Author: Prashanth Pagilla

మల్లారెడ్డి ఎక్కడున్నా..ఏం చేసినా..ఏం మాట్లాడినా విశేషమే. వార్తా సంస్థలకు ఆయనే పెద్ద వార్త. జబర్దస్త్ చూసి విసుగు పుట్టేవారికీ హాస్యాన్ని పంచె పొలిటికల్ కమెడియన్. శాసన సభలోనూ, బయట కూడా ఒకేలాగా ఉంటారు. ఆయన ప్రసగించే సమయంలో కేసీఆర్ ను కాకా పట్టడం టార్గెట్ గా పెట్టుకుంటారు. కేటీఆర్ మనస్సు చూరగొనాలని ట్రై చేస్తారు. ప్రజల గురించి ఆయనకు అస్సలు సంబంధం లేదు. అభివృద్ధి విషయంలో అందరిది ఒక లెక్క ఉంటే మల్లారెడ్డి చెప్పే వాదన మరోలా ఉంటుంది. పని చేసే వ్యక్తులు పని చేసే చోటుకు ఒకప్పుడు నడుచుకుంటూ వస్తుండేవారు.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సొంత వాహనాలపై పనికివస్తున్నారు. ఇది కేసీఆర్ హయంలో జరిగిన అభివృద్దికి సూచిక అని మల్లారెడ్డి చెబుతుంటారు. తన కాలేజ్ లో చిరంజీవి పుట్టిన రోజున వేలాది మంది విద్యార్థులను సమీకరించి శుభాకాంక్షలు చెప్పగలడు. డీజే టిల్లును తీసుకొచ్చి ఆయనతో కలిసి స్టెప్పులు వేయగలడు. అంతేకాదు..…

Read More

హీరో సూర్య. ఓ స్టార్ హీరోగానే కాకుండా ఆయన్నువ్యక్తిగతంగా చాలామంది అభిమానిస్తుంటారు. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనూ సూర్యకు ఫ్యాన్స్ ఉన్నారు. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. సామజిక సేవా కార్యక్రమాల్లో కూడా సూర్య ముందుంటారు. అందుకే దక్షిణాదిన సూర్యకు మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. 2006లో తాను ఎంతగానో ప్రేమించిన ప్రముఖ హీరోయిన్ జ్యోతికను వివాహం చేసుకున్నారు సూర్య. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రశాంతమైన జీవితం గడుపుతోన్న సూర్య కుటుంబం గురించి కోలీవుడ్ లో జరుగుతోన్న ఓ ప్రచారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సూర్యది ఉమ్మడి కుటుంబం. తన భార్యా పిల్లలతోపాటు , తన తమ్ముడు కార్తీ భార్యాపిల్లలు మరియు తల్లిదండ్రులతో కలిసి 20ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇలా ఉమ్మడి కుటుంబంగా ఉండటానికి కారణం మా వదిన ( జ్యోతిక) నేనని కార్తీ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల…

Read More

నార్సింగ్ శ్రీచైతన్య కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోన్న సాత్విక్ అనే విద్యార్ధి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజ్ యాజమాన్యం వేధింపులను భరించలేకే తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు ఆత్మహత్యకు ముందు రాసిన లెటర్ లో పేర్కొన్నాడు. ఈ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లెటర్ లో సాత్విక్ తన ఆవేదనను వెల్లగక్కిన తీరు అందరిని కంటతడి పెట్టిస్తోంది. “అమ్మా నాన్న నన్ను క్షమించండి. మిమ్మిల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ప్రిన్సిపాల్, లెక్చరర్లు పెట్టే టార్చర్ తో ఆత్మహత్య చేసుకుంటున్నా. కృష్ణా, ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులు తట్టుకోలేకపోతున్నా. హాస్టల్లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేకనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. నన్ను వేధించిన వారిపై చర్యలు తీసుకోండి. అమ్మనాన్న లవ్ యూ.. మిస్ యూ ఫ్రెండ్స్” అని సూసైడ్ లెటర్ రాసి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక, కాలేజ్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక…

