Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరింత ఇరకాటంలో పడిపోయారు. మున్ముందు జరగబోయే పరిణామాలను అంచనా వేయకుండానే ఈడీ విచారణకు డుమ్మా కొట్టేసి కవిత వ్యూహాత్మక తప్పిదం చేశారు. ఈడీ విచారణ కోసమే ఢిల్లీ వెళ్తున్నట్లు కవిత ప్రకటించారు. కానీ గురువారం నాటి విచారణకు చివరి క్షణంలో హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. విచారణకు హాజరయితే అరెస్ట్ చేస్తారని భయపడ్డారో ఇతరత్రా కారణాల తెలియదు కానీ ఈడీ విచారణకు హాజరు కాకుండా కవిత హైదరాబాద్ వచ్చేశారు. ఆమెకు మద్దతుగా ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్ , హరీష్ రావులు కూడా హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. నేటి విచారణకు డుమ్మా కొట్టి మరో విధంగా కూడా కవితను అరెస్ట్ చేసేందుకు ఈడీకి మరో మార్గంలో కూడా అవకాశం కల్పించారు. నేటి విచారణకు కవిత డుమ్మా కొట్టడంతో ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటిసులు జారీ చేసింది. వాస్తవానికి…
టీఎస్ పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ కేసు ప్రధాన నిందితుడు ప్రవీణ్ అసలు రంగు బయటపడుతోంది. అతని మొబైల్ ను పరిశీలించిన పోలీసులు..యువతులతో ప్రవీణ్ సన్నిహితంగా మాట్లాడిన వీడియోలు, నగ్నచిత్రాలను గుర్తించారు. మొత్తం 48మంది యువతులతో అతనికి సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో ఈ పేపర్ లీక్ వ్యవహారంలో వీళ్ళకు కూడా ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. వీళ్ళంతా ఎవరు..? ప్రవీణ్ తో ఎలా కాంటాక్ట్ అయ్యారు..? వీళ్ళంతా టీఎస్ పీస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారేనా..? తనతో శారీరకంగా కలిస్తే పేపర్ లీక్ చేస్తానని ప్రవీణ్ ఆఫర్ ఇచ్చి వారితో సన్నిహిత సంబంధం ఏమైనా పెట్టుకున్నాడా..? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ప్రవీణ్ తో సన్నిహితంగా మెదిలిన యువతుల వివరాలను సేకరించి వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే విచారణలో ప్రవీణ్ పెద్దగా నోరు…
బీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ కూడా నిర్లక్ష్యం వహించిందని వెల్లడించారు. బుధవారం ఢిల్లీలోని లే మెరిడియన్ హోటల్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కవిత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఆది నుంచి అన్యాయమే జరుగుతుందని… మహిళలకు అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ ఏమి తక్కువ తినలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు కవిత. బీఆర్ఎస్ కూడా మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించనందువల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తాను పోరాటం చేస్తున్నట్లు తెలిపారు కవిత. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. కవిత ఉద్దేశ్యపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ మొదటి దఫా పాలనలో మహిళలకు మంత్రివర్గంలో కేసీఆర్ అవకాశమే కల్పించలేదు. ఇది బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలకు కారణమైంది.…
