Author: Prashanth Pagilla

సాంకేతిక పెరగడంతో చాలామంది ఆన్ లైన్ కొనుగోళ్ళపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. నచ్చిన వస్తువులను ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు..ఆహార పదార్థాలను కూడా ఆన్ లైన్ లోనే బుక్ చేస్తున్నారు. అటు ఫుడ్ ను డెలివరీ చేసే యాప్స్ చాలానే రావడంతో.. ఇంటి నుంచి ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారు. ఇది బాగానే ఉంది కానీ, అప్పుడప్పుడు ఆర్డర్ చేసిన ఫుడ్ లో క్రిమి కీటకాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. వాటిని చూసి కంప్లైంట్ చేస్తున్నారు కస్టమర్లు. దాంతో మరోసారి ఇలాంటి వాటిని జరగకుండా చూసుకుంటామని ఉచితంగా ఫుడ్ ను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన ఫుడ్ లో ఫుడ్ కు సంబంధం లేని వస్తువొకటి కనిపించింది. ప్లేస్ ఎక్కడో తెలియదు కానీ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఓ యువకుడు. ప్రముఖ ఆన్ లైన్…

Read More

తెలుగు సినిమా ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయికి చాటిన దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆయన ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయబోతున్నారో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారా..? ఎన్నికల్లో ఓటర్లను చైతన్యపరిచేందుకు రాజమౌళి ప్రచారం నిర్వహించనున్నారు. అయితే.. రాజమౌళి ఎన్నికల ప్రచారం చేసేది ఏ పార్టీకో.. ప్రభుత్వానికి మద్దతుగానో కాదు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచాలని ఆయన ఓటర్లను అభ్యర్థించనున్నారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళిని నియమించినట్లు ఆ జిల్లా చంద్రశేఖర్ నాయక్ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు రాజమౌళి ద్వారా చైతన్యపరిచాలని… ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు రాజమౌళి పేరు సిఫార్సు చేసినట్లు చెప్పారు. కర్ణాటక ఎన్నికల కమిషన్ చేసిన ఈ ప్రతిపాదనను రాజమౌళి కూడా ఆమోదించారని వివరించారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకా అమరేశ్వర క్యాంపులో జన్మించిన రాజమౌళి ప్రచారంతో జిల్లాలో పోలింగ్‌ శాతం…

Read More

గత కొద్ది కాలంగా నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తోన్న సీనియర్ నటుడు నరేష్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. అతి కొద్ది మంది సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను నరేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త తెగ చక్కర్లు కొడుతోంది. ఐతే.. పవిత్రతో పెళ్లి జరిగిన తేదీని మాత్రం నరేష్ ప్రకటించలేదు. నరేష్ పోస్ట్ చేసిన పెళ్లి వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. తండ్రి కృష్ణ మరణించి ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే పెళ్లి ఎలా చేసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. తండ్రి చనిపోయిన బాధ లేకుండా పవిత్రతో పెళ్లికి ప్రాధాన్యత ఇస్తారా..? అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మూడో భార్య రమ్యతో విడాకులు తీసుకోలేదు అప్పుడే పవిత్రతో పెళ్లి పీటలు ఎలా ఎక్కుతారని అంటున్నారు. మరోవైపు..కృష్ణ మరణించిన సమయంలోనూ నరేష్ ప్రవర్తన జుగుప్సాకరంగా ఉందని కొందరు గుర్తు…

