Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. సీఐడీ తరుఫు లాయర్ల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం చంద్రబాబు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ను సవాల్ చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఆయన తరుఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని వాదించారు. సీఐడీ తరుఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. చంద్రబాబును ఈ కేసులో అన్ని కోణాల్లో విచారించాల్సి…
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలతో బీఆర్ఎస్ విలువైన సమయాన్ని కోల్పోయిందని నిట్టూరుస్తోంది. పార్లమెంట్ స్పెషల్ సెషన్ ఎజెండా ఏంటో అంచనా వేయకుండా 20 రోజులపాటు ఎన్నికల ప్రచారాన్ని బంద్ పెట్టారు. జమిలి ఎన్నికలు వస్తేయేమోననే అంచనా వేశారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ప్రచారాన్ని ప్రారంభించవద్దని అభ్యర్థులకు ప్రగతి భవన్ నుంచి కబురు వెళ్ళింది. తీరా కేంద్రం జమిలి ఎన్నికల ఊసే ఎత్తకపోవడంతో బీఆర్ఎస్ ఉసురుమనింది. 20రోజుల విలువైన సమయం వృధా అయిందని పార్టీ నేతలే విసుక్కుంటున్నారు. కేంద్రం వ్యూహాలను అంచనా వేయలేకపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్ 20రోజుల వ్యవధిలో దారుణంగా పతనం అయింది. కారణం..జమిలి ఎన్నికలు ఉంటాయేమోనని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వేగం తగ్గించారు. ఈ గ్యాప్ లో కాంగ్రెస్ కార్యక్రమాలు పెరగడం.. హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరగడం, సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించడం.. అవి జనాల్లోకి వెళ్ళడంతో కాంగ్రెస్ గ్రాఫ్ కాస్త పెరిగింది. ఇప్పుడు జమిలి ఎన్నికలపై…
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అదినేత చంద్రబాబుకు రిమాండ్ ను పొడగించింది ఏసీబీ కోర్టు. మరో రెండు రోజులపాటు సెప్టెంబర్ 24 వరకు రిమాండ్ ను పొడగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఏసీబీ న్యాయస్థానం తీర్పుతో చంద్రబాబు మరో రెండురోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండనున్నారు. ఈవాల్టితో చంద్రబాబు రిమాండ్ పూర్తి కానున్న నేపథ్యంలో పోలీసులు ఏసీబీ న్యాయస్థానంలో ఆయన్ను వర్చువల్ గా హాజరు పరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయాన్ని న్యాయమూర్తి కోరారు. జైలు సౌకర్యాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అని అడిగారు. తనకు పెద్ద శిక్ష విధించారని..ఈ వయస్సులో జైలులో ఉంచి కుటుంబానికి దూరం చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ముందుగా తనకు నోటిసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని.. ముందుగా విచారణ జరిపి తప్పు ఉన్నట్లు తేలితే అప్పుడు అరెస్ట్…
వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా భక్తిశ్రద్దలతో ఘనంగా జరుగుతున్నాయి. లంబోదరుడికి రకరకాల నైవేద్యాలను సమర్పిస్తూ భక్తులు భక్తిని చాటుకుంటున్నారు. వినాయకుడికి ఇష్టమైన మోదకాలు,లడ్డులు, కుడుములు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఇక, గణనాథుడి నిమజ్జనం వరకు భక్తులంతా మాంసాహారాన్నికి దూరంగా ఉంటారు. కారణం.. గణపతి పూజలు చేసేవారు నాన్ వెజ్ కు దూరంగా ఉంటూ నిష్ఠతో ఉండాలనడమే. కాని వినాయకుడికి నాన్ వెజ్ తో నైవైద్యం సమర్పిస్తారని మీకు తెలుసా..? అవును.. వినాయకుడికి మాంసాహారాన్ని నైవైద్యంగా సమర్పిస్తారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఇది మరెక్కడో కాదు. భారతదేశంలోనే. ఉత్తర కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వందల ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతోంది. నాన్ వెజ్ ను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. సావాజీ కమ్యూనిటీ ఈ విశిష్టమైన ఆచారాన్ని నిర్వహిస్తోంది. రకరకాల నాన్ వెజ్ వంటకాలను నైవేద్యంగా పెడుతుంటారు. ఉత్తర కర్ణాటక ప్రాంత ప్రజలు శ్రావణ మాసంలో భక్తిశ్రద్దలతో ఉంటారు. నాన్ వెజ్ ను అసలే…
బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముందే ఆశావహులతో చర్చలు జరిపి ఏ సమస్య ఉండదని నిర్దారించుకున్న తరువాతే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు కేసీఆర్. తీరా అభ్యర్థుల ప్రకటన వెలువడిన తరువాత ఆశావహులు ఒక్కొక్కరు అసంతృప్తి రాగాలను ఆలపిస్తున్నారు. బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ స్పీకర్ మధుసూదన చారి కుమారుడు ప్రశాంత్ ప్రకటించారు. కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన నాటి నుంచి ఎలాంటి ప్రకటన చేయని ప్రశాంత్ తాజాగా బరిలో ఉంటానని ప్రకటించడం పట్ల రకరకాల సందేహాలు కల్గుతున్నాయి. టికెట్ ప్రకటన తరువాత గండ్ర దంపతులు మధుసూదన చారి నివాసానికి వెళ్లి.. ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరారు. అందుకు ఆయన అంగీకరించారు కూడా. ఇప్పుడు ఆయన కుమారుడు రెబల్ గా పోటీ చేస్తానని ప్రకటించడం పట్ల పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నిర్ణయం వెనక మధుసూదన చారి ప్రోత్సాహం ఉందా..? అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ప్రశాంత్ వ్యవహారం కేటీఆర్…
