Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
హన్మకొండలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై బీఆర్ఎస్ గుండాలు దాడికి పాల్పడ్డాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీటింగ్ ముగిసిన అనంతరం పవన్ ఇంటికి వెళ్తుండగా.. అతన్ని అడ్డగించి దాడి చేశారు. పదుల సంఖ్యలో పవన్ కోసం కాపుకాసి మరీ ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. విచక్షణరహితంగా దాడి చేయడంతో పవన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న పవన్ ను ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ కెమరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇదంతా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అనుచరుల పనేనని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తోట పవన్. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తుంటాడు. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆగడాలను సోషల్ మీడియా వేదికగా నిత్యం ప్రశ్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ ను పార్టీ…
ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి రెడ్డిపై కేసు నమోదైంది. కడప జిల్లాకు చెందిన కొర్రు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున తాను ఇచ్చిన ప్రకటన ప్రచురించలేదని.. దీంతో తమ కుటుంబం మనోవ్యధకు గురైనట్లు భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఇచ్చిన ప్రకటనలో వైఎస్ షర్మిల ఫోటో ఉండటంతోనే ప్రకటనను పక్కనపెట్టేశారని ఆరోపించారు. కొర్రు భాస్కర్ రెడ్డి వైఎస్సార్ వీరాభిమాని. వైఎస్ కు సన్నిహితుడు. వైఎస్ ఫ్యామిలీతో భాస్కర్ రెడ్డికి మొదటి నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే వైఎస్సార్ బతికున్న సమయంలో షర్మిలను సొంత చెల్లిలాగా చూసుకోవాలని భాస్కర్ రెడ్డికి చెప్పేవారని అంటుంటారు. ఆ అభిమానంతో వైఎస్ జయంతి రోజున జగన్ సొంత పత్రికకు ప్రకటనలు ఇస్తుంటారు భాస్కర్ రెడ్డి. ప్రతిసారి ఆయన ఇచ్చిన ప్రకటన ప్రచురితం అవుతూనే ఉంది.…
గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీతాదయాకర్ రెడ్డి దంపతులు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలంటూ మక్తల్ పట్టణంలో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లను ఎవరు అతికించారో సరిగ్గా తెలియదు కానీ ” అసమర్ధులు, అవినీతిపరుల చేతిలో బందీ అయిన మక్తల్ , దేవరకద్ర నియోజకవర్గాల సంకెళ్ళు తొలగించి ఈ నియోజకవర్గాల పూర్వ వైభవం కోసం మీరు మళ్ళీ రావాలి” అని అతికించిన పోస్టర్ లో ఇట్లు మీ అభిమానులు అని ఉండటంతో ఇదంతా సీతా దయాకర్ రెడ్డి అభిమానుల పనేనని తెలుస్తోంది. టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించిన సీతా దయాకర్ రెడ్డి దంపతులు ఏ పార్టీలోనూ చేరలేదు. ప్రధాన పార్టీల నుంచి సీతా దయాకర్ రెడ్డి దంపతులకు ఆహ్వానం అందింది. కానీ వారు మాత్రం ఎటుతేల్చుకోలేకపోతున్నారు. వారి అభిమానులు, క్యాడర్ నుంచి రోజురోజుకు ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి. మీ వెంటే మేమూ అంటూ అభిమానులు వరుస ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీతా…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. జెండర్ తో సంబంధం లేకుండా కోహ్లీని అభిమానిస్తారు. ఆయనతో కలిసి ఓ సెల్ఫి దిగాలని ఆరాటపడేవాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ ఓ యువతి మాత్రం ఏకంగా లిప్ కిస్ ఇచ్చి అందర్నీ షాక్ కు గురి చేసింది. టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి ఓ యువతి కిస్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన ప్రమేయం లేకుండానే లిప్ లాక్ చేసింది సదరు యువతి. అయితే ఇదేదో నిజంగా కాదండోయ్. కోహ్లీ మైనపు బొమ్మకు కోహ్లీ వీరాభిమాని కిస్ ఇచ్చింది. ఈ వీడియోలో ముందుగా యువతి కోహ్లీకి బొమ్మకు ముద్దు ఇచ్చి ఆ తరువాత తనకు ముద్దు ఇచ్చినట్లుగా యువతి స్టిల్స్ ఇహ్చింది. ఢిల్లీలోని మేడం టుస్పాడ్స్ లోని విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఓ మహిళ ముద్దు పెట్టుకుంది. ఇప్పుడిదే వీడియో…
గత కొంతకాలంగా బాలీవుడ్ మూవీస్ లో ఏ సినిమా పెద్దగా ఆడింది లేదూ, పెద్దగా కలెక్షన్స్ వసూళ్లు చేసిందీ లేదు. సౌత్ సినిమాలతో పోలిస్తే అటు కంటెంట్ పరంగానూ, కలెక్షన్స్ పరంగా బాలీవుడ్ పూర్తిగా వెనకబడిపోయింది. కానీ ఇటీవల షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన పఠాన్ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతూ బాలీవుడ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చింది. షారుఖ్ ఖాన్, దీపిక పదుకునే హీరో, హీరోయిన్లుగా ప్రముఖ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి కాసుల కనకవర్షం కురిసింది. డే1నుంచి నేటి వరకు ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ 26 రోజులు పూర్తి చేసుకుంది.ఈ 26రోజులకు గాను అన్ని భాషల్లో వెయ్యి కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ సినిమా వివాదాస్పదం కావడంతో పఠాన్ కు ఫ్రీ ప్రమోషన్ కూడా లభించడం కలిసొచ్చింది. వెయ్యి కోట్ల క్లబ్ లో ఇదివరకు…
