Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వారసులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకోవాలని తెగప్రయత్నం చేస్తున్నారు. వయోభారం, అనారోగ్యం దృష్ట్యా తమ వారసులను రాజకీయ అరంగేట్రం చేయించాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు మరో ఏడు నెలల సమయం ఉండగానే నియోజకవర్గ పర్యటనలు చేయిస్తూ ప్రజలతో మమేకం కావాలని సూచిస్తున్నారు. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన వారసుడిని వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ నుంచి బరిలో నిలపాలని యోచిస్తున్నారు. ఆయన కుమారుడు నియోజకవర్గంలో పర్యటనలు కూడా చేస్తున్నారు. కానీ పోచారంను కేసీఆర్ నిరాశపరిచారు. నేను ముసలోడిని అవుతున్నా..పోచారం కూడా అవుతున్నాడు. అయినప్పటికీ నేను ఉన్నంత కాలం పోచారం ఎమ్మెల్యేగా ఉండాలని ఇటీవలి సభలో కేసీఆర్ ప్రకటించారు. కారణం.. ఆయన వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటారని తెలియడంతో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఈ ప్రకటన చేయడం కొత్త చర్చకు దారితీస్తోంది. పార్టీలో వారసులకు టికెట్లు…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.నవీన్ ను అతని స్నేహితుడు హారిహర కృష్ణ అత్యంత దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.ప్రియురాలు నిహారికా రెడ్డి కోసమే హరకృష్ణ ఇదంతా చేసినట్లు చెప్పారు. దాంతో ఈ కేసులో ఏ1 హరిహర కృష్ణ , ఏ2గా హాసన్, ఏ3 నిహారికా లను చేర్చారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను ఎల్బీ నగర్ డీసీపీ సాయి శ్రీ వెల్లడించారు.అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర జరిగిన బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ఫిబ్రవరి 17న పార్టీ పేరుతో నవీన్ ను హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్ మెట్ లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన తర్వాత నవీన్ ను హత్య చేసి, అతడి తల,గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలను…
బుల్లితెర యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంది శ్రీముఖి. పటాస్ షోలో యాంకర్ గా చేసిన శ్రీముఖి అక్కడ రవితో కలిసి బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. ఆ తరువాత ఈ అమ్మడుకు సినిమాలోనూ అవకాశాలు వచ్చాయి. సినీ ఆఫర్స్ రావడంతో నాజుకుగా తయారవ్వడంపై శ్రీముఖి ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. తాజాగా శ్రీముఖికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీముఖి తన పెళ్లి గురించి అన్ని ఇంటర్వ్యూలో ఒకే సమాధానం చెప్పేది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్తూ వచ్చేది కానీ ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని బయటపెట్టింది శ్రీముఖి. ఓ అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని.. ఇద్దరం కలిసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నామని చెప్పింది. కానీ అతను తనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను, ఫోటోలను లీక్ చేయడంతో మనస్తాపానికి…
