Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ఏపీని వదిలేసి తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయం చేయడానికి కారణం భయమేనా..? తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్య తరువాత షర్మిలకు పరోక్షంగా ఆ తరహ బెదిరింపులు వచ్చి ఉంటాయా..? ఫ్యాక్షన్ రాజకీయాలను వదిలేసి..ప్రశాంతంగా రాజకీయాలు చేయాలనే నిర్ణయం తీసుకొనే షర్మిల తెలంగాణకు మకాం మార్చారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏపీలో జగన్ ను కాదని వైఎస్ షర్మిల పార్టీ పెడితే కొద్దోగొప్పో అయినా అక్కడ నిలదొక్కుకునేవారు. వైఎస్ సన్నిహిత నేతలు , కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీలోని అసంతృప్తులు షర్మిల వెంట నడిచేవారు. పరిస్థితులు కొంత అనుకూలిస్తే అక్కడ సీఎం అయ్యే అవకాశం కూడా షర్మిలకు మెండుగానే ఉంది. కానీ ఈ ఈజీ ప్రాసెస్ ను కాదనుకొని షర్మిల తెలంగాణలో రాజకీయం చేయడంపై చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి. అన్న జగన్ తో ఆస్తుల గొడవలని.. మరొకటని ఏదేదో చెప్పారు. కానీ వివేకా హత్య కేసును తవ్వుతున్న…
కర్ణాటకలో ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హుందాగా వ్యవహరించాల్సిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారిణులు తమ హోదాలను మరిచిపోయి సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేసుకుంటూ పరువు తీసుకుంటున్నారు. విషయం సీరియస్ గా మారడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఫేస్ బుక్ లో రూప చేసిన రచ్చ అనంతరం అధికారులు వీరిద్దరిని బదిలీ చేసి, పోస్టింగులు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. దాంతో పాటు వీరు సోషల్ మీడియాలో ఎలాంటి ఆరోపణలు చేసుకోవద్దని, బహిరంగ ప్రకటనలు ఇవ్వొద్దని కూడా హెచ్చరించారు. అయినా రూప మళ్లీ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఐఎఎస్ రోహిణి సింధూరి ఐపీఎస్ రూప మౌద్గిల్ కు లీగల్ నోటిసులు పంపారు. తనకు క్షమాపణలు చెప్పాలని.. తన పరువుకు భంగం కల్గించేలా సామజిక మధ్యమాలో పోస్టులు చేసినందుకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కోటి రూపాయల పరిహారం చెల్లించాలని రూపకు రోహిణి సింధూరి పంపిన…
సచిన్ టెండూల్కర్..క్రికెట్ దేవుడు. క్రికెట్ కు ప్రపంచస్థాయి వన్నె తీసుకొచ్చాడు. బ్యాటింగ్ లో సచిన్ కొట్టే షాట్లు ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కానివిలా ఉంటాయి. కళాత్మకంగా ఉంటాయి. ప్రత్యేకమైన శైలితో బ్యాటింగ్ చేసే సచిన్ ఎంతోమంది యంగ్ క్రికెటర్లకు స్ఫూర్తి. క్రికెట్ లో ప్రతి ఒక్కరు సచిన్ కావాలని అనుకుంటారు. కానీ సచిన్ ను మించిన బ్యాట్స్ మెన్ ఉన్నాడని మనలో ఎంతమందికి తెలుసు. వెలుగులోకి రాని ఆ లెజెండరీ బ్యాట్స్ మెన్ నే సచిన్ ఇన్‌స్ప్రేషన్ గా తీసుకున్నారు. అంత గొప్ప క్రికెటర్ ఎందుకు వెలుగులోకి రాలేదు..? అనేగా మీ సందేహం. సచిన్ ఇన్‌స్ప్రేషన్ గా తీసుకున్న క్రికెటర్ పేరు అనిల్ గౌరవ్. ఆయన గురించి ఎవరో చెప్పలేదు సచినే తన డైరీలో రాసుకున్నాడు. అతను క్రికెట్ కు దూరం కావడానికి సచిన్ రాసుకొచ్చిన కథనం చదివితే కళ్ళు చెమర్చక మానవు. అనిల్ గౌరవ్, సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లీ..…
