Author: Prashanth Pagilla

ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ను గచ్చిబౌలిలోని ఎఐజీ ఆసుపత్రికి తరలించారు.అనంతరం ఏఐజీ ఆసుపత్రి వైద్యులు కేసీఆర్ కు పలు వైద్య పరీక్షలను నిర్వహించారు. సిటీ స్కాన్, ఎండో స్కోపీ పరీక్షలు నిర్వహించగా..ఆయనకు అల్సర్ ఉన్నట్లు తేల్చారు వైద్యులు. దాంతో ఆయనకు వైద్యులు చికిత్స ప్రారంభించారు. మొదట కేసీఆర్ సతీమణి శోభ అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చాయి. కానీ తరువాత కేసీఆరే అస్వస్థతకు గురయ్యారని ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం ఆయనను ఏఐజీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. మధ్యాహ్నం లంచ్ చేసే సమయంలో కేసీఆర్ కు కడుపులో ఇబ్బందిగా అనిపించడంతోనే ఆసుపత్రికి తీసుకెళ్లార నీ అంటున్నారు. మొదట ఆయనకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించే ఆ తరువాత చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉండొచ్చునని తెలుస్తోంది. ఎండో స్కోపీ టెస్ట్ చేయగా ఆయనకు అల్సర్ ఉన్నట్లు గుర్తించారు. అయితే…కేసీఆర్ ఆరోగ్యం గురించిన వదంతులు వస్తోన్న నేపథ్యంలో గచ్చిబౌలి…

Read More

ఇటీవలి చాలా కాలంగా యువతీ, యువకులు వావి వరుసలు మరిచి లైఫ్ పార్ట్ నర్ ను ఎంచుకుంటున్నారు. వయస్సులో తమకంటే పెద్దవారిని వివాహం చేసుకుంటున్నారు. వరుసకు సోదరుడు అయ్యేవారినీ, తండ్రి అయ్యేవారినీ పెళ్లి చేసుకుంటూ ఆశ్చర్య పరుస్తున్నారు. తాజాగా ఓ యువతీ తన తండ్రిని వివాహం చేసుకొని వార్తల్లో నిలిచింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అమెరికాలోని లాస్ వెగాస్ లో నివసించే క్రిస్టీ అనే యువతి తనకు తండ్రి వరుసయ్యే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అతనితో శారీరక సంబంధం పెట్టుకోవడంతో ఇద్దరి పిల్లలకు కూడా జన్మనిచ్చింది. అనంతరం ఈ జంట పెళ్లి చేసుకుంది. అయితే…క్రిస్టీ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు. ఆమె తల్లి మాజీ భర్త. అంటే క్రిస్టీ సవతి తండ్రి. అతను ఆమె తల్లితో విడిపోగానే క్రిస్టీ అతనితో ప్రేమలో పడింది. అనంతరం రిలేషన్ షిప్ లో పెట్టుకొని భార్యా భర్తలుగా మారారు. అయితే…తండ్రినే వివాహం…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత విచారణ ముగిసింది. మొత్తం 9గంటల పాటు కవితను విచారించారు ఈడీ అధికారులు.అయితే… ఈ నెల 16 న మరోసారి విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. శనివారం కవితని ఈడీ ఏయే అంశాలపై విచారించిందో చూద్దాం… * ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన చేసింది మీరేనా..? *మద్యం పాలసీ మార్పు వెనక ఎవరెవరి హస్తముంది..? మీకు మనీష్ సిసోడియాతో పరిచయం ఎలా ఏర్పడింది..? * ఢిల్లీ సర్కార్ కు సౌత్ గ్రూప్ కు మధ్యవర్తి మీరేనా..? * లిక్కర్ స్కామ్ లో మీ పాత్ర ఏమిటి..? మీరేమంటారు..? * అరుణ్ రామచంద్ర పిళ్ళై మీకు బినామీనా..? *మీ బినామీ అని పిళ్ళై అంటున్నారు..ఇందులో నిజమెంత..? * పిళ్ళై కు , మీకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయా..? * పిళ్ళై తో బిజినెస్ చేస్తే నాతో చేసినట్లే అని మీరు…