బీజేపీపై యుద్ధం చేస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను జాతీయ స్థాయిలో ఎవరూ విశ్వసించడం లేదు. ఎనిమిదేళ్ళు బీజేపీతో అంటకాగి.. బీజేపీ తీసుకొచ్చిన పలు కీలక బిల్లులకు మద్దతు తెలిపిన కేసీఆర్ అనూహ్యంగా బీజేపీ వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. సంవత్సరకాలంగా కమలం పార్టీపై కన్నెరజేస్తున్నారు. మోడీని ప్రతి సభలో టార్గెట్ చేస్తున్నారు. అయినప్పటికీ బీజేపీయేతర పార్టీలకు కేసీఆర్ పై నమ్మకం కుదరడం లేదు. ఇంకా ఆయనపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇందుకు కారణం కేసీఆర్ గతంలో అవలంభించిన రాజకీయ విధానాలే. ఆయనతో కలిసి బీజేపీపై ఉమ్మడి పోరు చేసేందుకు జాతీయ స్థాయి నేతలు తటపటాయిస్తున్నారు. బీజేపీపై పోరాడుతున్నా కేసీఆర్ తన సభలు,సమావేశాలకు రావాలంటూ బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఆహ్వానం పంపుతున్నారు. దాంతో ఆ పార్టీలు తమ ప్రతినిధులను కేసీఆర్ నిర్వహించే సభలు, సమావేశాలకు పంపుతున్నాయి. కాని వారు నిర్వహించే సభలకు మాత్రం కేసీఆర్ ను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా తమిళనాడు…
సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది శ్రీలీల. ఆమె నటించిన సినిమాల్లో కథలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా శ్రీలీలను చూసేందుకే థియేటర్లకు క్యూ కడుతున్నారంటే..ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ అమ్మడు ఒక్కసారిగా పారితోషకం కూడా పెంచేయడంతో అందుకు దర్శక,నిర్మాతలు కూడా ఒకే చెప్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతి నిండా సినిమాలు ఉన్నాయి. పది సినిమాలు చేస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో శ్రీలీలకు ఇంతటి క్రేజ్ రావడానికి కారణం ఏంటో తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. గూగుల్ లో ఈ అమ్మడు గురించి తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నారు. గూగుల్ లో శ్రీలీల గురించి వెతకగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీలీలకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తేలింది. అదేంటి.. 21ఏళ్ల వయస్సులోనే ఆమె ఇద్దరు పిల్లలకు తల్లైందా..? అని ఆశ్చర్యపోకండి. ఆమె గురు, శోభిత అనే ఇద్దరు అనాధలను దత్తత…
వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు హాజరు కావాలని మూడోసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటిసులు ఇచ్చింది. సోమవారం విచారణకు రావాలని ఆదేశించింది. కానీ అవినాష్ రెడ్డి తను ముందుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయని సీబీఐకి చెప్పడంతో చివరి నిమిషంలో సీబీఐ కూడా కరుణించింది. పదో తేదీన విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి గడువు ఇచ్చారు. ఈ విషయాన్ని అవినాష్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. వివేకా హత్యకేసు విచారణలో ఈ నెల 10వ తేదీన సీబీఐ ముందు విచారణకు హాజరు అవుతానని వెంపల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అవినాష్ రెడ్డి ప్రకటించారు. 12వ తేదీన తన తండ్రి భాస్కర్ రెడ్డి కడపలో విచారణకు హాజరు అవుతారని వెల్లడించారు. మొదట సోమావారం విచారణకు హాజరు కావాల్సిందేనని సీబీఐ అవినాష్ రెడ్డిని ఆదేశించింది. దీంతో ఆయన తనకు పనులు ఉన్నాయని వంకలు చెప్పడంతో.. విచారణకు అవినాష్ రెడ్డి సహకరించడం…
మెడికో ప్రీతి కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారింది. ఆమెను మొదట వరంగల్ ఆసుపత్రికి తరలించాక ప్రీతీ నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. తాజాగా ఆ టాక్సీకాలజీ రిపోర్టులు వరంగల్ సీపీ రంగనాథ్ కార్యాలయానికి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఆమె రక్తం, గుండె, కాలేయంతోపాటు ఇతర శరీర భాగాల్లో విష పదార్థాల ఆనవాళ్ళు లేవని టాక్సీకాలజీ రిపోర్ట్ లో తేలినట్లు తెలుస్తోంది. ప్రీతి శరీర భాగాలలో ఎక్కడ పాయిజన్ పదార్థాలు లేవని తెల్చినట్లు సమాచారం. దీంతో ప్రీతిది ఆత్మహత్య కాదు. హత్యా అనే అనుమానాలకు తాజాగా బయటకొచ్చిన రిపోర్ట్ లతో బలం చేకూరుతోంది. ఇప్పటికే ప్రీతి సంఘటనలో అనేక అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పైగా.. సంఘటన స్థలంలో కూల్ డ్రింక్స్, లెస్ ప్యాకెట్లు ఉండటం కూడా పలు అనుమానాలకు…
