Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
దేశంలో హెచ్3ఎన్2 వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇన్ఫ్లూయెంజా ఏ రకం వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు బయటపడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం చిన్నారులు, వృద్దులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారిపై అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులపై ఈ ప్రభావం ఉంటుందన్న నిపుణుల హెచ్చరికలతో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పది రోజులపాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. హెచ్3ఎన్2 వైరస్ కేసులు దేశంలో పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరోసారి కరోనా తరహ పరిస్థితులు దేశంలో తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ముందస్తు చర్యలో భాగంగా పుదుచ్చేరి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పదిరోజులపాటు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు అనౌన్స్…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదృశ్యం కావడం ఏంటి..? అని అనుకుంటున్నారా..? నిజమే గత మూడు రోజులుగా ఆయన ఎవరికీ కనిపించడం లేదు. పార్టీ నేతలకూ కూడా అందుబాటులో లేరు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలుద్దామన్న నేతలకు కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానం లభించలేదు. దీంతో కేసీఆర్ మిస్సింగ్ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రమంతా టీఎస్ పీస్సీ లీకేజీ వ్యవహారంపై అట్టుడుకుతుంటే…కేసీఆర్ ఈ విషయమై స్పందిస్తారని అంత అనుకున్నారు. అజ్ఞాతం వీడుతారని అనుకున్నారు. కానీ ఆయన ఎక్కడ కనిపించలేదు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న వ్యక్తులు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చేయాలి. పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని… దీని వెనక ఎంతటి వారున్నా ఉపేక్షించబోమని చెప్పాలి. కానీ కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు. కనీసం ఓ పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ మిస్ అయ్యాడంటూ తెలంగాణ…
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇందులో కవిత ప్రమేయంపై ఈడీ , సీబీఐలు ప్రాథమికంగా కొన్ని ఆధారాలను సేకరించాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పన్నెండు మందిని అరెస్ట్ కూడా చేశారు. ఇటీవల ఢిల్లీ తాజా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో నెక్స్ట్ అరెస్ట్ కవితదేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈడీ విచారణకు రావాలని కవితకు నోటిసులు ఇవ్వగానే.. ధైర్యంగా విచారణను ఎదుర్కొంటా..పూర్తిగా విచారణకు సహకరిస్తా..తెలంగాణ ఆడబిడ్డలు ఇలాంటి వాటికీ అసలే బెదరరు. ఈ ప్రాంత ఆడబిడ్డల కళ్ళలో నీళ్ళు రావు.. నిప్పులు వస్తాయంటూ సినిమా డైలాగ్ లు కొట్టింది. మొదటి విచారణలో ఈడీ ప్రశ్నలకు కంగారు పడిన కవిత.. రెండో విచారణ సందర్భంగా తనను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నట్లుంది. అందుకే ఈ కేసు విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈనెల 11న ఢిల్లీలోని…