ఎవరూ కావాలని వ్యభిచార రొంపిలో చేరరు. ఏదో సమస్య వలన దాని నుంచి బయటపడేందుకు ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. కాల్ బాయ్స్ , వేశ్యలను ఒక్కసారి కలిసి మాట్లాడితే… జీవితంలో ఎదురైనా సంక్షోభ కాలం నుంచి బయటపడేందుకు దీనిని ఉపాధిగా మార్చుకున్నామని ఎక్కువగా చెప్తుంటారు. ఏం చేయాలో తెలియక భవిష్యత్ వెతుకులాటలో ఈ వృత్తి ఉపాధిగా మారిందని చెప్పడం చూస్తుంటాం. ఒక్కొక్కరిది ఒక్కో వేదన. ఎవరిని కదిలించిన మొండిగా దూకే కన్నీళ్ళే సమాధానం చెబుతాయి. ఈ క్రమంలోనే ఓ యువకుడు తాను కాల్ బాయ్ గా మారడానికి గల కారణాలను ఓ పత్రికకు వివరించాడు. అదేంటో చూద్దాం. జీవితం నిండా చీకటి పేరుకుపోయింది. అంత శూన్యం. ఉపాధికి ఎలాంటి మార్గాలు లేవు. భవిష్యత్ కోసం ఎన్నో కళలు కన్నాను. కానీ కుటుంబ సమస్యలు నన్ను తీవ్ర అగాధంలోకి నేట్టేశాయి. ఈ క్రమంలోనే ఓ చోట నిలబడ్డాను. అప్పుడే ఓ ట్రాన్స్ జెండర్…
పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి అడ్డా. వైఎస్సార్ అక్కడి నుంచి అప్రతిహతంగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. వైఎస్ మరణం తరువాత పులివెందులలో ఆయన కుమారుడు జగన్ గెలుస్తూ వస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డితోపాటు జగన్ ఫోటోలతో పులివెందుల పట్టణమంతా ఫ్లెక్సీలతో నిండిపోయేది. కాంగ్రెస్ తో విబేధించి వైసీపీని జగన్ ఏర్పాటు చేశాక జగన్ ఫ్లెక్సీలు తరుచుగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు జగన్ ఫోటో లేకుండానే ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కానీ అందులో ఎక్కడ జగన్ ఫోటో కనిపించలేదు. జగన్ ఫోటో లేకపోవడంపై పులివెందుల ఇదే అంశంపై చర్చించుకుటుంది. అసలు జగన్ లేని వైఎస్ కుటుంబ సభ్యుల ఫ్లెక్సీని పులివెందులలో ఏర్పాటు చేస్తారని కలలో కూడా ఊహించలేదని చర్చించుకోవడం కనిపించింది. వైఎస్ వివేకా ఘటన తరువాత కొన్నాళ్ళు జగన్ , అవినాష్ రెడ్డిలు వివేకా విగ్రహాలకు దండలు వేశారు. జయంతి, వర్ధంతులు నిర్వహించారు.…
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ షాక్ ఇచ్చింది. రెండోసారి విచారణకు హాజరు కావాలని గతంలో కవితకు ఈడీ నోటిసులు ఇచ్చింది. ఈ నెల 16న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని నోటిసుల్లో పేర్కొంది. ఇందుకోసం ఆమె ఢిల్లీ కూడా వెళ్ళింది. బీఆర్ఎస్ మంత్రులు కూడా ఆమెకు మద్దతుగా హస్తినలో వాలిపోయారు. కట్ చేస్తే…విచారణకు హాజరయ్యే సమయంలో నేటి విచారణకు హాజరు కాలేనని ఈడీకి తెలిపింది కవిత. 11 గంటలకు ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉన్నా కవిత ఆమె ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో కవిత నేటి ఈడీ విచారణకు హాజరు అవుతారా..?లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నివాసంలో కేటీఆర్ , హరీష్ రావుతో కలిసి న్యాయనిపుణులతో కవిత భేటీ అయినట్లు సమాచారం. ఆ తరువాత ఈడీ కోరిన సమాచారాన్ని సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌తో పంపించారు.…
టీఎస్ పీఎస్సీ పరీక్ష లీకేజీ వ్యవహారంలో అసలు విషయాన్ని కప్పి పుచ్చేందుకు తెరవెనక ఏదో జరుగుతుందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఓ వైపు పోలిసుల ప్రకటనలు సందేహాలను రెట్టింపు చేస్తుండగా…టీఎస్ పీస్సీ చైర్మన్ చేస్తోన్న ప్రకటనలు మరింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఇంత కీలకమైన విషయంలో టీఎస్ పీస్సీ చైర్మన్ ప్రకటనలు నిరుద్యోగుల్లో లేవనెత్తుతోన్న అనుమానాలను రెట్టింపు చేసేలా ఉన్నాయి. ఏఈ పరీక్ష పేపర్ లీక్ పై టీఎస్ పీస్సీ చైర్మన్ : ఏఈ పేపర్ మాత్రమే లీకేజీపై మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి మాట్లాడారు. ఏఈ పేపర్ లీక్ పై ఎవరో వచ్చి ఉద్యమాలు చేయలేదని…తామే గుర్తించి కంప్లైంట్ చేశామని జనార్ధన్ రెడ్డి తెలిపారు. కానీ అసలు విషయం ఏంటంటే… ఈ కేసులో కీలక నిందితురాలిగానున్న రేణుకకు , పేపర్ కొనుగోలు చేసిన అభ్యర్థులతో గొడవ జరగడంతో అభ్యర్థులే ఈ పేపర్ లీక్ విషయాన్ని…
