Author: Prashanth Pagilla

క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఏకంగా అద్యక్షుడి తీరునే తప్పుబడుతున్నారు. కవితనుద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. బండి సంజయ్ నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతారా..? సామెత అయితే ఆ వాక్యాన్ని ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలుకుతున్నారు. వెంటనే బండి సంజయ్ అనుకూలురు కూడా రంగంలోకి దిగడంతో పార్టీలోనున్న లుకలుకలను బయటపెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకుండా…ఈడీ అధికారులు ముద్దు పెట్టుకుంటారా..?అని కవిత ఈడీ విచారణకు మునుపే బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ఇదేమంత పెద్ద బూతు కాదు. కానీ కవిత ఈడీ విచారణకు వెళ్ళిన రోజున ఈ వీడియోను బయట తీసుకొచ్చి బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేశారు. మహిళలంటే బండి సంజయ్ కు ఇసుమంత గౌరవం లేదని దిష్టిబొమ్మలను దహనం చేశారు. మహిళా కమిషన్ కు…

Read More

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీ స్ వెటర్నరీ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు భావించగా… మార్చి ఐదున జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పత్రం లీక్ అయినట్లు పోలిసులు గుర్తించారు. దాంతో విచారణ చేపట్టిన పోలీసులు తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్ పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ తోపాటు పేపర్ లీకేజీ సూత్రధారి రేణుక ఆమె భర్తతోపాటు ఆమె సోదరుడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఏఈ పరీక్ష పేపర్ ను పది లక్షల చొప్పున కొనుగోలు చేసిన ముగ్గురు అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే… ఈ పరీక్ష పేపర్ ను ముగ్గురు మాత్రమే కొనుగోలు చేశారా..? మరెవరైనా కొన్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష…

Read More

వివేకా హత్యకేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని దాఖలు చేసిన అవినాష్ రెడ్డి పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అంటే తీర్పు వచ్చే వరకు అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం కుదరదన్నమాట. తుది తీర్పు ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. అప్పటివరకు మాత్రం అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం తొలగినట్లే. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుండటంతో సీబీఐ విచారణకు మినహయింపు ఇవ్వాలని హైకోర్టును అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాది కోరారు. దాంతో ఈ మినహాయింపు విషయాన్ని సీబీఐనే అడగాలని హైకోర్టు సూచించింది. ఈ కేసు విచారణలో వీడియోగ్రఫీ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ కార్యాలయం ఎదుట అవినాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలు చేయడం కూడా తప్పేనని హైకోర్టు తెలిపింది. ఈ కేసు విచారణ కోసం సీబీఐ…

Read More

ఎమ్మెల్సీ కవితనుద్దేశించి బండి సంజయ్ చేసిన ముద్దు వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే ఖండిస్తున్నారు. కవిత విషయంలో బండి సంజయ్ మాట్లాడింది ముమ్మాటికీ తప్పేనని వ్యాఖ్యానించి బండికి ఝలక్ ఇచ్చారు. ధర్మపురి అరవింద్ కూడా బండి కామెంట్స్ ను ఖండించి…ఆయన పవర్ సెంటర్ కాదని… కేవలం సమన్వయకర్త మాత్రమేనని గాలి తీసేయగా ఇప్పుడు అరవింద్ కు మరో నేత జత కలిశారు. బీజేపీ తరుఫున ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఆ పార్టీ సీనియర్ నేత పేరాల శేఖర్ రావు ఎంపీ అరవింద్ కు కోరస్ ఇచ్చారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పేరాల శేఖర్ రావు పార్టీలో చాలా సీనియర్ నేత. జాతీయ నేతలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొంతకాలంగా బండిపై పేరాల ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కవితపై బండి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియా…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కడుపుతీపి ఎలా ఉంటుందో తెలిసివచ్చింది. శనివారం కవిత ఈడీ విచారణకు వెళ్లి తిరిగి వచ్చే వరకు క్షణమొక యుగంగా గడిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేస్తారేమోనని కేసీఆర్ తోపాటు కేటీఆర్ ,హరీష్ రావులు టెన్షన్ ఫీల్ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముగియగానే హుటాహుటిన హస్తినకు వెళ్ళారు కేటీఆర్ అండ్ హరీష్ రావులు. శనివారం నాటి షెడ్యూల్ ను పూర్తిగా రద్దు చేసుకొని హస్తినలో వాలిపోయారు. ఢిల్లీలో వీరిద్దరూ కవిత ఈడీ విచారణపైనే మానిటరింగ్ చేస్తూ కూర్చున్నారు. ఎప్పటికప్పుడు కేసీఆర్ కు ఢిల్లీలోని పరిస్థితిని అప్డేట్ చేశారు. ఒకవేళ ఆమెను అరెస్ట్ చేస్తే బెయిల్ అప్లై చేసేలా సమాయత్తం అయ్యారు. కవిత కోసం అంత శ్రద్ధ ఎందుకు..? తెలంగాణలో లిక్కర్ వలన ఎంతోమంది మహిళలు వితంతువులుగా మారుతున్నారు. ఈ మద్యానికి సంబంధించిన కుంభకోణంలో అభియోగాలను ఎదుర్కొంటున్న…