Read More

విశ్వనగరం హైదరాబాద్ లో విదేశీ సంస్కృతి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మంచి, చెడు ఆలోచించకుండా కొత్త కల్చర్ కు హైదరబాద్ యువత అట్రాక్ట్ అవుతోంది. ఒకప్పుడు నగరంలోని కొన్ని ప్రాంతాలు వేశ్యలకు అడ్డాగా ఉండేవి. ఆ తరువాత ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్స్ తీసుకోవడంతో ఈ వేశ్య గృహాలు పత్తాకు లేకుండా పోయాయి. కానీ మరో విధంగా విస్తరించాయి. స్పా, మసాజ్ సెంటర్లలో ఈ తంతు కొనసాగుతోంది. తాజాగా మరో పాశ్చాత్య సంస్కృతి నగరంలో విస్తరిస్తోంది. సాఫ్ట్ వేర్ జాబులు చేస్తోన్న యువత…తమ లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు కొత్తదారులు వెతుకుతోంది. టెకీల్లో పెళ్లి పట్ల హేయభావం కనిపిస్తోంది. పెళ్లి చేసుకొని కుటుంబం కోసం సుఖవంతమైన జీవితాన్ని త్యాగం చేయాలా..? అని ఆలోచిస్తున్నారు. ఇక లైంగిక వాంచలను తీర్చుకునేందుకు మహిళలు కాల్ బాయ్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ కల్చర్ సిటీలో పెరిగిపోతుందని ఇటీవల కథనాలు వెలువడ్డాయి. పోలీసులు కూడా ఈ ఈ పాశ్చాత్య…

Read More

కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తే రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రాన్ని హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటిసులు ఇవ్వడంతో ఆమెను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో శ్రీనివాస్ గౌడ్ ఈ రకంగా స్పందించారు. లిక్కర్ స్కామ్ లో కవితకు ప్రమేయం లేకపోతే ఆ విషయాన్నీ విచారణ సంస్థలు తెలుస్తాయి. కానీ కవితను విచారణకు పిలిస్తేనే బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గాబార పడుతుండటం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. కేసీఆర్ కుటుంబమే టార్గెట్ గా బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తున్నారు. ఈడీ విచారణ అనంతరం లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించడం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సంకేతం కాదా..? ఆయనకే తెలియాలి. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటిసులు జారీ చేస్తే మహిళలను, తెలంగాణను అవమానించినట్లేనని…

Read More

నవీన్ ను అతికిరాతకంగా హత్య చేసిన హరిహరకృష్ణ పోలీసు కస్టడీలో పలు వివరాలు వెల్లడించాడు. నవీన్ పరిచయం మొదలు అతనిని హత్య చేసే వరకు జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా వివరించాడు. పోలీసు కస్టడీలో హరిహరకృష్ణ ఏం చెప్పాడో అతని మాటల్లోనే చూద్దాం. నేను 2017-19లో ఇంటర్ దిల్ సుఖ్ నగర్ లోని ఐడియల్ జూనియర్ కాలేజ్ లో చదివాను. నా ఇంటర్ సెకండియర్ సమయంలో నవీన్ పరిచయమయ్యాడు. నవీన్ మహాత్మా గాంధీ వర్సిటీలో, నేను అరోరా ఇంజినీరింగ్ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాం. మాకున్న పరిచయంతో అప్పుడప్పుడు ఇద్దరం కలుసుకునేవాళ్ళం. నవీన్ కు నిహారిక పరిచయమయ్యాక వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరు ఈ విషయాలను నాతో చెప్పేవారు. ఈ క్రమంలోనే నవీన్ మరో అమ్మాయితో తిరుగుతున్నట్లు నిహారిక నాతో చెప్పింది. ఆ విషయంలో మనస్తాపం చెంది నవీన్ తో మాట్లాడటం బంద్ చేసింది నిహారిక. నిహారిక అంటే నాకు చాలా ఇష్టం. నవీన్…

Read More

వైఎస్ వివేకా హత్య కేసులో తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. తనకు సీబీఐ 160సిఆర్పీసి సెక్షన్ కింద నోటిసులు ఇచ్చిందని.. ఆ నోటిసులు ఇస్తే అరెస్ట్ చేయకూడదన్నది ఆయన వాదన. ఆ సెక్షన్ కింద అరెస్ట్ చేయకూడదని మాట్లాడుతోన్న అవినాష్ రెడ్డి ఎందుకు హైకోర్టును ఆశ్రయించారంటే…. అరెస్ట్ చేస్తారేమోనని భయంతోనేనన్నది స్పష్టం అవుతోంది. అయితే.. సీబీఐ 160CRPC సెక్షన్ కింద నోటిసులు ఇచ్చి అరెస్ట్ చేసినా చేయవచ్చు. ఎందుకంటే విచారణకు సరిగా సహరించడం లేదని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే అవినాష్ రెడ్డి భయంగా చెబుతున్నారు. అరెస్ట్ చేస్తారనే పక్కా సమాచారంతోనే అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 6నే హైదరబాద్ లోని సీబీఐ కార్యాలయంలో మరోసారి విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి 4వ తేదీనే నోటిసులు ఇచ్చారు…