Read More

ఎమ్మెల్యే రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఇంకా ఎత్తివేయకపోవడంతో ఇటీవల కొత్త చర్చ జోరందుకుంది. ఎన్నికల నాటికీ కూడా ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ప్రయోజనాలకు తాను పెద్దపీట వేస్తానని..వ్యక్తిగతంగా ఆలోచించనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అంబర్ పేట్ అసెంబ్లీ స్థానం నుంచి రాజాసింగ్ పోటీ చేయనున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనకు అలాంటి ఉద్దేశ్యమే లేదని స్పష్టం చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేస్తుందన్న నమ్మకాన్ని రాజాసింగ్ వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పెద్ద అభిమానిని అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ కోసం , పార్టీ…

Read More

రేవంత్ రెడ్డి చేపట్టిన యాత్రకు వస్తోన్న స్పందనను చూసి ఓర్వలేకే కిరాయి మూకలతో యాత్ర వాహనంపై బీఆర్ఎస్ దాడులు చేయించింది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. అంతకు ముందు ఇదే ప్రాంతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఏమేం చేస్తుందో స్పష్టంగా చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి అయిపోదామని ఆలోచనతోనున్న కేటీఆర్ కు రేవంత్ యాత్ర సక్సెస్ కావడం తట్టుకోలేకపోతున్నారు. అందుకే కెటిఆర్ హుటాహుటిన ఇక్కడే సుడిగాలి పర్యటన చేసి మీటింగ్ పెట్టారు. రేవంత్ రెడ్డి మీద ధ్వజమెత్తుతూ గతంలో కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ల పాటు పరిపాలించే అధికారం ఇస్తే భూపాలపల్లికి ఏం చేసింది అని ప్రశ్నించారు. పైగా మరొక్క అవకాశం కోసం అధికారం అడుక్కోవడం ఏమిటని అహంకార పూరితంగా మాట్లాడారు. పాదయాత్రలో భాగంగా…

Read More

అబ్బే జనసేనకు అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన గెలువడమే ఎక్కువ. అలాంటిది ఆ పార్టీ పదుల సంఖ్యలో అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంటుందా..? అని ఇన్నాళ్ళు ప్రత్యర్ధులు పెదవి విరిచారు. తాజాగా విడుదల అయిన సర్వేలో మాత్రం జనసేనకు ఆదరణ పెరిగినట్లు తేలింది. సినిమాలు, రాజకీయాలు. ఇలా బ్యాలెన్స్డ్ గా పవన్ రాజకీయాలు చేసినా జనసేన పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కించుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇందులో అనకాపల్లి, కాకినాడ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అలాగే, ఉత్తరాంధ్ర , ఉభయ గోదావరి జిల్లాలో జనసేన బలం పుంజుకుంటున్నట్లు సర్వేలో తేలింది. విజయవాడ పశ్చిమ, గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి, కర్నూలు ,పాణ్యం వంటి అసెంబ్లీ నియోకవర్గాల్లోనూ జనసేన దూకుడుగానే ఉందని సర్వే ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓ విధంగా చూస్తే ఈ సర్వే ఫలితాలు జనసేనకు ఆశాజనకంగానే ఉన్నాయి. ఎందుకంటే.. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక్క…

Read More

నార్సింగ్ శ్రీచైతన్య కాలేజ్ లో సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్యకు కారణం కాలేజ్ యాజమాన్యమే. కాలేజ్ యాజమాన్యం తీవ్రంగా కొట్టడం..అవమానించేలా కామెంట్స్ చేయడమే సాత్విక్ మరణానికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి సాత్విక్ చదువులో బాగా క్లెవర్. పదో తరగతిలో 9ప్లస్ జీపీఏ వచ్చింది. చదువులో చురుకైన విద్యార్ధి కావడంతో అతని శ్రీచైతన్యలో జాయిన్ చేశారు. మొదట్లో పాఠాలు అర్థం కాకపోవడంతో చదువులో కొంచెం వెనకబటడంతో అధ్యాపకులు వేధించారు. తీవ్రంగా కొట్టారు. దాంతో 15రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తరువాత కోలుకున్నాక కాలేజ్ కు వెళ్లేందుకు మారం చేశాడు సాత్విక్. ఏ కాలేజ్ కైనా వెళ్తాను కానీ శ్రీచైతన్య కాలేజ్ కు మాత్రం వెళ్ళనమ్మా అని..తల్లి కాళ్ళవెల్ల పడ్డాడు. కానీ కొడుకు భవిష్యత్ బాగుండాలని అతనికి సర్దిచెప్పి కాలేజ్ కు పంపారు. ఇక నుంచి తమ కొడుకును కొట్టకండని అధ్యాపకులకు చెప్పి వెళ్ళారు కానీ…