వైఎస్ వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసింది వివేకా కూతురు సునీత. కడప ఎంపీ టికెట్ కోసమే తన తండ్రిని హత్య చేశారని ఆమె ఆరోపించారు. ఇటీవల ఆమె హైకోర్టులో దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అవినాష్ రెడ్డి ద్వారానే దస్తగిరితోపాటు నిందితులకు డబ్బులు చేరాయని… వివేకా హత్యకు ముందు సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని ఆమె దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ లో పేర్కొన్నారు. వివేకా హత్యకు ఎప్పటి నుంచో ప్లాన్ చేశారని సునీత ఆరోపించారు. 2017ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారని పేర్కొన్నారు. 2019లో ఎంపీ సీట్ దక్కదనే వివేకాను పొట్టనపెట్టుకున్నారని పిటిషన్ లో ప్రస్తావించారు. వివేకాను హత్య చేసిన వారిని కాపాడుకుంటానని అవినాష్ రెడ్డి నిందితులకు ప్రామిస్ చేసినట్లు పేర్కొన్నారు. మా నాన్న చనిపోయాడని శివ ప్రసాద్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డికి సమాచారం…
హిందూ సంప్రదాయం ప్రకారం రెండు పెళ్ళిళ్ళు చెల్లవు. రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్యతో విడాకులైనా తీసుకోవాలి, లేదా మొదటి భార్య చనిపోయి అయిన ఉండాలి. కాని మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం చట్టప్రకారం శిక్ష విధిస్తారు. కానీ ఓ ఫ్యామిలీ కోర్టు మాత్రం రెండు పెళ్ళిళ్ళను అంగీకరించడమే కాకుండా అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. హరియానాకు చెందిన ఓ వ్యక్తి మల్టినేషనల్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి 2018లో గ్వాలియర్ ప్రాంతానికి చెందిన మహిళతో వివాహం అయింది. రెండేళ్లపాటు వీరి సంసారం సాఫీగానే సాగింది. కానీ లాక్ డౌన్ విధించడంతో భార్యను 2020లో పుట్టింటికి పంపించాడు. ఆ తరువాత లాక్ డౌన్ ఎత్తివేసినా భార్యను తీసుకెళ్ళకుండా హరియానా వెళ్ళాడు. ఈ క్రమంలోనే అదే కంపెనీలో పని చేస్తోన్న మరో మహిళాను రెండో వివాహం చేసుకున్నాడు. లాక్ డౌన్ ముగిసినా భర్త తనను తీసుకెళ్లకపోవడంతో మొదటి భార్యకు…
పెళ్లి చేసుకోవడానికి నేటి యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పెళ్లి అయితే కుటుంబం అనే పంజరంలో చిక్కుకొని…స్వేఛ్చను కోల్పోతామని ఆలోచిస్తోంది. అందుకే పెళ్లి అని మాట ఎత్తితే రెండు చేతులతో నమస్కరించి తమ ఎంజాయ్ ను తాము చేసుకోనివ్వండి. ఈ పెళ్లి మాట ఎత్తకండి మహాప్రభో అంటూ కుటుంబ పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నారు. బంధాలు, బందవ్యాలు తమకు ఎందుకని పాశ్చాత్య తరహలో లివింగ్ అండ్ రిలేషన్ కు యువత ఆసక్తి చూపుతోంది. పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడే బదులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీకెండ్ మ్యరెజేస్ బెస్ట్ అని చెబుతున్నారు. వీకెండ్ మ్యారేజ్ అంటే…వీరు కూడా అందరిలాగే పెళ్లి చేసుకుంటారు. కాకపోతే వారాంతంలో మాత్రమే కలుస్తారు. మిగతా రోజుల్లో ఎవరి జీవితం వారిదే. ఎవరి ఖర్చులు వారివే. కలిసి ఉన్న ఆ రెండు రోజులు మాత్రం ఎలాంటి ఖర్చులు చేసినా సగం, సగం భరిస్తారు. పిల్లలు పుడితే పిల్లల ఖర్చులు…