Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ఏపీ రాజకీయాల్లో జనసేన దూకుడు పెంచుతోంది. జనసేనను ఏమాత్రం తక్కువ అంచనా వేసినా వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా సేవలందిస్తోన్న ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా జనసేనతో ఈసారి ముప్పు పొంచి ఉంటుందని జగన్ దృష్టికి తీసుకెళ్ళాయి. అందుకే జగన్ ప్రతిసభలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన ప్యాకేజ్ స్టార్ అంటూ ఆరోపించడం రొటీన్ డైలాగ్ గా మారింది. 2019 ఎన్నికలలో జనసేన పార్టీకి 7 శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ఓటు బ్యాంకు ని పరిశీలిస్తే జనసేన పార్టీ ఓటు బ్యాంక్ 12 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా కోస్తాంధ్రలో జనసేన భారీగా పుంజుకుందని.. దీనిని గ్రహించే జనసేనతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడుతున్నారని అంటున్నారు. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే జనసేన ఒంటరిగా పోటీ చేసినా 20స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే నివేదికలు చెబుతున్నాయి. పొత్తులో భాగంగా ఎన్నికలకు…
ఇటీవలే సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తాజాగా మరోసారి సీబీఐ నుంచి పిలుపు అందింది. సోమవారం విచారణకు రావాలని ఆదేశించింది. పులివెందులలోని ఆయన నివాసంలో అవినాష్ రెడ్డికి నోటిసులు ఇచ్చారు. సోమవారం తాను విచారణకు హాజరు కాలేనని ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సోమవారం విచారణకు హజరు కావాల్సిందేనని సీబీఐ అధికారులు అల్టిమేటం విధించినట్లు సమాచారం. జగన్ చిన్నాన్న వివేకా హత్యా కేసులో సీబీఐ దర్యాప్తు చివరి అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనిని గ్రహించే అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు వెళ్ళిన ప్రతిసారి సీబీఐపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఓ నిజాన్ని వందనుంచి సున్నాకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా ఇటీవల కడప సెంట్రల్ జైలులో సీబీఐ అధికారులు కొంతమంది ఈ కేసుపై విచారించారు. జగన్ సతీమణి భారతి రెడ్డి పీఏ నవీన్ ను మరోసారి విచారణకు పిలుస్తామని…
బడ్జెట్ సమావేశాలు నెల రోజుల ముందుగానే నిర్వహించడంతో అసెంబ్లీని రద్దు చేయబోతున్నట్లు తెలంగాణ సర్కార్ సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలోనేఇటీవల ప్రగతి భవన్ లో మంత్రులు కేటీఆర్ , హరీష్ రావులతో మాత్రమే కేసీఆర్ హడావిడిగా మీటింగ్స్ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసమే ఈ సమావేశం నిర్వహించారని ప్రచారం జరుగుతుండగా..అనూహ్యంగా ఈనెల 9వ తేదీన మధ్యాహ్నం 2గంటలకు క్యాబినెట్ భేటీని నిర్వహించడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొన్నాళ్ళుగా ముందస్తు ముచ్చట జోరుగా జరుగుతోంది. ఆ మధ్య ఈ ప్రచారాన్ని స్వయంగా తోసిపుచ్చిన కేసీఆర్.. ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మనస్సు మార్చుకొని ఉండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీకి అభ్యర్థుల కొరత వేధిస్తుండగా…కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే రేసులోకి దూసుకోస్తోంది. ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇంకా సిద్దం కాకముందే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.ఇప్పుడు అసెంబ్లీని…
