Author: Prashanth Pagilla

జంబలకిడి పంబ సినిమా గుర్తుందా..?అంత తేలిగ్గా మరిచిపోయే సినిమానా అది. ఆడవారు, మగవారుగా..మగవాళ్ళు ఆడవాళ్ళలాగా మారిపోయి కనిపించే సీన్స్ ఈ సినిమాలో హైలెట్ చేసి చూపించాడు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ.ఈ చిత్రంలోని ప్రతి సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. అయితే..ఈ మూవీలో మగవారు ఆడవారుగా,ఆడవారు మగవాళ్ళగా మారిపోయినట్లు రియల్ లైఫ్ లో ఎక్కడైనా జరుగుతుందా..? అంటే ఛాన్స్ లేదని కొట్టిపారేస్తాం. కాని ఏపీలోని కర్నూల్ జిల్లాలో మాత్రం ప్రతి ఏడాది జంబలకిడి పంబ సీన్స్ కనిపిస్తుంటాయి. ఆదోని మండలం సంతేకుడ్లురు గ్రామంలో హోలీ సందర్భంగా రెండు రోజులపాటు మగవాళ్ళు ఆడవాళ్ళ వేషధారణలో కనిపిస్తారు. గ్రామంలోని ప్రతి మగాడు ఈ రెండు రోజులపాటు చీర కట్టుకొని ఆడవాళ్ళ మాదిరి కనిపిస్తూ ఉంటారు. కర్ణాటక సరిహద్దులోని సంతేకుడ్లురు గ్రామంలో ఏళ్లతరబడి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. హోలీ సందర్భంగా మగవారు ఆడవారి వేషధారణలో పూజలు నిర్వహించడం వలన ఇంటికి మరియు గ్రామానికి మంచిదని అక్కడివారు అంటున్నారు.…

Read More

ఇటీవలే మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డిల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. మౌనికకు ఐదేళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. ఇక నుంచి బాబు బాధ్యత కూడా తనదేనని మనోజ్ స్పష్టం చేశాడు. అయితే.. భూమా మౌనికతో మంచు మనోజ్ కు పరిచయం ఎలా ఏర్పడింది.? వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఏంటనే విషయాలపై జోరుగా చర్చ జరుగుతోంది. మౌనిక రెడ్డి తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్ ఫిలిం అకాడమీలో బ్రాడ్ కాస్టింగ్ జర్నలిజంలో చేరింది. మనోజ్ కూడా అదే అకాడమిలో యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఈ అకాడమిలోనే మౌనిక – మనోజ్ లకు పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట. కాని ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకోలేదట. ఇక అదే సమయంలో తన తండ్రి భూమా నాగిరెడ్డి కుదిరించిన పెళ్లి మౌనిక చేసుకుంది. బెంగళూర్…

Read More

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. నవీన్ కుమార్ , సీఎం ఒఎస్డీగా పని చేస్తోన్న గాయకుడు దేశపతి శ్రీనివాస్ ,ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామి రెడ్డి పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా తుమ్మలకు అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ ప్రొ మీడియా కూడా రెండు రోజులుగా హడావిడి చేసింది. కానీ కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశం అవుతోంది. మార్చి 29న అలిమినేటి కృష్ణారెడ్డి, వూల్లోళ్ల గంగాధర్ గౌడ్, కురుమయ్య గారి నవీన్ కుమార్ లు పదవీ విరమణ చేయడంతో వారి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం తుమ్మల, నవీన్ కుమార్ , చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లు ఖరారు అయ్యాయని మంగళవారం ఉదయం నుంచి ప్రచారం జరిగింది. తుమ్మలకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఆఫర్…

