Author: Prashanth Pagilla

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్ ఎట్టకేలకు పలు విషయాలను వెల్లడించాడు. తను ప్రీతిని మందలించిన మాట వాస్తవమేనని పోలిసుల విచారణలో అంగీకరించిన సైఫ్… తన మాటలతో మనస్తాపానికి గురై ప్రీతి ఆత్మహత్య చేసుకుంటుందని అంచనా వేయలేదని చెప్పినట్లు సమాచారం. మొదటి నాలుగు నాలుగు రోజులు విచారణకు సహకరించని సైఫ్ ను ఆ తరువాత పోలీసులు తమదైన శైలిలో విచారించగా నోరు విప్పాడు. సైఫ్ చెప్పిన విషయాలను రికార్డ్ చేసుకున్న పోలీసులు.. అతను చెప్పిన సమాధానాలతో మరింత సమాచారం రాబట్టారు. ప్రీతి ఎమ్‌-01 లైట్‌ బ్లూ కలర్‌ మొబైల్‌ వాడేది. ఆమె ఫోన్లలోని సోషల్ మీడియా సంభాషణలు ఈ కేసులో కీలకం కానున్నాయి. వాటి ఆధారంగా పోలీసులు లోతైన దర్యాప్తు చేయనున్నారు. మరోవైపు ఆమె కీలకంగా ఉన్న మెడికో నుంచి ఎల్‌డీడీ, నాకౌట్‌ వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి మూడు, డాక్టర్‌ గాయత్రి, డాక్టర్‌ సంధ్య నుంచి మూడు…

Read More

ఏఐసీసీ ఆదేశాలతో పాదయాత్ర చేపట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ దగ్గర శనివారం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లోని కార్లు అతివేగంతో ఒకదానికొకటి డీకొన్నాయి. కార్లలోని ఎయిర్ బెలూన్లు తెరచుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆరు కార్లు ధ్వంసం అయ్యాయి. కొంతమంది రిపోర్టర్లు గాయపడినట్లు సమాచారం. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. https://youtu.be/mk9m7nfOia0

Read More

మంచు మనోజ్ – భూమా మౌనికల వివాహం జరిగిపోయింది. మంచు లక్ష్మి ఇంట్లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరై వధువరులను ఆశీర్వదించారు. మంచు లక్ష్మి అన్ని తానై ఈ వివాహ వేడుకను జరిపించడం విశేషం. మంచు మనోజ్ పెళ్లి సందడి మొదలైన నాటి నుంచి అయన తండ్రి మోహన్ బాబు ఎక్కడ కనిపించలేదు. స్పందించలేదు. పెళ్లై ఓ కొడుకు ఉన్న భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకోవడం… మోహన్ బాబుకు ఇష్టం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.అయినా మనోజ్ తాను మౌనికను పెళ్లి చేసుకొని తీరుతానని గట్టిగా చెప్పడంతోపాటు ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చేశాడు. అందుకే ఈ వివాహ వేడుకకు మంచు లక్ష్మి నివాసం వేదికైందని అంటున్నారు. మంచు మనోజ్ – మౌనికలను ఆశీర్వదించేందుకు మోహన్ బాబు వస్తారా..? అనే సందేహాలు కొనసాగుతుండగానే కొన్ని నిమిషాల ముందు మోహన్ బాబు వచ్చారు. కాగా,…

Read More

తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ ద్వారా ఇబ్బంది పెట్టాలని కేంద్రం అనుకుంటుందో లేదో క్లారిటీ లేదు. కానీ గవర్నర్ తో విబేధాలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. ఇందులో భాగంగానే గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టును తెలంగాణ సర్కార్ ఆశ్రయించినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా, అటు తిరస్కరించకుండా పెండింగ్ లో ఉంచారని ఈ విషయమై గవర్నర్ తీరును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేసీఆర్ సర్కార్. విషయం తెలిసిన గవర్నర్ మాట్లాడుతూ.. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గర అంటూ వ్యాఖ్యానించారు. అంటే..బిల్లులను ఆమోదించాలని తనతో సీఎస్ వచ్చి చర్చిస్తే బాగుండేదని తమిళిసై అభిప్రాయం. కాని సీఎస్ మాత్రం ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండా గవర్నర్ తో భేటీకి సిద్దంగా లేరు. ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండా రాజ్ భవన్ కు వెళ్తే ఏం జరుగుతుందో శాంతి కుమారికి తెలుసు. అందుకే ఆమె తమిళిసై తో భేటీకి ఆసక్తి చూపలేదు.…