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర్ రావు ఏపీ సర్కార్ కు గట్టి షాక్ ఇచ్చారు. టీటీడీ సలహాదారు పదవి చేపట్టాలని కోరగా అందుకు చాగంటి తిరస్కరించారు. టీటీడీ ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటి కోటేశ్వర్ రావును ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నియమించారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని చాగంటి సందర్శించారు. అలాగే, క్యాంప్ కార్యాలయాన్ని అనుకోని పక్కనేనున్న సీఎం సతీమణి భారతిరెడ్డి నిర్వహిస్తోన్న గోశాలను కూడా సందర్శించి బాగుందని కితాబిచ్చారు. ఇక ఆయన పదవి చేపట్టడం ఖాయమని అనుకున్నారు. ఇంతలోనే ఆయన ట్విస్ట్ ఇచ్చారు. పదవిని చేపట్టేందుకు నిరాకరించారు. టీటీడీకి సలహాలు, సూచనలు చేయడానికి తనకు పదవులు అవసరం లేదని.. తన అవసరం ఎప్పుడు వచ్చినా సహాకరించేందుకు రెడీగా ఉన్నానని చాగంటి స్పష్టం చేశారు. టీటీడీ ఎప్పుడు అవసరమొచ్చినా సహకరించేందుకు సిద్దమని పేర్కొన్నారు. కానీ హటాత్తుగా పదవిని తిరస్కరించారు. సలహాదారుల పదవులపై ఇప్పటికే హైకోర్టులో…
రాజకీయాల్లో ఆశ ఉండాలనే కాని అత్యాశ అసలు ఉండకూడదు. కానీ కల్వకుంట్ల కుటుంబానికి అత్యాశ ఎక్కువ అయింది. తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ అయినట్లుగా దేశ రాజకీయాల్లో సక్సెస్ కావాలనే అత్యాశతో పార్టీ పేరును మార్చేశారు. ఇది ఎంత తప్పో రానున్న రోజుల్లో కల్వకుంట్ల కుటుంబానికి తెలియరానుంది. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత తప్పో రుచిచూపించేందుకు ఆ పార్టీ మాజీ, అసంతృప్త నేతలు రెడీ అయిపోయారు. టీఆర్ఎస్ పేరుతో ఓ ముగ్గురు కీలక నేతలు పార్టీని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమితి ..లేకపోతే తెలంగాణ రక్షణ సమితి అంటూ రకరకాల పేర్లు తెరపైకి తెస్తున్నారు. వీటిలో ఏది ఖరారు చేస్తారో తేలాల్సి ఉంది. అన్ని పక్కాగా ఆలోచించి పార్టీ పేరును టీఆర్ఎస్ ను వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు ముగ్గురు కీలక నేతలు. ఈ ముగ్గురు…
తెలంగాణలో వరుసపెట్టి దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు నటి శ్రీరెడ్డి. ప్రేమ వ్యవహారంలో నవీన్ ను అతని స్నేహితుడు హరి హతమార్చడం.. నాలుగేళ్ల పసివాడిని నాలుగు వీధి కుక్కలు కరిచి చంపినా..ర్యాగింగ్ తో ప్రీతి అనే మెడికల్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్నా.. శ్రీచైతన్య కాలజ్ వేధింపులకు ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నా… కేసీఆర్ , కేటీఆర్ లకు చిన్న చీమ కూడా కుట్టినట్లు లేదన్నారు శ్రీరెడ్డి. ఎవరమై పోయినా తమకు సంబంధం లేదనే తరహాలో కేసీఆర్ వ్యవహారశైలి ఉందని ఆమె ఏకిపారేశారు. ఇలాంటి ఘటనలు వరుసపెట్టి జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు స్పందించాలని… లేదంటే ఇలాంటి దారుణకాండలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉందని శ్రీరెడ్డి తెలిపారు. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల పసివాడు చనిపోతే జీహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోందని మండిపడ్డారు. ఇక కేసీఆర్ అసలే మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేసింది. సాత్విక్…
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచుతున్నాయి. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై అప్పుడే దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు తెరవెనక పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున పోటీకి పలువురు సినీ ప్రముఖులు ఆసక్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం.. బీజేపీపై యుద్ధంలో కేసీఆర్ కు ప్రధాన మద్దతుదారునిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఈసారి ఆయన బీఆర్ఎస్ తరుఫున పోటీ చేస్తారని అంటున్నారు. గతంలోనే ఆయన మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ పోటీ ఎక్కువగా ఉండటం.. పైగా కొత్త వ్యక్తి కావడంతో ప్రకాష్ రాజ్ ను తప్పించారు కేసీఆర్. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ విస్తరణపై కర్ణాటకలో ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఆయన కర్ణాటక నుంచే పోటీ చేస్తారా..? తెలంగాణ నుంచి పోటీలో ఉంటారా..?అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు…