ప్రేమించిన అమ్మాయి కోసం మిత్రుడిని హత్య చేసిన హరిహరకృష్ణను పోలీసులు విచారిస్తోన్న సంగతి తెలిసిందే. నవీన్ ను ఎందుకు అత్యంత పాశవికంగా హత్య చేయాలనుకున్నాడు..? ఈ హత్యకు ఎవరైనా సహకారం అందించారా.? ఈ హత్యతో నవీన్, హరి స్నేహితురాలికి ఏమైనా సంబంధం ఉందా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ హత్య కేసులో యువతి ప్రమేయంపై అనుమానాలు కూడా రావడంతో ఆమెను కూడా విచారించేందుకు పోలీసులు అనుమతి తీసుకున్నారు. కానీ ఈ విచారణకు యువతి అసలు సహకరించలేదు. కౌన్సిలింగ్ ఇచ్చిన కూడా ఆమె తీరు మారలేదు. చివరికి ఆ హత్య కేసుతో యువతికి ఎలాంటి సంబంధం లేదని రాచకొండ సీపీ ప్రకటించారు. ప్రస్తుతం పొలిసు కస్టడీలోనున్న హరిని విచారించగా అతడి మాటలు విని పోలీసులే షాక్ అయ్యారట. నిజానికి ఈ హత్యకేసులో హరి చెప్పిన సమాధానాలను పోలీసులు అధికారికంగా బయటకు చెప్పింది లేదు. కేసు విచారణలో ఉన్న సమయంలో దర్యాప్తునకు…
భూమా మౌనిక – మంచు మనోజ్ ల పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధువరూలను ఆశీర్వదించారు. మంచు లక్ష్మి ఈ వివాహ వేడుకకు అన్ని తానై వ్యవహరించారు. భూమా మౌనికకు ఆల్రెడీ ఓ కొడుకు ఉన్నాడు. 2016లో బెంగళూర్ కు చెందిన గణేష్ రెడ్డి అనే వ్యక్తిని భూమా మౌనిక వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఓ కుమారుడు జన్మించాడు. అతనే ధైరవ్. గణేష్ తో మౌనికకు మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయారు.ప్రస్తుతం ధైరవ్ మౌనిక వద్దే ఉంటున్నాడు. ఇప్పుడు భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడంతో ఐదేళ్ళ ధైరవ్ బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు మంచు మనోజ్ ప్రకటించాడు. కాగా పెళ్లైన మరుసటి రోజే ఈ విషయం మీద మనోజ్ స్పష్టత ఇచ్చారు. భూమా మౌనిక కొడుకు బాధ్యత కూడా తనదే అని చెప్పకనే చెప్పాడు. ఆయన సోషల్ మీడియా పోస్ట్…
తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ ఫుల్ సపోర్ట్ చేస్తోంది. ఆయన పాదయాత్ర వివరాలు అడిగి తెలుసుకున్న రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీకి హాజరైన రేవంత్ ను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. పార్టీలో లుకలుకలను ఏమాత్రం పట్టించుకోవద్దని… అధికారమే లక్ష్యంగా సాగిపోవాలని సూచించారు. సీఎం అభ్యర్థి విషయంలోనూ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీని క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి టికెట్ల కేటాయింపులోనూ మీ నిర్ణయానికి పెద్దపీట వేస్తామని రాహుల్ గాంధీ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మీరు సూచించిన వ్యక్తులకే 80శాతం టికెట్లు ఇస్తామని రేవంత్ కు రాహుల్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక.. మొదటి నుంచి రేవంత్ కు అండగానున్న కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రేవంత్ కోసం ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నట్టు సమాచారం. డీకే ఇచ్చిన సమాచారంతోనే రేవంత్ ను రాహుల్ పిలిచి భుజం తట్టారని…