Read More

లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఖాయమని ఢిల్లీ నుంచి విశ్వసనీయ వర్గాల ద్వారా పక్కా ప్రగతి భవన్ కు సమాచారం అందింది. శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం కవిత అరెస్ట్ ఖాయమని… మరికొంతమంది పార్టీ నేతలపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా ఉందని స్వయంగా కేసీఆరే స్పష్టం చేయడంతో… ఈవాళ కవిత అరెస్ట్ ఖాయమని అంత భావించారు. కానీ అందరూ అనుకున్నట్లుగా కవితను ఈడీ అరెస్ట్ చేయలేదు. కేసీఆరే అంత నిక్కచ్చిగా కవితను అరెస్ట్ జరుగుతుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పినా… ఆమె అరెస్ట్ జరగలేదంటే శుక్రవారం రాత్రంతా ఏం జరిగి ఉంటుందనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. కవితకు బీజేపీ నుంచి ఆఫర్ ఉంది. ఈ విషయాన్ని స్వయంగా కవితతోపాటు కేసీఆర్ కూడా బయటపెట్టారు. పార్టీలో చేరేందుకు నిరాకరించడంతోనే కవితను ఢిల్లీ…

Read More

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లు ఏదైనా రాష్ట్రంపై టార్గెట్ చేశారంటే ఆ రాష్ట్రాన్ని వశపరుచుకునే వరకు అస్సలు వెనక్కి తగ్గరు. అధికారం కోసం ఏమేం చేయాలనే విషయాలపై రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటారు. అధికారం కోసం మొదట కీలక నేతలతో సంప్రదింపులు జరిపుతారు. విన్నారా…?సరేసరి. లేదంటే చిన్న లూప్ హోల్స్ దొరికినా అస్సలు వదలరు. అస్సాం కాంగ్రెస్ కు గతంలో నాయకత్వం వహించిన హిమంత బిశ్వ శర్మ లూప్ హోల్స్ పట్టుకొని రాజకీయంగా బెదిరించారు. ఈడీ, సీబీఐ కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసి వేధించారు. ఆ తరువాత సీఎం సీట్ ఆఫర్ చేసి బీజేపీలో చేర్చుకున్నారు. తీరా బీజేపీలో చేరాక ఆయనపై ఉన్న కేసులు ఏమయ్యాయో బీజేపీ నేతలకు కూడా తెలియదు. నాడు టీడీపీ రాజ్యసభ సభ్యుల విషయంలోనూ ఇదే జరిగింది. కేసుల భయంతో వారు బీజేపీలో చేరగానే ఆ కేసుల జాడ లేకుండా పోయింది. అంటే..…

Read More

-పంజా విసురుతోన్న హెచ్3 ఎన్ 2 వైరస్  -మళ్ళీ కరోనా తరహ ఆంక్షలు దేశంలో కొత్త రకమైన వైరస్ పంజా విసురుతోంది. ఈ కేసుల సంఖ్య జనాలను ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్ పీడ విరగడ అయిందని సంబుర పడుతున్న నేపథ్యంలో కొత్తగా వెలుగుచూసిన హెచ్3 ఎన్ 2 ఇన్ ఫ్లూయంజా వైరస్ మరింత భయపెట్టిస్తోంది. జలుబు, జ్వరం, తీవ్రమైన దగ్గు, ఒళ్ళు నొప్పులు ఈ వైరస్ లక్షణాలుగా వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ బారిన పడిన బాధితులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బాధితులు యాంటిబయోటిక్స్ తీసుకోవద్దని చెబుతున్నారు. వైరస్ సోకిన వారు డబ్ల్యూహెచ్వో రెఫర్ చేసిన “ఒసెల్టామివిర్” డ్రగ్ వాడాలని వివరిస్తున్నారు. ఈ ఫ్లూ వైరస్ వలన దేశంలో ఇప్పటివరకు ఇద్దరు కన్నుమూశారు. అదే సమయంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో రాష్ట్రాల్లో ఈ ఫ్లూ వైరస్ పరిస్థితిపై నీతి అయోగ్ ఆరా తీస్తోంది. యాంటిబయోటిక్స్ వాడకూడదని తెలిపింది. ఈ…