Read More

‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ దక్కడంతో ఇండియన్ సినీ ఇండస్ట్రీ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది. బాలీవుడ్ ,కోలీవుడ్ , మాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇప్పటివరకు ‘ఆర్ఆర్ఆర్’ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు… మొత్తం మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.పేర్లను ప్రస్తావిస్తూ కంగ్రాట్స్ చెప్పారు. హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ పేర్లను ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు చెబుతుండగా బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ కు ఆస్కార్ అవార్డ్ దక్కడంపై బాలకృష్ణ స్పందించారు. ‘ప్రపంచం లోనే అత్యున్నత అవార్డ్స్ అయినా ఆస్కార్స్ గెలిచినందుకు గాను #RRR మూవీ టీం మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో ‘నాటు నాటు’ పాటకి అవార్డు లభించడం అనేది భారతీయ సినీ చరిత్ర లో అద్భుతమైన ఘట్టం. ఇది…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇటీవలే ఈడీ విచారణను ఎదుర్కొన్న కవిత ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరు కానున్నారు. మొన్నటి విచారణకు కవిత పెద్దగా సహకరించలేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తనకున్న సమాచారంతో చెప్పుకొచ్చారు. మొదటిసారి విచారణలోనే కవితను ఏకంగా 9గంటలపాటు విచారించినా మరోసారి విచారణకు హాజరు కావాలన్నారంటే మొదటి విచారణకు ఆమె సహకరించకపోవడమేననే అనుమానాలు తాజాగా బలపడుతున్నాయి. రెండో విచారణలో ఈడీ ప్రధానంగా కవిత ఆర్ధికమూలాలపైనే దృష్టిపెట్టిందని సమాచారం. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ తరుఫున కవితే కీలకంగా వ్యవహరించారని ఈడీ బలంగా నమ్ముతోంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించింది. వీటిపై మొదటి విచారణలో కవితను ప్రశ్నించగా ఆమె పెద్దగా నోరు విప్పలేదని అంటున్నారు. పక్కాగా సాక్ష్యాలను ముందుంచి ఈడీ ప్రశ్నించడంతో విచారణకు కవిత సహకరించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్కామ్ లో భాగంగానే కవిత వంద కోట్లను సమకూర్చిందనే ఆరోపణలు అందరికీ…

Read More

చాలాకాలంగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ,సీనియర్ నటి పవిత్ర లోకేష్ లు సహజీవనం చేసి ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నరేష్ కు ఇది నాలుగో పెళ్లి కాగా… పవిత్ర లోకేష్ కు అఫీషియల్ గా రెండో పెళ్లి. అనేక వివాదాల నడుమ పవిత్ర , నరేష్ ల వివాహం జరిగింది. అయితే…పవిత్ర లోకేష్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు గూగుల్ లో చాలామంది సెర్చ్ చేస్తున్నారు. పవిత్ర మైసూర్ లో జన్మించింది. ఆమె తండ్రి లోకేశ్ ఒక నటుడు, ఆమె తల్లి ఒక టీచరు. పవిత్ర పదవ తరగతిలో ఉన్నప్పుడు లోకేశ్ చనిపోయాడు. పవిత్ర మొదట సినిమాలోకి రావాలని అసలే అనుకోలేదు. ప్రభుత్వఉద్యోగి కావాలని కళలు కన్నది. కానీ తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలో పాలుపంచుకునేందుకు ఆమె సినీ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. దక్షిణాది సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. ఆ తరువాత…

Read More

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోన్న చైనాను మరో వైరస్ మరింత భయపెట్టేస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతోన్న నేపథ్యంలో కొత్త వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో చైనా సర్కార్ లాక్ డౌన్ పై సమాలోచనలు చేస్తోంది. ఫ్లూ వైరస్ కట్టడిలో భాగంగా చైనాలోని పలు నగరాల్లో లాక్ డౌన్ విధించాలని జిన్ పింగ్ ప్రభుత్వం ఉన్నతాదికారులతో చర్చిస్తోంది. ఫ్లూ కేసుల కట్టడికి లాక్ డౌన్ విధించడం మాత్రమే మార్గమని… లేదంటే కరోనా తరహలో జనాలు మహమ్మారి ధాటికి విలవిల్లాడటం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులు కరోనా రోగులతో, ఈ ఫ్లూ వైరస్ బాధితులతో నిండిఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త వైరస్ కారణంగా కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రులకు బాధితులు క్యూ కట్టే అవకాశం ఉంది. దాంతో ఆసుపత్రులు మరింత కిక్కిరిసిపోతాయని భావిస్తోన్న ప్రభుత్వం లాక్ డౌన్ విధించాలని భావిస్తోంది. ఫ్లూ వైరస్ కట్టడికి చైనా ప్రభుత్వం లాక్ డౌన్…

Read More

తెలంగాణలో ఎంసెట్ పేపర్ లీకేజ్ వ్యవహారం ఇంకా ఎవరూ మార్చిపోనేలేదు. అప్పుడే మరో పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. దీంతో ఈ పరీక్షను అధికారులు వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఆదివారం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఒవర్సీర్ పరీక్ష, మార్చి 15,16న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది.కానీ ఇందుకు సంబంధించిన పరీక్షా పేపర్ లు లీక్ అయినట్లు గుర్తించడంతో ఈ పరీక్షలను వాయిదా వేశారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు అసలు విషయం వెల్లడించారు. మొదట కంప్యూటర్ హ్యాక్ అయిందని ప్రచారం చేశారు కానీ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ పేపర్ లీక్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హనీ ట్రాప్ తో ఇది జరిగినట్లు స్పష్టం చేశారు. కంప్యూటర్ హ్యాక్ కావడంతో పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పడంతో మొదట ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు ఆతరువాత ఒక్క కంప్యూటర్ హ్యాక్ కాలేదని…

Read More