Read More

తెలంగాణ సమాజం ఎన్నడూ లేనంతగా గిడసబారి పోతుందేమోనని భయమేస్తుంది. ఏ రకమైన స్పందనలు లేని కాలమొకటి దాపురించింది. ఆకురాలు కాలమంటే భయానక దృశ్యం సాక్షాత్కరించేది, కానీ వెంటనే వసంతం ప్రవేశిస్తుందనే సాంత్వన ఉండేది. ఇపుడు ఏ కాలమైనా దృశ్యం ఒకేలా వ్యక్తం కావటం చూస్తే ఈ సమాజానికి ఏర్పడిన పరిమితి స్పురణలోకి వస్తుంది. ఎదుటి మనిషి స్వేచ్ఛను రక్షించడానికి ప్రాణాన్నే తృణప్రాయంగా ఇచ్చే లెగసిని తెలంగాణ నేల నిదానంగా వదులుకుంటున్నట్లు అన్పిస్తుంది. ‘నీ కాలికి గుచ్చిన ముళ్లును నా పంటితో తీస్తాను’ అనే ప్రాచీన వాక్యం పలికి చోట దారినిండా పల్లేరు కాయలను చల్లి నెత్తురు స్రవిస్తున్నా పరుగెత్తించే సంస్కృతిని తెలంగాణ నేల పునరావృతం చేసుకుంటుంది. చరిత్ర విషాదంగానూ, ప్రహసనంగానూ పునరావృతం కావడమంటే ఇదే కాబోలు. పాలింకి పోవడానికి మందులున్నట్లు మనస్సు ఇంకిపోవడానికి మందులుంటే ఎంత బాగుండునోనని కవయిత్రి ఒక కాలంలో రాసింది. ఈ కాలంలో స్పందనలన్ని ఇంకిపోయినప్పుడు వికసించడానికి ఏ…

Read More

ఏపీలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ నేత నారా లోకేష్ పై పోటీకి వైసీపీ నుంచి బైరెడ్డి సిద్దార్థ రెడ్డి బరిలో నిలవనున్నారా..? అంటే అవుననే అంటున్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే కొడాలి నాని. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. యువగళం పేరిట పాదయాత్ర చేస్తోన్న నారా లోకేష్ సీఎం జగన్ పై పదేపదే విమర్శలు చేస్తున్నారు. దీంతో కొడాలి నాని తనదైన శైలిలో రెచ్చిపోయారు. లోకేష్ తాను పెద్ద నాయకుడిననే భ్రమలో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు అంత సీన్ లేదని.. జగన్ విమర్శించే స్థాయి లోకేష్ ది కాదని కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే లోకేష్ కు కొడాలి నాని సవాల్ విసిరారు. లోకేశ్ యువగళానికి పోటీగా తమ పార్టీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో సభ పెట్టిస్తామన్నారు. లోకేష్ సభ కంటే సిద్దార్థ రెడ్డి సభకు పదిరేట్లు యువత…

Read More

గత కొన్ని రోజులుగా గుండెపోటు వార్తలు చూస్తూనే ఉన్నాం. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతోంది. ఒకప్పుడు గుండెపోటు 50ఏళ్ళు పైబడిన వారిలోనే కనిపించేది కాని, ఇప్పుడు టీనేజ్ పిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సడెన్ హార్ట్ ఎటాక్ లు నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకుగాను కరోనా వ్యాక్సిన్ ను వందశాతం పూర్తిగా పరిక్షించకుండానే వినియోగానికి ప్రపంచవ్యాప్తంగా అనుమతులు ఇచ్చారు. దాంతో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ సడెన్ స్ట్రోక్ లు తలెత్తుతున్నాయని కొంతమంది అనుమానిస్తున్నారు. కరోనా ముందు గుండెపోటుతో మృతి చెందిన వారి సంఖ్యతో పోలిస్తే కరోనా తరువాత గుండెపోటుతో మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువ ఉండటం ఈ అనుమానాలను మరింత పెంచేస్తోంది. ఆందోళన…

Read More

మెడికో ప్రీతి కేసులో రోజుకో వార్త బయటకొస్తుంది. సీనియర్ సైఫ్ వేధింపులు భరించలేకే ఆమె మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుందని మొదట ప్రకటించారు. కట్ చేస్తే ప్రీతి శరీర భాగాలలో ఎక్కడ విష పదార్థాల ఆనవాళ్ళు లేవని టాక్సీకాలజీ రిపోర్ట్ లో తేలింది. మరి ప్రీతి చావుకు కారణం ఏమై ఉంటుంది..? అనే సందేహం అందరిలోనూ తలెత్తుతోంది. ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండటానికి కారణం ఏమిటి..? ప్రీతి అపస్మారక స్థితిలో పడిఉన్న చోట కూల్ డ్రింక్స్, లెస్ ప్యాకెట్లు ఎలా వచ్చాయి..? ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లుగానే ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారా..? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రీతి కేసులో నిందితుడిగా భావిస్తోన్న సైఫ్ నుంచి కీలక విషయాలు పోలీసులు రాబడుతున్నారని కథనాలు వస్తున్నాయి. కేవలం బ్రెయిన్ లేదని అన్నంత మాత్రాన ప్రీతి సూసైడ్ అటెంప్ట్ చేస్తుందని అనుకోలేదని విచారణలో సైఫ్ చెప్పినట్లు సమాచారం. అలాగే…