Read More

ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ వర్గాలే లీక్ చేశాయి. పార్టీ మారుతున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగని జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారాన్ని ఆయన ఖండించలేదు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సాంకేతికంగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. కానీ పార్టీ నిర్వహిస్తోన్న ఏ కార్యక్రమంలోనూ ఆయన కనిపించడం లేదు. దీంతో పార్టీ కూడా ఆయన్ను లైట్ తీసుకుంది. రాష్ట్ర స్థాయి లేదా జాతీయ స్థాయిలో ఎక్కడ ఆయనకు పదవులు కట్టబెట్టలేదు. ఇక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయాల్లో యాక్టివ్ కావాలనుకుంటున్న కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీలో ప్రాధాన్యత దక్కుతుంది. ఎలాగూ…

Read More

క్యాస్టింగ్ కౌచ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉంది. కాకపోతే టాలీవుడ్ లోనే ఎక్కువగా ఇందుకు సంబంధించిన విషయాలు బయటకొచ్చాయి కానీ, బాలీవుడ్ లో చాలా దారుణంగా ఉంటుంది. బయటకు చెప్పుకోవడానికి వీలు లేకుండా హీరోయిన్స్ ను లైంగికంగా వేధించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కమిట్మెంట్ ఇచ్చేందుకు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్స్ ఇష్టముంటే ఓకే చెప్పేస్తారు. ఇష్టం లేకపోతే ఇండస్ట్రీ నుంచే తప్పుకుంటారు. కానీ స్టార్ హీరోయిన్స్ కు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురయ్యాయంటే నమ్ముతారా..?కానీ ఇది నిజం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ కు కూడా ఈ లైంగిక వేధింపులు తప్పలేదు. విద్యా బాలన్ స్టార్ హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే. దక్షిణాదిన ఎలాంటి సినిమాలు చేయకపోయినా ‘ డర్టీ పిక్చర్ ‘ సినిమా ఇక్కడ డబ్ అయి సంచనలనం సృష్టించింది. అప్పట్లో ఈ సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ఈ…

Read More

ఆయనో ఎమ్మెల్యే. వయస్సు 60వరకు ఉంటుంది. వృద్దాప్యంలోకి వచ్చినా ఆయనకు మహిళలంటే పిచ్చి. నచ్చిన మహిళా కనిపిస్తే ఆమెను లైంగికంగా వేధించి వశపరుచుకోవడం ఈ ఎమ్మెల్యే ప్రత్యేకత. ఈయన గారి రాసలీలలు చాలానే బయటపడినా తాజాగా మరో ఉదంతం బయటకొచ్చింది. తన నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం జానకిపురం మహిళా సర్పంచ్ పై మనస్సు పారేసుకున్నాడు. ఆమెను లోబరుచుకునేందుకు అనేక ఆఫర్లు విసిరారు. కానీ ఆ ఆ మహిళా సర్పంచ్ ఎమ్మెల్యేకు లొంగలేదు. దీంతో ఓ మహిళా ప్రజాప్రతినిధిని మధ్యవర్తిగా రంగంలోకి దించాడు. అయినా కూడా ఆ మహిళా ప్రజా ప్రతినిధి తాను డబ్బులకు, బంగారానికి లొంగిపోయే ఆడదాని కాదని చెంపచెల్లుమనే రేంజ్ లో సమాధానం ఇచ్చింది. అంతేకాదు..మీడియా సమావేశం ఏర్పాటు చేసి విషయం చెప్పి బీఆర్ఎస్ నేతల రాసలీలలను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రాంతం ఏదైనా కాని..కనిపించిన మహిళా నచ్చితే అస్సలు ఆగరు. తన…

Read More

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటిసులు జారీ చేయడంతో తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడు లేని విధంగా హాట్, హాట్ గా మారాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గురువారం క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. శుక్రవారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగుతోంది. ఈ సమావేశంలో కవితకు ఈడీ నోటిసులు… అరెస్ట్ చేస్తే ఏం చేయాలనే విషయాలపై  చర్చించనున్నట్లు సమాచారం. కవితకు ఈడీ నోటిసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ  సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు అవుతున్నారు.  తాజాగా జరగనున్న సమావేశంలో  కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారని  కొత్త వాదన తెరపైకి వస్తోంది. లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ మొగ్గు చూపనున్నారని…ఈ విషయమై పార్టీ నేతలకు ముందస్తు సంకేతాలు ఇచ్చేందుకే ఈ సమావేశం…

Read More