Read More

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన నవీన్ హత్యకేసులో మరో నిందితురాలిగానున్న నిహారిక విస్తుపోయే విషయాలను బయటపెట్టింది. నవీన్ తో ప్రేమాయణం మొదలు అతని హత్య వరకు జరిగిన పరిణామాలను వెల్లడించింది. నిహారిక ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం నేను ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్.. నేను ప్రేమించుకున్నాం. మేమిద్దరం ఇంట్లో కూడా కలుసుకునేవాళ్ళం. ఒక్కోసారి మేము గొడవ పడితే మాకు హారిహర కృష్ణ సర్దిచేప్పేవాడు. అలా మాకు చాలా దగ్గరయ్యాడు. నవీన్ తో గొడవ పడిన ప్రతిసారి హరితో ఇలా జరిగిందని చెప్పుకొని బాధపడేదానిని. ఈ క్రమంలోనే నవీన్ కు నాకు మనస్పర్ధలు వచ్చి విడిపోయాం. ఆ తరువాత హారి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నవీన్ నాతో మాట్లాడటం నచ్చని హారిహరకృష్ణ ఒక్కోసారి నవీన్ ను చంపేసి మనమిద్దరం ఎక్కడికైనా వెళదాం అని అనేవాడు. ఎందుకలా మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తే సరదాగా అన్నానని చెప్పేవాడని నిహారిక చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే హరిహరకృష్ణ…

Read More

ఏకచిత్ర నటుడని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించడం పట్ల భరత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను తలచుకుంటే వరుసగా పది హిట్ సినిమాలు తీస్తానని.. తన గురించి తక్కువ అంచనా వేయవద్దని స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు కామెడి యాక్టర్ కు తక్కువ… పనికిమాలిన యాక్టర్ కు ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు భరత్. భరత్ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఏకచిత్ర నటుడని రఘురామ విమర్శలు చేస్తారు. భరత్ చదువుకోవడానికి అమెరికా వెళ్ళారు. అక్కడ చదువు సరిగా ఒంటబట్టక చదువుకు గుడ్ బై చెప్పేసి ఇండియాకు తిరిగి వచ్చారు. తరువాత సినిమా ప్రయత్నాలు చేశారు. తండ్రి దండిగా సంపాదించి పెట్టడంతో సినిమా హీరో అవ్వాలన్న కోరికను తీర్చుకున్నారు భరత్. ఓయ్ నిన్నే అనే సినిమాతో హీరోగా పరిచయమైన భరత్ సినీ ఇండస్ట్రీలోపెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ఆ సినిమా ఉందన్న సంగతి కూడా జనాలకు తెలియదు. మొదటి…

Read More

పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు కరువై…పెళ్లి కాని ప్రసాద్ లా తయారవుతున్నారు అబ్బాయిలు. మ్యారేజ్ బ్యూరోలను ఆశ్రయిస్తూ ఎదో ఒక రకంగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరకక పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలు సతమతం అవుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను లైన్ లో పెట్టేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పి ఇద్దరితో సంసారం చేశాడు. ఇద్దర్నీ తల్లులను కూడా చేశాడు. తాజాగా ఆ ఇద్దర్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన ఓ యువకుడు ఒకేసారి ఇద్దరు గిరిజన యువతులను వివాహమాడాడు. డిగ్రీ చదువుకునే రోజుల్లో మడివి సత్తిబాబు అనే యువకుడు దోసిల్లపల్లి గ్రామానికి చెందిన స్వప్న కుమారి, కున్నాపల్లి గ్రామానికి చెందిన సునీతలను ప్రేమించాడు. ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా సత్తిబాబును ఇష్టపడ్డారు. దాంతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం కొనసాగించాడు. కొన్నాళ్ళ తరువాత విషయం ఆయా కుటుంబాలకు…

Read More