Author: Prashanth Pagilla

ఓ వైపు లిక్కర్ స్కామ్ తో కల్వకుంట్ల కవిత ఇరకాటంలో పడగా… మరోవైపు కేసీఆర్ కూడా ఇబ్బందుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంపై కారాలు మిరియాలు నూరుతున్నా కేసీఆర్ కు దిమ్మతిరిగే రీతిలో షాక్ ఇచ్చేందుకు కేంద్రం తెరవెనక కసరత్తు చేస్తోంది. ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోని కేంద్రం… కేసీఆర్ దూకుడు రాజకీయాలతో రూట్ మార్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షల కోట్లపైనే ఖర్చు చేశారు. ప్రతిసారి ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతూ పోయారు. 30వేల కోట్లతో నిర్మాణం చేస్తామని లక్ష 30కోట్లకు తీసుకెళ్ళారు. దీంతో ఈ ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంలా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా కేంద్రంలోని బీజేపీ నేతలే ఈ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ మేఘా కృష్ణారెడ్డికి దక్కింది. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఖర్చు గురించి కాగ్ ఆరా…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తన కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారా..? కవితను ఈ కేసు నుంచి బయట పడేయండని కేంద్ర పెద్దలతో కేసీఆర్ కాళ్ళబేరానికి దిగుతున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటిసులు ఇచ్చింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై నుంచి సేకరించిన సమాచారంతో కవితను విచారణకు పిలుస్తుండటంతో.. ఆమెను అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే జరిగితే బీఆర్ఎస్ కు నష్టం తప్పదు. ఇప్పుడిప్పుడే జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..లిక్కర్ స్కామ్ లో కూతురు అరెస్ట్ అయితే అది పార్టీ ఎదుగుదలకు ఏమాత్రం మంచిది కాదు. పార్టీపై జాతీయంగా చెడు అభిప్రాయం నెలకొనే ప్రమాదం ఉంటుంది. వీటన్నింటిని అంచనా వేసిన కేసీఆర్ కేంద్రం పెద్దలతో రాయబారానికి ఆసక్తిచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సమయంలో ప్రధానిమోడీని నేరుగా…

Read More

31ఏళ్ల ఓ మహిళా 13ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం పెట్టుకొని గర్భం దాల్చిన సంఘటన సంచలనంగా మారింది. ఇంట్లో ఒంటరిగా ఉండే సదరు మహిళా బాలుడిపై మనస్సు పారేసుకుంది. ఈ క్రమంలోనే అతనితో శారీరక సౌఖ్యాన్ని కోరుకుంది. బాలుడే కదా అని ఆమె ఇంట్లోకి పదేపదే అతను వెళ్ళినా కూడా ఎవరూ పెద్దగా అనుమానించలేదు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చడంలో అసలు విషయం బట్టబయలు అయింది. అమెరికాలోని కొలరోడా రాష్ట్రానికి చెందిన ఆండ్రియా సెరానో ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. పొరుగింట్లో ఉంటున్న బాలుడిని అమితంగా ఇష్టపడేది. ఈ నేపథ్యంలో ఆమె లైంగిక కోరికలను తీర్చుకునేందుకు బాలుడితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అతనికి పదేపదే చెప్పింది. అతను కూడా వయస్సులో చాలా చిన్నవాడు కావడంతో ఎప్పుడు ఈ విషయం లీక్ చేయలేదు. బాలుడితో శారీరక సంబంధం పెట్టుకున్న సెరానో గర్భం దాల్చడంతో విషయం కాస్త కోర్టుకు…

Read More

గురువారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అద్యక్షతన ప్రగతి భవన్ లో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మూడు లక్షల ఆర్ధిక సాయంపై గైడ్ లైన్స్ ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా సొంత జాగ ఉన్నోళ్ళకు మూడు లక్షల ఆర్ధిక సాయం అందిస్తామని ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. సొంత జాగ ఉన్నోళ్ళకు మూడు లక్షల సాయం అందించడంపై గైడ్ లైన్స్ ను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎవరికీ ఈ మూడు లక్షల సాయం అందించాలి..? ఎలాంటి పరిమితులు విధించాలి..? దశల వారీగా ఒకేసారి ఈ ఆర్ధిక సాయాన్ని అందిస్తే ఎలా ఉంటుంది..? విడతల వారీగా విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న అంశాలపై చర్చించి.. విధివిధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెలలో అర్హులను…

Read More

పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించిన మంచు మనోజ్ – భూమా మౌనికలు ఇటీవలే శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ..తాను ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉన్నానని.. మౌనికకు రాజకీయాలపై ఆసక్తి ఉందంటే అందుకు తాను సహకరిస్తానని మనోజ్ వ్యాఖ్యానించడంతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ ప్రారంభమైంది. ఇప్పటికే భూమా మౌనిక సోదరి భూమా అఖిలప్రియ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆమె గతంలో మంత్రిగా కూడా పని చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి ఆమె పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే భూమా మౌనిక కూడా రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారని..అందుకే మౌనికకు రాజకీయాలపై ఆసక్తి ఉందంటే తాను సహకరిస్తానని మనోజ్ చెప్పి ఉంటారని అంటున్నారు. టీడీపీ నుంచి అక్కా చెల్లెళ్ళకు ఇద్దరికీ టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం ఇస్తారు. దాంతో మౌనిక వైసీపీ నుంచి టికెట్ ఇస్తామని హామీ ఇస్తే…