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకే ఈ వ్యవస్థను తీసుకొచ్చామని జగన్ సర్కార్ గొప్పలు చెప్పుకుంది. కానీ వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిస్తామని చెబుతూ వారి వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్లు సేకరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థపై ఇటీవల ఏపీ హైకోర్టు కూడా ఘాటుగా స్పందించింది. ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు ఏ అధికారంతో ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేస్తారని ప్రశ్నించింది. ప్రతి 50ఇళ్లకో ఓ వాలంటీర్ చొప్పున నియమించి వైసీపీ మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఏ వార్డులో ఎవరెవరు వైసీపీ సానుభూతిపరులు..? ఇతర పార్టీలకు చెందిన వారు ఎంతమంది ఉన్నారు..? ప్రభుత్వ పథకాలపై జనం ఏమనుకుంటున్నారు..?అనే అభిప్రాయాన్ని వాలంటీర్లు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వాలంటీర్ వ్యవస్థపై కేంద్ర, రాష్ట్ర…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మెప్పు ఉంటేనే వైసీపీలో ఎవరైనా కీలక నేతగా చెలామణి అవుతారు. లేదంటే వారంతా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి లెక్కే ట్రీట్ చేస్తారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి వ్యవహారంలో ఇదే సీన్ కనిపిస్తోంది. ఇటీవల కొంతకాలంగా వైసీపీ నేతలెవరూ విజయసాయిరెడ్డిని కలవడం లేదు. పార్టీలో ఒకప్పుడు నెంబర్ 2గా విజయసాయిరెడ్డి కొనసాగారు. అలాంటి నేతపై జగన్ నమ్మకం కోల్పోయారు. కారణం ఏంటో తెలియదు కానీ విజయసాయిని ఎవరూ కలవోద్దని హైకమాండ్ ఆదేశించినట్లు కనిపిస్తోంది. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య ఒక్కరే కనిపిస్తున్నారు. మొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. విశాఖ అభివృద్ధి పనుల కోసమే కలిసినట్లు చెప్పారు. విశాఖలో ఇన్వెస్ట్ మెంట్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కీలక సదస్సుకు విజయసాయిరెడ్డికి ఆహ్వానం అందకపోవడం వైసీపీలో ఎదో జరుగుతుందన్న అనుమానాలను పెంచేస్తోంది. విజయసాయిరెడ్డికి బడా,బడా పెట్టుబడిదారులతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన ద్వారా…
తారకరత్న మరణంతో విషాదంలో మునిగిపోయిన నందమూరి కుటుంబం ఈ విషాదం నుంచి ఇంకా తెరుకోలేకపోతుంది. ఇటీవలే ఆయన పెద్దకర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఇక తారకరత్న చనిపోయిన రోజు నుంచి అతని భార్య అలేఖ్య రెడ్డి అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూనే ఉంది. ఆమె కంటతడి పెట్టని క్షణమంటూ లేదు. భర్తని నిత్యం తలచుకొని ఏడుస్తూనే ఉంది. తారకరత్నతో తనకున్న జ్ఞాపకాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో రోజూ పోస్టులు చేస్తోంది అలేఖ్యరెడ్డి. ఆమె పెడుతోన్న పోస్టులను చూస్తోన్న నెటిజన్లు ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషాదం నుంచి త్వరగా కోరుకునేలా భగవంతుడు నీకు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నారు. భర్తే ప్రపంచంగా బ్రతుకుతున్న అలేఖ్యరెడ్డి తారకరత్నను కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళింది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఇంస్టాలో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అంతే…