ఇటీవలే విడాకులు తీసుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల విషయంలో నాగబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుణ్ తేజ్ తోపాటు నిహారిక పెళ్లి కూడా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో నాగబాబు ఉన్నారని ఫిలింసర్కిల్లో వార్త హల్చల్ చేస్తోంది. నవంబర్ లో వరుణ్ తేజ్ వివాహం జరగనుండగా.. అప్పుడే నిహారిక పెళ్లి కూడా చేసేయాలనే తలంపుతో నాగబాబు ఉన్నట్లు టాక్. ఆయనకు తన ఇద్దరు పిల్లలంటే పంచ ప్రాణాలు. ఇద్దరినీ అన్యోన్యంగా చూసుకున్నారు. నిహారికకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయగా.. ఆమె కాపురం రెండేళ్ళపాటు కూడా కొనసాగలేకపోయింది. చైతన్య- నిహారికల మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దాంతో ఇప్పుడు నిహారికకు మరో పెళ్లి చేసి ఆమె లైఫ్ ను సెట్ చేయాలని నాగబాబు అనుకుంటున్నారట. ఇందులో భాగంగా వరుణ్ తేజ్ పెళ్లితో పాటు నిహారిక పెళ్లి కూడా జరిపించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం మెగా ఫ్యామిలీతో…
వైసీపీ సన్నిహితంగా మెదిలే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునను రాజకీయాల్లోకి తీసుకురావాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. మొన్నటిదాకా ఆయనను విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో నిలుపుతారని ప్రచారం జరిగింది. కాని, మారుతున్న రాజకీయ పరిణామాలతో నాగార్జునను పెద్దల సభకు పంపాలని చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఏపీ నుంచి రెండు స్థానాలు ఖాళీ అవుతాయి. అందులో ఒకటి నాగర్జునకు ఇచ్చే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. ఓ రాజ్యసభ స్థానం టాలీవుడ్ లో నుంచి ఒకరికి ఇవ్వాలని వైసీపీ ముందే ప్లాన్ చేసుకుంది. అలీకి ఇవ్వాలని ముందు అనుకున్నారు కాని ఆయనకు కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో… ఇప్పుడు ఆ రాజ్యసభ సీటును నాగార్జునకు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో వైసీపీ హైకమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు. నాగార్జునను రాజ్యసభకు పంపిస్తే ఎలా ఉంటుంది..? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారట వైసీపీ నేతలు. పైగా వచ్చే…
గురువారం ఉదయం సెల్ ఫోన్లన్నీ అలర్ట్ మెసేజ్ లతో ఒక్కసారిగా మోత మోగాయి. పెద్ద సౌండ్ తో ఈ అలర్ట్ మెసేజ్ లు రావడంతో మొబైల్ వినియోగదారులు బెంబేలేత్తిపోయారు. ఫోన్ పెలుతుందేమోనని కొంతమంది టెన్షన్ పడగా…ఎవరైనా ఫోన్ హ్యాక్ చేశారేమోనని మరికొందరు ఆందోళన చెందారు. ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ గురించి కేంద్రం స్పందించింది. ఈ అలర్ట్ మెసేజ్ లతో ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. ప్రకృతి విపత్తుల సమయంలో భద్రత దృష్ట్యా ప్రజలను అలర్ట్ చేసేందుకు ఈ ట్రయల్ రన్ చేశారని భారత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదల్లాంటి సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇలాంటి అలర్ట్ మెసేజ్ పంపనున్నారు. దీనిని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించగా.. ఈరోజు పరీక్షించారు. పెద్ద సౌండ్‌తో కూడిన మెసేజ్ అందరికీ రావడంతో.. యూజర్లు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మెసేజ్ వచ్చింది.…
తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి స్వరాలు వినిపించకుండా హైకమాండ్ చర్యలు చేపడుతోంది. ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారో గుర్తిస్తూ వారిని లైన్ లో పెడుతున్నారు. ఎన్నికల కమిటీలో తమకు చోటు లభించలేదని అలక వహించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు మధుయాష్కీలకు స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించారు. సీనియర్లు ఎవరూ అసంతృప్తికి గురి కాకుండా ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాలో చాలామంది సీనియర్లకు చోటు కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు. పార్టీకి సీనియర్లు దూరం కాకుండా, ఎవరిని అసంతృప్తికి గురి కాకుండా హైకమాండ్ పూర్తి స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు లేవని.. అంత ఐక్యంగా ఉన్నారని సందేశాన్ని ఇచ్చేందుకు బస్సు యాత్రను హైకమాండ్ పరిశీలిస్తోంది. నేతలందరూ ఉత్తర తెలంగాణను కవర్ చేసేలా పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది..? అనే విషయాన్నీ పరిశీలించి తేదీలను ఖరారు చేయనున్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా పార్టీలో విబేధాలు లేవని..…
బీజేపీ నేత తూళ్ళ వీరేందర్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీతో కలిసి ఆయన బుధవారం ఢిల్లీ వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ భేటీ జరుగుతున్న నేపథ్యంలో మధుయాష్కీతో కలిసి వీరేందర్ గౌడ్ హస్తినకు వెళ్ళడం ఆసక్తికరంగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీరేందర్ గౌడ్ ఏఐసీసీ నేతలను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులోగా లేదా అక్టోబర్ లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో వీరేందర్ గౌడ్ కాంగ్రెస్ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్ళడంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇటీవల దేవేందర్ గౌడ్ ను రేవంత్ రెడ్డి కలిసి కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో వీరేందర్ గౌడ్ కాంగ్రెస్ నేతలతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వీరేందర్ గౌడ్, మధు యాష్కీతో కలిసి ఢిల్లీ వెళ్ళడంతో…