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు హటాత్తుగా మహిళా హక్కులు గుర్తుకొచ్చాయి. తొమ్మిదేళ్ళలో ఏనాడూ మహిళా హక్కుల కోసం గర్జించని కవిత గొంతు ఇపుడు పెగులుతుంది. నిజామాబాద్ ఎంపీగా కొనసాగిన సమయంలో ఏనాడూ మహిళల హక్కులు- ఆస్తిత్వ ఉద్యమాలను పట్టించుకోని కవితకు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తుకొచ్చింది. ఇందుకోసం హైదరాబాద్ లో కాదు. ఏకంగా హస్తినలో ధర్నా చేపడుతామని కవిత ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఎనిమిదేళ్ళు కేంద్రంలోని బీజేపీతో స్నేహం చేసిన బీఆర్ఎస్ .. ఏనాడూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమైందని మోడీ సర్కార్ ను ప్రశ్నించలేదు. పైగా కవిత నిజామాబాద్ ఎంపీగా కూడా ఉన్నారు. ఐదేళ్ళలో ఏనాడూ లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు సంగతి ఏమైందని కేంద్రాన్ని కవిత నిలదీయలేదు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అని ఢిల్లీ నుంచి లీకులు రాగానే కవితకు మహిళలు గుర్తుకొచ్చారు. మహిళా హక్కులు గుర్తుకొచ్చాయి. కల్వకుంట్ల…

Read More

మాజీ మంత్రి,వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనపై చాలా కాలంగా అరెస్ట్ వారెంట్ పెండింగ్ లో ఉంది. కాకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సాహసించడం లేదు. తాజాగా విజయవాడలోని గవర్నర్ పేట సీఐ సురేష్ కుమార్ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. కొడాలి నాని బిజీగా ఉండటంతోనే విచారణకు హాజరు కాలేదని చెప్పగా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. కొడాలి నానిపై పెండింగ్ లోనున్న అరెస్ట్ వారెంట్ ను వెంటనే అమలు చేయాలనీ సీఐని ఆదేశించారు. దీంతో కొడాలి నానినీ ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. టీడీపీ అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న కొడాలి నాని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి వన్ వే లో ర్యాలీ నిర్వహించారు. పోలిసుల ఉత్తర్వులు…

Read More

తారకరత్నపెద్దకర్మను నందమూరి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ పెద్దకర్మలో తారకరత్న ఫోటోను చూసి ఆయన భార్య కుమిలికుమిలి ఏడ్చింది. ఈ సందర్భంగా అక్కడున్న నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు ఆమెను చూసి కంటతడి పెట్టారు. తారకరత్న పెద్దకర్మలో పాల్గొనేందుకుగాను జూనియర్ ఎన్టీఆర్ RRRఅంతర్జాతీయ అవార్డ్స్ ఫంక్షన్స్ కు కూడా హాజరు కాలేదు. అయితే.. ఈ పెద్దకర్మలో పాల్గొన్న ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ లను బాలయ్య వ్యవహరించిన తీరు ఏమాత్రం సరిగా లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి తారకరత్న పెద్దకర్మ కి ఎన్టీఆర్ హాజరయ్యారు. అయితే ఇక్కడ బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ పట్ల ప్రవర్తించిన తీరుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి తో ఉన్నారు. బాలయ్య తమవైపు వస్తున్న వీళ్లిద్దరు ఆయనని గౌరవిస్తూ పైకి లేచారు. కానీ బాలయ్య మాత్రం పట్టించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు రంగం సిద్దమైందా..? మార్చి తొమ్మిదిన కవితను అరెస్ట్ చేయనున్నారా..? అరెస్ట్ చేస్తారనే సమాచారంతోనే కవిత కావాలనే నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇటీవలే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నెక్స్ట్ కవితేనని..అందులో భాగంగానే కేసీఆర్ ప్రగతి భవన్ లో హైలెవల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారని ఇటీవల కథనాలు వెలువడ్డాయి. లిక్కర్ స్కాంలో కవిత పేరును ఇప్పటికి పలుమార్లు చార్జిషీట్లతో పాటు కోర్టుకు సమర్పించిన వివిధ పత్రాల్లో సీబీఐ ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ లో ఆమె బినామీ పేర్లతో వ్యాపారం నిర్వహిస్తున్నరారని ఆరోపించింది. ఇప్పటికే ఓ సారి కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించగా మరోసారి విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని .ఈ…