Read More

టీడీపీతో అంటీముట్టినట్లు వ్యవహరిస్తోన్న వంగవీటి రాదా త్వరలోనే జనసేనలో చేరనున్నారని జరుగుతోన్న ప్రచారానికి తాజాగా తెరపడింది. ఈ నెల 14న మచిలీపట్నంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభలో వంగవీటి రాధ పవన్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకుంటారని కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. దీనికి ఒక్క అడుగుతో చెక్ పెట్టేశారు రాధా. ప్రస్తుతం పీలేరులో సాగుతోన్న లోకేష్ యువ గళం పాదయాత్రలో వంగవీటి రాధా పాల్గొన్నారు. లోకేష్ తో పాదయాత్రలో కలిసి నడిచారు. పాదయాత్ర విరామ సమయంలో ఆయనతో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై లోకేష్ చర్చించారు. పాదయాత్రలో రాదా భాగస్వామ్యం కావడంతో ఆయన టీడీపీలోనే కొనసాగుతారనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.లోకేష్ పాదయాత్రలో హఠాత్తుగా వంగవీటి రాధా వచ్చి కలవడంతో టీడీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. లోకేష్ ను పాదయాత్రలో కలిసేందుకు విజయవాడ నుంచి బయలుదేరిన వంగవీటి రాధా…ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పాదయాత్ర వివరాలు అడిగి…

Read More

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే యాత్రకు 69మందితో భద్రత కల్పిస్తున్నామని సర్కార్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా ..వీటిని రేవంత్ తరఫు న్యాయవాది ఖండించారు. ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెబుతున్న 69మంది సిబ్బంది కేవలం యాత్ర బందోబస్తు, ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకేనని వాదించారు. ఈ యాత్రకు అదనపు భద్రత కల్పించాలని హైకోర్టులో రేవంత్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది న్యాయస్థానం. రేవంత్ పాదయాత్రకు అదనపు భద్రత అవసరం లేదని వాదించిన బీఆర్ఎస్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అద్యక్షుడు, అందులోనూ ఎంపీ అయిన రేవంత్ రెడ్డి యాత్రపై ఇటీవల దాడి జరిగిన విషయాన్ని హైకోర్టులో రేవంత్ తరుఫు న్యాయవాది బలంగా వినిపించారు. రేవంత్ యాత్రపై దాడి జరుగుతోన్న సమయంలో పదుల సంఖ్యలో…

Read More

అల్లు అర్జున్ పెళ్లి రోజు కావడంతో ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. భార్యకు తనదైన శైలిలో విషెస్ చెప్పారు. ‘హ్యాపీ యానివర్సరీ క్యూటీ’ అంటూ పోస్ట్ చేశారు. ఇక, అల్లు అర్జున్ – స్నేహారెడ్డిలకు బన్నీ ఫ్యాన్స్ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో మరికొందరు మాత్రం కొంటె కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ , స్నేహరెడ్డితో ఏకాంతంగా కలిసున్న ఫోటోను పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ నుద్దేశించి… కొండగుట్టలో భార్యతో ఏకాంతంగా గడుపుతున్నారా..? అంటూ సోషల్ మీడియాలో కొంటె కామెంట్స్ చేస్తున్నారు. 2011 మార్చి 6న అల్లు అర్జున్-స్నేహ రెడ్డిల వివాహం జరిగింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా స్నేహరెడ్డి – అల్లు అర్జున్ లకు పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తరువాత ఇంట్లోని కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మొదట అల్లు అర్జున్ తో పెళ్లి అనగానే…

Read More