అభిమానించడం అమయాకత్వం అయిపొయింది. మనిషికి మనిషి మధ్య పెనవేసుకుపోతున్న బంధాలు కృత్రిమం అవుతున్న సమయనా..మానవీయతకు అద్దం పట్టిన ఓ చిత్రం సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తల్లిలాగా ఆదరించాల్సిన కోడలు, కాలికి మట్టి అంటకుండా పెంచి పెద్దచేసిన తల్లి పట్ల కొడుకు కర్కశంగా వ్యవహరించారు. చీకొట్టి వృద్ధాశ్రమంలో ఆ వృద్దురాలిని బందీ చేస్తే…చాలా కాలం తరువాత యాక్సిడెంటల్ గా తన చిన్నతనంలో అల్లారుముద్దుగా పెంచిన నాన్నమ్మ కంటపడితే..? ఆ చిట్టితల్లి ఊరుకుంటుందా..? వెంటనే వెళ్లి గుండెలకు హత్తుకుంది. తన ఒడిలో తలవాల్చి ఏకధాటిగా ఏడ్చింది. ఊరుకో తల్లీ అని వారిస్తున్నా.. ఆపకుండా విలపించింది.…