Read More

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. వైద్య సిబ్బంది సూచనలతో ఆయన పూర్తిగా ఫిట్ నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడు. పంత్ ప్రమాద ఘటన జరిగిన సమయంలో అతను కోలుకోవడం కష్టమేనని.. జాతీయ జట్టుకు క్రికెట్ ఆడటం కుదరని పని చాలామంది చెప్పారు. కాని వైద్య సలహాలను అనుసరిస్తూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే కసితో వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలోనే మళ్ళీ టీమిండియాకు ఆడుతానని స్పష్టం చేస్తున్నాడు. పంత్ కు జరిగినదీ చిన్న ప్రమాదమేమి కాదు. ప్రమాదం జరిగిన సమయంలో తనకు గాయాలైన సరే.. విండోస్ ను పగులగోట్టుకొని కారు నుంచి బయటకొచ్చి ప్రాణాలను కాపాడుకున్నాడు. ప్రమాద సమయంలో కారులో ఉండుంటే సజీవదహనం అయ్యేవాడు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. ప్రమాదం జరిగిన నాటి నుంచి పంత్ ది ఒకటే కల. మళ్ళీ టీమిండియా తరుఫున క్రికెట్ ఆడాలని. ఆ దిశగా శ్రమిస్తున్నాడు. గాయాలు అయిన…

Read More

శ్రీచైతన్య… తెలుగు రాష్ట్రాల్లో టాప్ కార్పోరేట్ కాలేజ్. ఈ విద్యాసంస్థను కాలేజ్ అనే కంటే విద్యార్థుల రక్తమాంసాల మీద కాసులు దండుకునే సంస్థ అంటే సబబుగా ఉంటుంది. పదో తరగతి పరీక్ష ఫలితాలు ఇలా వెలువడుతాయో లేదో.. అప్పుడే ఇంటింటికి వెళ్లి పీఆర్వోలు క్యాంపెయిన్ నిర్వహిస్తారు. మీ పిల్లల బంగారు భవిష్యత్ పూచి మాదంటూ మనసును దోచే కబుర్లు చెప్తారు. కట్ చేస్తే విద్యార్థులకు కాలేజ్ లో నరకం చూపిస్తారు. ఎంత చదివి ఎన్ని మార్కులు సంపాదించినా…చదవడం కాదు. ర్యాంక్ తెచ్చుకోవాలని చావబాదుతారు. ఒక్కోసారి మధ్యాహ్నం అన్నం బంద్ చేస్తారు. మండుటెండలో నిల్చోబెడుతారు. విద్యార్థులందరి ముందు సూటిపోటి మాటలతో అవమానిస్తారు. ఫలితంగా అప్పుడప్పుడే వికాసం పొందే ఇంటర్ విద్యార్థులు మనస్తాపానికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటూ కన్నవారికీ కడుపుకోతను మిగుల్చుతున్నారు. నార్సింగి శ్రీచైతన్య కాలేజ్ విద్యార్ధి సాత్విక్ అత్మహత్య చేసుకోవడానికి కాలేజ్ వేధింపులే కారణం. నిజానికి.. మనిషికి ఎనిమిది గంటల నుంచి పదిగంటల…

Read More