వైఎస్ వివేకా దారుణ హత్యకు గురై నేటికి నాలుగేళ్ళు. వివేకా చనిపోయినప్పుడు గుండెపోటని ప్రచారం చేసినప్పటికీ… ఈ విషయమై తమకు అనుమానాలు ఉన్నాయని సీబీఐ విచారణ జరపాలని నాడు ప్రతిపక్ష నేతగా జగన్ డిమాండ్ చేశారు. చిన్నాన్న వివేకా మరణం బాధాకరమని జగన్ , అవినాష్ రెడ్డిలు కన్నీరు కూడా పెట్టుకున్నారు. టీడీపీ నేతలపై ఈ హత్యనేరాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకున్నారు. కట్ చేస్తే ఎన్నికల్లో గెలిచాక సీబీఐ విచారణ వద్దని జగన్ వాదించారు. సిట్ విచారణ చేస్తుందని అన్నారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరిగేలా న్యాయస్థానాల్లో వివేకా కూతురు పోరాడారు. ఇకపోతే.. వివేకా నాలుగో వర్ధంతి సందర్భంగా అబ్బాయిలెవరూ నివాళులు ఆర్పించలేదు. ఆయన హత్యకు గురైన రోజున వెక్కి ,వెక్కి ఏడ్చిన అబ్బాయిలు వివేకా వర్ధంతి రోజున మాత్రం నివాళి ఆర్పించి ఆయనను స్మరించుకునేందుకు ఆసక్తి చూపలేదు. అటు జగన్ కాని, ఇటు అవినాష్…
బీజేపీలో నెలకొన్న వర్గ విబేధాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని మంత్రి కేటీఆర్ భావిస్తున్నారా..? బండి సంజయ్ వర్గీయులంతా ధర్మపురి అరవింద్ ను కార్నర్ చేస్తుండటంతో ” ధర్మపురి అరవింద్ ” అనే సీక్రెట్ ఆపరేషన్ ను బీఆర్ఎస్ స్టార్ చేసిందా..? ఇందుకోసం వ్యాపార సంబంధాల ద్వారా అరవింద్ తో టచ్ లోకి వెళ్లాలని కేటీఆర్ అనుకుంటున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ లో చేరికలపై కేటీఆర్ దృష్టి సారించారు. రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదుగుతున్న బీజేపీని చావు దెబ్బ కొట్టాలని కేటీఆర్ ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పలువురు బీజేపీ నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకొని కమలం క్యాంప్ కు షాక్ ఇచ్చారు. ఈ మధ్యే బీజేపీకి సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ ఇస్తామని కేసీఆర్ , కేటీఆర్ లు ప్రకటించారు. ఇప్పుడు అందుకు సరైన సమయం…
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ లో పేపర్ లీకేజీ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని సర్కార్ ఆందోళన చెందుతుందా..? ఈ కేసులో అసలు వాస్తవాలు మరుగున పరిచేందుకు పోలిసులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారా..? ఈ సీరియస్ అంశంపైన సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షపాత విచారణకు ఆదేశించాల్సిన సర్కార్, రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నలో కొనసాగే సిట్ ను ఏర్పాటు చేయడం కుట్రలో భాగమేనా..? నిందితుడి ప్రవీణ్ ను బూచిగా చూపి ఉద్యోగ నియామకాల ప్రక్రియను మరింత ఆలస్యం చేయాలని సర్కార్ కుట్రలు చేస్తోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. టీఎస్ పీఎస్సీ పరీక్షల పేపర్ లీకేజ్ వ్యవహారంలో దర్యాప్తు చేస్తోన్న పోలీసుల వైఖరిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి విద్యార్ధి, నిరుద్యోగ సంఘాలు. మొదట టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన పరీక్ష పేపర్ లీక్ అయిందని ప్రకటించారు. ఆ తరువాత టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ కాలేదు.. కేవలం అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష పేపర్…
టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ వివాదం. గతంలో ఇంటర్మీడియట్ కార్యదర్శిగా పని చేసినప్పుడు …ప్రశ్నాపత్రాల మూల్యాంకనాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఆ ఏజెన్సీ నిర్లక్ష్యంతో ప్రతిభ కల్గిన విద్యార్థులు పరీక్షలు ఫెయిల్ కావడంతో తెలంగాణ వ్యాప్తంగా 27మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి అసమర్ధ అధికారి చేతిలోనే Tspsc చైర్మన్ బాధ్యతలు పెట్టి… టీఎస్ పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజ్ కు కారణమైంది. 2019లో ఇంటర్ మీడియట్ బోర్డు సెక్రటరీగా జనార్ధన్ రెడ్డి పని చేశారు. ఆ సమయంలో ఇంటర్ పరీక్షల మూల్యాంకనాన్ని గ్లోబరీనాకు అప్పగించారు. అసలు అనుభవం లేని గ్లోబరీనా అనే ప్రైవేట్ ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించారు. ఏజెన్సీ నిర్లక్ష్యంతో టాలెంటెడ్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. నాడు మంత్రి కేటీఆర్ ఒత్తిడి మేరకే గ్లోబరీనా ఏజెన్సీకి ఇంటర్ మూల్యాంకనం బాధ్యతను అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సంస్థ నిర్లక్ష్యానికి అమాయక విద్యార్థులు 27మంది విద్యార్థులు బలి…
టాలీవుడ్ లో అలనాటి స్టార్ హీరోలందరి సరసన నటించిన మీనాకు ప్రేమ కథ ఉందట. ఆమె ఓ హీరోను ప్రేమించిందని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కానీ అప్పటికే అతనికి పెళ్లి అయిందని తెలుసుకొని చాలా రోజులు బాధపడినట్లు చెప్పింది మీనా. అతనంటే చెప్పలేనంత ఇష్టమని.. పెళ్ళంటూ చేసుకుంటే అతని పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిందట. కానీ అసలు విషయం తెలిసి మనసుకు సర్దిచెప్పుకొని ఆ బాధ నుంచి బయట పడినట్లు చెప్పింది మీనా. బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా ఇరవైకి పైగా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నవయుగం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనా… చిరంజీవి , వెంకటేష్ , నాగార్జున , బాలకృష్ణ, రజినీకాంత్ , కమల్ హసన్ వంటి స్టార్ హీరోల సినిమాలో కథానాయికగా నటించింది. రెండు దశాబ్దాలపాటు స్టార్ హీరోయిన్…
ఒక్క నిముషం ఆలశ్యం పేరుతో మూడువందల అరవై రోజులు చదివిన చదువును మసి చేస్తారా? మూసీ మురుగు కాలవ పక్కన, నాలుగు చినిగిన గోనెపట్టాల కింద, ఎండకు ఎండి వానకు తడిసిన బాల్యం నుండి, దొర ఇస్తానన్న రెండు పడక గదుల గురించి కలలు కంటూ, ఆముదపు దీపం కింద చదివి పొద్దున్నే ముక్కుల్లోంచి నల్లని మసి కడిగి ఎక్కడో గొట్టాం గాడి కాలీజీలోలో పరీక్ష సెంటర్ పడితే… తిన్నబువ్వ కడుపులో కలదిరిగి మెలిదిరిగి, మూడు బస్సులు మారి సెంటర్ దగ్గరకు వస్తే ఈ మధ్యలో శిదిలమై చిద్రమైన పసి కాయాలు యెన్నో. ఒక్క నిముషం పేరుతో నా నెత్తిన నిప్పులు పోస్తిరి కదరా దొంగ నా కొడకుల్లారా. అరె సాలె… ఇచ్చిన హామీ దశాబ్దాలుగా తీర్చని నాయకులున్న చోట, సమయానికి బస్సు , రైలు నడవని చోట, సమయానికి నల్లా వదలని చోట, పదింటికి ఆఫీసు అయితే పన్నెండు గంటలకు…
సమంత, నాగ చైతన్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ లో క్రేజీ కపుల్ గా ఈ జంట పేరు సంపాదించుకుంది. కానీ పెళ్ళైనా నాలుగేళ్ళకే తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేశారు. వీరు విడిపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో ఏమో కాని చైతూ, సామ్ అభిమానులు మాత్రం ఏడ్చేశారు. మీరు విడిపోవద్దు.. కలిసి ఉండండి అంటూ సోషల్ మీడియాలో వీరి పేర్లకు ట్యాగ్ చేసి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. 2021 అక్టోబర్ 2వ తేదీన తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు చైతన్య, సమంత. విడాకులు తీసుకొని ఏడాదిన్నర అవుతోంది కానీ ఇప్పటికీ ఈ జంట విడిపోవడానికి కారణం ఏంటో ఎవరికీ తెలియదు. సమంతే మొదట విడాకులు కోరిందని కొందరు… చైతూనే సమంత బిహేవియర్ నచ్చక విడాకులు కోరాడని మరికొందరు. ఇలా ఎవరికీ తోచినట్లు వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. విడాకులకు కారణం ఏంటో ఇంతవరకు చైతూ చెప్పలేదు. సమంత…