Read More

ప్రీతి ఆత్మహత్య కేసు వ్యవహారం పక్కదారి పడుతోందా..? ఈ ఎపిసోడ్ లోకి లవ్ జిహాద్ అనే అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకురాగానే.. అటు పోలీసులు సైఫ్ ను నిందితుడని ప్రకటించడం అసలు వాస్తవాలను మరుగుపరచడమేనా..? నిజంగా.. ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి సైఫ్ మాత్రమే కారణమా..? కేవలం బ్రెయిన్ లేదని అన్నంత మాత్రానే ప్రీతి సూసైడ్ అటెంప్ట్ చేసిందా..? సైఫ్ ను అకారణంగానే ఈ కేసులో ఇరికిస్తున్నారా.? అంటే అవుననే అంటున్నారు కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థులు. ప్రీతి ఆత్మహత్య కేసు వ్యవహారంలో సైఫ్ ను నిందితుడని చెప్పేందుకు బలమైన సాక్ష్యాలు లభించడం లేదు. కేవలం వాట్సాప్ చాట్ చూపించి సైఫ్ అనే విద్యార్ధిని నిందితుడని తేల్చేశారు పోలీసులు. సీనియర్ – జూనియర్ అన్నాక ఇద్దరి మధ్య కాస్త ఆధిపత్య పోరు ఉంటుంది. అంత మాత్రానా ఇద్దరి మధ్య నడిచిన వాట్సాప్ చాటింగ్ ఆధారంగా సైఫ్ ను నిందితుడని తేల్చేయడం అసలు వాస్తవాలను…

Read More

మయోసైటిస్ వ్యాదిన బారిన పడిన సమంత ఇటీవల కోలుకుంది. ఇదివరకు తాను అంగీకరించిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకుగాను షూటింగ్ లో బిజీ అయిపొయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న ‘సీటా డెల్’ అనే చిత్ర షూటింగ్ లో పాల్గొంటుంది సామ్. గతంలోనూ అమెజాన్ ప్రైమ్ తెరకెక్కించిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో విలన్ గా నటించి మెప్పించింది. ఈ సీరిస్ మంచి టాక్ అందుకోవడంతో సమంతకు ఆఫర్లు బాగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన‘సీటా డెల్’ ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తుంది. ఈ మధ్యే ఆమె కోలుకోవడంతో చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ‘సీటా డెల్’ సీరిస్కు సంబంధించి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా సమంతకు గాయలైనట్లు తన ఇన్స్టాలో ఫోటో షేర్ చేసి పేర్కొంది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు సమాచారం. రక్తపు మరకలతో నిండిన ఆమె ఆమె చేతులను చూసి…

Read More

ఏపీ సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకున్నట్లుంది. అందుకే జనసేన, టీడీపీలను విడివిడిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. పొత్తులతో వచ్చినా, ఒంటరిగా వచ్చిన వైసీపీ ప్రభంజనంలో టీడీపీ, జనసేనలు తుడిచిపెట్టుకుపోతాయని ఇన్నాళ్ళు వ్యాఖ్యానించిన జగన్ ఇప్పుడు మాత్రం ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అంటూ మాట్లాడుతున్నారు. ఆయన నాలుక మడతేశారు అంటే.. రెండు పార్టీల పొత్తు కుదిరితే వైసీపీ చిత్తవుతుందనేది జగన్ భయం. అందుకే ఆయన తాము ఒంటరిగా పోటీ చేస్తాం.. మీరూ ఒంటరిగా పోటీ చేయండని సవాల్ చేస్తున్నారు. టీడీపీ, జనసేనలు కలిస్తే ఇబ్బంది అవుతుందని జగన్ భయం దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175స్థానాల్లో పోటీ చేయాలి. అది కూడా ఒంటరిగా పోటీ చేయాలి. అలా ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యముందా..? అని టీడీపీ , జనసేనలకు సవాల్ విసిరారు. తన సహజశైలిలో టీడీపీ,జనసేనలపై తిట్ల దండకం అందుకున్నారు. వైసీపీ చేసే గొప్పదనాన్ని చెప్పుకున్నారు.…

Read More