ఏపీ సీఎం జగన్ భార్య భారతి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా..? ఇందుకోసం నియోజకవర్గం కూడా ఫిక్స్ చేశారా..? రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే భారతిని రంగంలోకి దింపాలని జగన్ భావిస్తున్నారా..? కొంతకాలంగా రాజకీయ భేటీలకు భారతిని జగన్ వెంటబెట్టుకెళ్ళడం దేనికి సంకేతం..?ఇప్పుడివే ప్రశ్నలు ఏపీ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏపీ సీఎం జగన్ భార్య భారతి. ఆమె మొదటి నుంచి కూడా రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్ట్ అయిన సమయంలో వైసీపీ తరుఫున ఆయన సోదరి వైఎస్ షర్మిల రాజకీయాలు కొనసాగించేరే కాని భారతి ఎక్కడ కూడా కనిపించలేదు. ఆమె పూర్తిగా జగన్ వ్యాపారాలను మాత్రమే చూసుకుంటారు. రాజకీయాలను ఏమాత్రం పట్టించుకోరు. అలాంటిది ఆమెను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలపాలని జగన్ భావిస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతిని బరిలో నిలిపితే ఎలా ఉంటుందని సమాలోచనలు…
వైఎస్ వివేకా హత్యకేసులో వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు సీబీఐ మరోసారి నోటిసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ నెల 24న హైదరాబాద్ లోని ఆఫీసుకు రావాలని అవినాష్ రెడ్డిని ఆదేశించిన సీబీఐ… భాస్కర్ రెడ్డికి మాత్రం ఎక్కడ హాజరు కావాలో ఆయన ఇష్టానికి వదిలేయడం హాట్ టాపిక్ అవుతోంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే ఉద్దేశ్యంతోనే ఆయన్ను మరోసారి విచారణకు పిల్చారని.. అందుకే తండ్రికి మినహాయింపు ఇచ్చి అవినాష్ రెడ్డికి మాత్రం హైదరాబాద్ లోనే విచారణకు రావాలంటూ ఆదేశించారని అంటున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు లోక్ సభ స్పీకర్ అనుమతి కూడా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డినే కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయను అరెస్ట్ చేసేందుకు సీబీఐ రెడీ అయిందని అంటున్నారు. వివేకా హత్య గురించి ఉదయం తెలిసిందని అవినాష్ రెడ్డి చెబుతూ వచ్చారు. కానీ…
ఆదివారం నాటి కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సంచలన కథనం వెలువరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చారని పేర్కొని సంచలనానికి తెరలేపారు. కేసీఆర్ ఈ ఆఫర్ ఇచ్చేందుకు కారణం ఏంటంటే.. ఏపీలో చంద్రబాబు ఓడించాలనే పట్టుదల. మళ్ళీ జగన్ ను సీఎం చెయాలనే ఆరాటం. జగన్ ను సీఎం చేసేందుకు పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ ఎందుకు వెయ్యి కోట్లు ఆఫర్ చేశారనేది ప్రశ్నగా మారింది. ఇందుకు కారణం ఏంటో ఆర్కే చెప్పలేదు కానీ జనసేన , టీడీపీలు కలిసి పోటీ చేస్తే ఈసారి ఏపీలో వైసీపీ ఓటమి ఖాయం. ఎన్నికల నాటికీ జనసేన- టీడీపీ రెండు పార్టీలు జట్టు కట్టే అవకాశం కనిపిస్తోంది. దీనిని అంచనా వేసిన కేసీఆర్..పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు వెళ్ళకుండా చేసి.. ఏపీలో ఒంటరిగా లేదా జనసేనతో కలిసి…
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనే చర్చ ప్రారంభమైంది. సాధారణ ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉండగా…ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వహిస్తారా..? అనేది అనుమానమే. ఏదైనా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే/ఎంపీ రాజీనామా చేసినా, మృతి చెందినా ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఈ బైపోల్ ను ఆరు నెలల్లోగా జరపాలనేది రాజ్యాంగ నిబంధన. అయితే, మరో ఎనిమిది నెలలో సాధారణ ఎన్నికలు ఉండగా…తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందటంతో ఉప ఎన్నిక నిర్వహిస్తారా అనేది కేంద్ర ఎన్నికల సంఘం విచక్షణపై ఆధారపడి ఉంది. అంటే బంతి కేంద్ర ఎన్నికల సంఘం కోర్టులో ఉందని అర్థం అవుతోంది. రాజ్యాంగ నియామావళి ప్రకారం…ఖాళీ అయిన స్థానంలో ఉప ఎన్నికను ఆరు నెలల్లోగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లెక్కన కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను వచ్చే నెలలో విడుదల చేసినా…ఉప…
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 16న గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సాయన్నను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం ఆయన మృతి చెందారు. సాయన్న మృతదేహాన్ని అశోక్ నగర్ లోని వారి నివాసానికి తరలించారు. టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన సాయన్న ఐదు సార్లు ఎమ్మేల్యేగా గెలుపొందారు. 1994,1999, 2004, 2014, 2018 ఇలా ఆయన వరుసగా గెలుపొందారు. 2009లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 లో టీడీపీ తరుఫున ఎమ్మేల్యేగా ఎన్నికైన సాయన్న ఆ తరువాత టీఆరెఎస్ గూటికి చేరారు. 2018లో కారు గుర్తుపై పోటీ చేసిన సాయన్న గెలుపొందారు. వివాదరహితుడిగా ముద్రపడిన సాయన్న ప్రజలకు అందుబాటులో ఉంటారని పేరుంది.అదే ఆయన్ను తిరుగులేని…