Read More

ఆరునూరైనా ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలని బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్, కేసీఆర్ అవినీతి వ్యవహారాలు అమిత్ షాకు అస్త్రాలుగా మారాయి. ఎలాగైనా కేసీఆర్ ను లొంగదీసుకునే మార్గమైతే దొరికింది కానీ రేవంత్ రెడ్డి బీజేపీకి పంటికింది రాయిలా మారాడు. యాత్ర ఫర్ చేంజ్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళిన రేవంత్ బీఆర్ఎస్ , బీజేపీలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడుతున్నారు. రెండు పార్టీల రహస్య మైత్రిని ఎండగడుతున్నాడు. ఇదంతా బాగానే ఉన్న రేవంత్ ఇస్తోన్న హామీలు.. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న అమిత్ షా లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఇంటలిజెన్స్ వర్గాల సమర్పించిన నివేదికలతో తేటతెల్లమైంది. దీంతో బీజేపీ తెలంగాణలో పెను విధ్వంసాన్ని సృష్టించాలని కుట్రలు చేస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రామచంద్ర పిళ్ళైను విచారించిన ఈడీ…ఆయన కవిత బినామీగా అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.ఆయన్ను అరెస్ట్ చేసిన ఒక్క…

Read More

ప్రేమకు అడ్డుగా ఉన్నాడని స్నేహితుడు నవీన్ ను హత్య చేసిన హారిహరకృష్ణను విచారించిన పోలీసులు ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు హారిహారకృష్ణ స్నేహితుడు హసన్, ప్రియురాలు నిహారికరెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో హరికి సహకరించడమే కాకుండా నవీన్ ను హత్య చేసినట్లు తెలిసినా దాచి పెట్టినందుకు ఈ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలు నిహారిక కోసమే నవీన్ ను హత్య చేసినట్లు కస్టడీలోనున్న హారి చెప్పాడు. దీంతో పోలీసులు నిహారికను ఈ కేసులో నిందితురాలిగా చేర్చి కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. నిహారికతోపాటు హరిహరకృష్ణ స్నేహితుడు హసన్‌ను కూడా రెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు. ఈ కేసులో ఏ1గా హరిహరకృష్ణ, ఏ2గా హాసన్, ఏ3గా నిహారిక పేర్లు చేర్చారు. నవీన్ ను హత్య చేసిన అనంతరం హారిహరకృష్ణ ప్రేయసి నిహారికకు హత్య విషయం చెప్పాడు. ఫోటోలు కూడా…

Read More

పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక పరీక్షలన్నింటిని సీసీ కెమెరా పర్యవేక్షణలో నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను అమర్చేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖను ఆదేశించింది. గత ఏడాది ఏపీలో పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కార్పోరేట్ , ప్రైవేట్ విద్యా సంస్థలు ఇదే తరహాలో పేపర్లు లీక్ చేస్తాయనే అనుమానంతో సీసీ కెమెరాల నిఘాలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. పరీక్ష ప్రశ్న పత్రాలను సీల్ చేసినప్పటి నుంచి జవాబు పత్రాలను ప్యాక్ చేసే వరకు అంత సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేలా కెమెరాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ సీసీ కెమెరాలను చీఫ్ సూపరింటెంట్, డిపార్ట్‌మెంట్ అధికారి గదుల్లో బిగించాలని ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాల సెంటర్లంటిన్నింటిలోనూ సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని ప్రభుత్వ పరీక్షల విభాగం…

Read More

జనసేనలో నెంబర్ 2గా కొనసాగుతోన్న నాదెండ్ల మనోహర్ పార్టీని వీడే విషయమై సమాలోచనలు జరుపుతున్నారని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయనకు టీడీపీ నుంచి ఆహ్వానం అందిందని..దీంతో జనసేనతో కటీఫ్ చెప్పేందుకు మనోహర్ నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు. టీడీపీ -జనసేన పొత్తు అంశంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా చర్యలు తీసుకుంటానని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ ఆ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేవలం వైసీపీ అవలంభిస్తోన్న రాజకీయ విధానాలపై మాత్రమే చర్చించామని ఇరు పార్టీల వర్గాలు స్పష్టం చేశాయి. పొత్తులపై ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. కానీ,జనసేన కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ రెడీగా లేదు.దాంతో పొత్తులు చర్చలకే పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి,. ఈ నేపథ్యంలో జనసేనలోకి వెళ్తారని అనుకుంటున్నా నేతలను చంద్రబాబు మెల్లగా టీడీపీలోకి లాగేసుకుంటున్నారు.మహాసేన రాజేష్ తోపాటు…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ కూతురు , ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయనున్నారా..? మంగళవారం అరెస్ట్ చేసిన రామచంద్ర పిళ్ళైఇచ్చిన సమాచారంతో కవితను విచారణకు పిలవడం ఇందులో భాగమేనా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటిసులు జారీ చేసింది. గురువారం ఢిల్లీలో విచారణకు రావాలని ఆదేశించింది. మంగళవారం పిళ్ళై ను అరెస్ట్ చేసిన ఈడీ..రిమాండ్ రిపోర్ట్ లో ఆయన్ను కవిత బినామీగా పేర్కొన్నారు. దీనిని పిళ్ళై కూడా అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు. పిళ్ళై ను అరెస్ట్ చేసిన ఒక్క రోజు వ్యవధిలోనే కవితకు ఈడీ నోటిసులు ఇష్యూ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో సీబీఐ కవితకు నోటిసులు జారీ చేసినప్పుడు విచారణకు హాజరయ్యేందుకు కవిత గడువు కోరారు. హైదరాబాద్ లోని కవిత నివాసంలోనే ఆమెను సీబీఐ అధికారులు విచారించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని నోటిసులు…

Read More