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వివేకాను ఆయనే హత్య చేయించారనే ఆధారాలను సీబీఐ సేకరించినట్లు లీకులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డిని మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటిసులు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే..వివేకా హత్య కేసు విచారణకు హాజరు కావాలంటూ అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటిసులు జారీ చేసింది. ఇందులో భాస్కర్ రెడ్డికి ఎక్కడైనా హాజరు కావొచ్చునని ఆయన ఇష్టానికి వదిలేసిన సీబీఐ అధికారులు.. అవినాష్ రెడ్డిని మాత్రం హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంకు రావాలని ఆదేశించడం ఆయన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారానికి బలం చేకూర్చుతోంది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి ఈ కేసునుంచి బయటకు రావాలంటే బీజేపీలో చేరడం తప్ప ఆయనకు మరో ఆప్షన్ లేదని సోషల్ మీడియాలో ఓ వార్త పేపర్ తో మీమ్స్ క్రియేట్…
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాక జాతీయ స్థాయిలో పార్టీ ప్రభావం ఉంటుందని భారీ ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తోన్న పథకాల గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని… రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లోకి వలసలు భారీ ఎత్తున ఉంటాయని ప్రకటించారు. కానీ అదంతా ఒట్టి ప్రచారమేనని తేలింది. ఓడిసా మాజీ ముఖ్యమంత్రి , పలువురు బీజేపీ నేతలు బీఆర్ఎస్ లో చేరినా.. పంజాబ్ ముఖ్యమంత్రే స్వయంగా తెలంగాణ అభివృద్ధిపై ప్రశంసల జల్లు కురిపించినా బీఆర్ఎస్ కు ఇతర రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో హైప్ రావడం లేదు. కారణం.. బీఆర్ఎస్ ను వార్తా సంస్థలు పట్టించుకోకపోవడం. అందుకే బీఆర్ఎస్ కు ప్రమోషన్ కోసం పత్రికలను తీసుకురావాలనుకుంటున్నారు కేసీఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ కు అనుకూల పత్రిక నమస్తే తెలంగాణ ఎలాగైతే ఉందొ.. ఏపీలో నమస్తే ఆంధ్రప్రదేశ్ ను తీసుకురావాలని అనుకుంటున్నారు కేసీఆర్. ఇందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టుకునేందుకు…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులెవరో తేల్చే పనిలో పడింది. సునీల్ యాదవ్ ను విచారించిన సీబీఐ పలు ఆధారాలను సేకరించింది. ఇందులో అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల గుట్టు మొత్తం బయటపడినట్లు స్పష్టమైంది. వివేకా హత్యకు గురయ్యే ముందు హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి పులివెందులకు వచ్చారు. టికెట్ల అంశంపై చర్చినేందుకు ఆయన లోటస్ పాండ్ వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చిన తరువాత ఈ హత్య జరిగింది. ఈ మర్డర్ ప్లాన్ చాలా పకడ్బందీగానే జరిగినట్లు ఆ తరువాత తేలింది. మొదట గుండెపోటు అని , ఆ తరువాత చంద్రబాబు హత్య చేయించారని కాదు.. ఆదినారాయణ రెడ్డి హత్యా చేయించారని లేదు.. బీటెక్ రవి మర్డర్ చేయించారని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కట్ చేస్తే అయిన వాళ్ళే హత్య చేయించారని మెల్లమెల్లగా…
సీఎం కేసీఆర్ సొంత ఇలాకా గజ్వేల్ మున్సిపాలిటీలో గలాటా మొదలైంది. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా తీరును వ్యతిరేకిస్తూ 14మంది కౌన్సిలర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలని కొద్ది రోజులుగా జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెబుతున్నా పట్టించుకోకపోవడంతో వారంతా మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. ఈమేరకు సిద్ధిపేట కలెక్టర్ ను కలిసి కౌన్సిలర్లు అవిశ్వాస ప్రకటన నోటిసులను అందజేశారు. కౌన్సిలర్లు అవిశ్వాస నోటిసులు కలెక్టర్ కు అందించడంతో మున్సిపల్ చైర్మన్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ప్రవేశపెడుతున్న అవిశ్వాసం నోటిసులపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం అంశంపై స్టే విధించేందుకు అంగీకరించింది. దీంతో కౌన్సిలర్లు ఏమి చేయలేక మున్సిపల్ చైర్మన్ తీరును నిరసిస్తూ అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం. రాజమౌళి గుప్తాను పదవి నుంచి తప్పిస్తే గాని పట్టువదిలేలా కౌన్సిలర్లు కనిపించడం…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య నేతలతో ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశాలు నిర్వహించడం హాట్ టాపిక్ అవుతోంది. బుధవారం మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తోపాటు రాజ్యసభ సభ్యుడు రామోదర్ రావులతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. ఉదయం 11గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం వరకు కొనసాగడం విశేషం. బుధవారం రోజున ఆదిలాబాద్ జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొనాల్సి ఉండగా.. కేసీఆర్ పిలుపుతో ఆయన హుటహుటినా ప్రగతి భవన్ లో వాలిపోయారు. దాంతో హరీష్ రావు ఆదిలాబాద్ పర్యటన కూడా వాయిదా పడింది. అలాగే, చందనవెల్లిలో వెల్స్పన్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే కేటీఆర్ కూడా కేసీఆర్ తో సమావేశంలో పాల్గొన్నారు. ఎందుకింత సడెన్ గా కీలక నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు..? ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారు..? అనేదానిపై సీఎంవో…
11 ఎకరాలలోపు వారికి మాత్రమే ‘రబీ’ సీజన్ కు సంబంధించి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ మూడో వారం నుంచే ‘రబీ’ సీజన్ యొక్క రైతు బంధు డబ్బులను ఖాతాలో జమ చేసిన సర్కార్… 11 ఎకరాలు మించి ఉన్నవారికీ రైతుబంధు డబ్బులను ఇంతవరకు చెల్లించలేదు. దీంతో రైతుబంధు డబ్బులు తమ ఖాతాలో ఎందుకు జమ కాలేదని అర్హులైన రైతులు ఆందోళన చెందుతూ వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులను కలిసి ఆరా తీస్తున్నారు. అదే సమయంలో రైతు బంధుపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది. రైతుబంధును ఎత్తేస్తారా..? అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. నిజానికి.. రైతుబంధు అమలుకు నిధులు సమస్య ఎదురు అవుతూ వస్తోంది. ప్రతిసారి అనుకున్న సమయానికి నిధులను విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల అంశం సర్కార్ కు తలనొప్పిగా మారగా..…
గతమెంతో ఘనం. వర్తమానం ఆగమాగం అన్నట్లు తయారైంది సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి. శని, ఆదివారాల్లో సెలవు. ఆకర్షణీయమైన జీతమని తెగ మురిసిపోయేవారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. కానీ ప్రస్తుత ఉద్యోగులు మాత్రం ఆందోళనతో జీవితాన్ని గడుపుతున్నారు. ఎప్పుడు ఎవరిని లే ఆఫ్ పేరుతో ఊడపీకుతారోనని దినదినం గండంగా బతుకీడుస్తున్నారు. సర్వేలో నమ్మశక్యం కానీ నిజాలు సిగ్న అనే ఇంటర్నేషనల్ హెల్త్ సంస్థ సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై ఇటీవల సర్వే చేపట్టింది. సర్వేలో పాల్గొన్న వారంతా 25సంవత్సరాల లోపు వారే. ఉద్యోగం, జీతాలు, కుటుంబ పరిస్థితి, ఆఫిసు వాతావరణం , తోటి ఉద్యోగులతో సహచర్యం, జీతాల పెరుగుదల వంటి అంశాలపై సర్వే చేసింది. ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నూటికి 23 శాతం మంది పని వల్ల తాము ఒత్తిడికి గువుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు వచ్చే జీతాలు ఏమాత్రం…