Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
తెలుగు రాష్ట్రాల్లో రెండు కేసులు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఏపీలో వివేకా హత్య కేసు..తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ రెండు కేసులు ఒకదానితో మరొకటి సంబంధం లేకపోయినా ఓ సారూప్యత మాత్రం ఉంది. అదేంటో ఈ కథనంలో చూద్దాం. వివేకా హత్యకేసులో తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఏపీ అధికార పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణలోని అధికార పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినాష్ రెడ్డి ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. వరుసకు తమ్ముడు అవుతాడు. కాగ, కవిత తెలంగాణ సీఎం కేసీఆర్ గారాలపట్టి. కేటీఆర్ కంటే కూడా కవితకు కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తాడని అంటుంటారు. వివేకా హత్య కేసుని తీసుకోండి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును తీసుకోండి. ఈ రెండు విషయాలు తెరమీదకు వచ్చినప్పుడు అటు అవినాష్ రెడ్డికాని ఇటు కవిత కాని ఎవరు…
పాన్ ఇండియా హీరో ప్రభాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో చికిత్స కోసం ప్రభాస్ ను విదేశాలకు తీసుకెళ్లారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నమ్మశక్యంగా అనిపించకపోయినా…కొన్ని రోజులుగా ప్రభాస్ రెగ్యులర్ గా షూటింగ్ కు కూడా అటెండ్ కాలేదని సమాచారం బయటకు రావడంతో ఈ వార్తను కొట్టిపారేయలేమని సినీ ఇండస్ట్రీకి చెందిన వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ ఆరోగ్యంపై పలు రకాల ప్రచారం జరుగుతోండటంపై ప్రభాస్ సన్నిహితులను సంప్రదించగా ఈ వార్తను ఖండించారు. ప్రభాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని… కాకపోతే ఆయన స్వల్ప అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని వెల్లడించారు. ప్రభాస్ వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. విరామం లేకుండా ఈ షూటింగ్ లో పాల్గొనడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఇక ఆదిపురుష్ టీజర్ రిలీజ్ సమయంలో ప్రభాస్ మోకాళ్లకు…
పులివెందుల వైసీపీకి కంచుకోట. అక్కడ ఆ పార్టీని ఓడించే శక్తిసామర్ధ్యాలు ఏ పార్టీకి లేవు. కాకపోతే ఇది నిన్నటి మాట. ఇప్పుడు సీన్ మారిపోయింది. పులివెందుల పట్టణంలో వైసీపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. వైసీపీకి షాక్ ఇచ్చారు పట్టభద్రులు. ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందుల గ్రాడ్యుయేట్లు టీడీపీకి మద్దతుగా నిలిచారు. పోలైన ఓట్లలో 4323ఓట్లు టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి రాగా… వైసీపీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్రారెడ్డికి 2120ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇతరులకు 123ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాలను టీడీపీ కూడా ఊహించి ఉండదు. వైసీపీ అసలే ఊహించి ఉండకపోవచ్చు. పట్టభద్రుల ఎన్నికల్లో ఏకంగా రెండు వేల మెజార్టీని టీడీపీకి పులివెందుల పట్టభద్రులు కట్టబెట్టారు. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పులివెందులకు చెందిన నేత. వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి కర్నూల్ కు చెందిన వారు. స్థానికతను పరిగణనలోకి తీసుకునే పులివెందుల ఓటర్లు టీడీపీకి ఓటేసి ఉండొచ్చునని వైసీపీ…
టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా ప్రగతి భవన్ లో సమాలోచనలు జరుపుతోంది. అందుబాటులోనున్న మంత్రులు కేటీఆర్ , హరీష్ రావుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డితోపాటు మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణిలతో కేసీఆర్ అత్యసవరంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేసీఆర్ అరా తీస్తున్నట్లు సమాచారం. గతేడాది నిర్వహించిన గ్రూప్-1పరీక్షతోపాటు ఏఈ , టౌన్ ప్లానింగ్ పరీక్ష పత్రాలు కూడా లీక్ అయ్యాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తేల్చింది. మొత్తం ఐదు పేపర్లు లీక్ అయినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. ఈ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగానున్న ప్రవీణ్ తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ లో జాయిన నాటి నుంచే…టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలను లీక్ చేసి ఉండొచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ప్రతిపక్ష, విద్యార్ధి,…
తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ టర్మ్ పూర్తయింది. ఆయనకు మరోసారి అవకాశం ఉంటుందా..? అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఎన్నికల వరకు ఆయనే కమలం సారధిగా ఉంటారని…హైకమాండ్ కూడా బండి నాయకత్వంపై భరోసా ఉంచిందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు బండి సంజయ్ సారధ్యంలో వెళ్తామని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఇటీవల ప్రకటించారు. కానీ ఢిల్లీ పెద్దలు ఎవరూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. బండి సంజయ్ పై బీజేపీ అగ్రనాయకత్వం సానుకూలంగా ఉన్నా…రాష్ట్రంలోని మెజార్టీ పార్టీ నేతలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. బండి సంజయ్ ఒంటరి పోకడలు…ఆధిపత్య రాజకీయాలు సీనియర్ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పలుమార్లు ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళినా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సీనియర్ నేతలు ఓ వర్గంగా ఏర్పడ్డారు. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ ఓ వర్గం… ఆయన వ్యతిరేకులు మరో వర్గంగా ఏర్పడ్డారు. ఇటీవల రాష్ట్ర నేతలను ఢిల్లీకి…
టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ ను బీజేపీ మరింత ఇరుకున పెడుతోంది. ఈ ప్రశ్న పత్రాల లీకేజీకి మంత్రి కేటీఆర్ బాధ్యత వహిస్తూ పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కంప్యూటర్ల నిర్వహణ బాధ్యత ఐటీ శాఖదే కాబట్టి… ఐటీ మినిస్టర్ కేటీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రం కొనుగోలులో కీలక నిందితురాలు రేణుక…బీఆర్ఎస్ సర్పంచ్ కూతురు అని బీజేపీ కౌంటర్ ఎటాక్ ప్రారంభించగా అదే స్థాయిలో బీఆర్ఎస్ సమాధానం ఇస్తోంది. టీఎస్ పీస్సీ మాజీ సభ్యుడు విఠల్ హయంలోనే ముగ్గురు నిందితులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగం పొందారని…ఈ లెక్కన టీఎస్ పీస్సీ పేపర్ లీకేజీ వెనక బీజేపీ నేతల హస్తం ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎందుకంటే..నాడు టీఎస్ పీస్సీ సభ్యుడిగానున్న విఠల్ నేడు బీజేపీలో కొనసాగుతున్నారు. బండి సంజయ్ కు ప్రధాన…
టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఏఈ , టౌన్ ప్లానింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలే కాదు. ఈ పేపర్ లీకేజీలో కీలక నిందితుడిగానున్న టీఎస్ పీస్సీ ఉద్యోగి ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమ్స్ రాశాడు. ఇందులో అతనికి 103మార్కులు రావడంతో గ్రూప్ 1 పరీక్ష పేపర్ కూడా లీక్ అయి ఉంటుందని ప్రతిపక్షాలు, విద్యార్ధి సంఘాలు ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ లీకేజీపై విచారణ చేసిన సిట్ గ్రూప్ 1కూడా పేపర్ కూడా లీక్ అయినట్లు తేల్చింది.దీంతో ఈ గ్రూప్ 1ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్ పీస్సీ ప్రకటించింది. దీంతోపాటు ఏఈఈ ,డీఏవో పరీక్షలను సైతం రద్దు చేసింది. అక్టోబర్ 16న 503పోస్టులకు గ్రూప్ 1ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. 3. 80లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 2.86లక్షల మంది ఈ పరీక్షను రాశారు. ఇందులో 1 :50నిష్పత్తిలో 25,150మంది…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్సీ కవిత అనేక మార్గాల ద్వారా ప్రయత్నిస్తోంది. న్యాయనిపుణుల సూచన మేరకు రెండోసారి విచారణ నుంచి తప్పించుకున్న కవితకు మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈ నెల 20న విచారణకు హాజరు కావాల్సిందేనని నోటిసులో పేర్కొంది. ఈ క్రమంలోనే కవిత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ విచారణను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ శుక్రవారం అత్యవసర పిటిషన్ ను కవిత దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కవిత తరుఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. విచారణకు హాజరు కావాలంటూ ఈడీ మరోసారి నోటిసులు ఇచ్చిందని.. ఈ నెల 20న విచారణకు రావాలంటూ ఆ నోటిసుల్లో పేర్కొన్నారని తెలిపారు. కవిత ఇప్పటికే ఓసారి విచారణకు హాజరయ్యారని…ఆమె అంగీకారం లేకుండానే విచారణ సందర్భంగా ఫోన్ సీజ్ చేశారని.. నిబంధనలకు విరుద్దంగా…
టీఎస్ పీస్సీ పేపర్ లీక్ కావడంతో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్ పీస్సీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలన్నీ దాదాపు లీక్ అయినట్లు అనుమానాలు వస్తుండగా ఓ కొత్త వార్త సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఏఈ ,టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రాగా… గతంలోనూ టీఎస్ పీస్సీ పేపర్ లీక్ అయినట్లు సమాచారం. అయితే ఈ పేపర్ లీక్ విషయాన్ని బయటకు రాకుండా తొక్కిపెట్టారనే వార్త ఒకటి ప్రకంపనలు రేపుతోంది. 2011లో నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయంలో విడుదల చేసిన గ్రూప్ 1పరీక్షను తెలంగాణ ఏర్పడిన తరువాత 2016లో రీ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పేపర్ కూడా లీక్ అయిందని… ఇందులో నాడు ఎంపీగానున్న ప్రస్తుత ఎమ్మెల్సీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. 23మంది నిజామాబాద్ కు చెందిన కవిత మనుషులు గ్రూప్…
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. తనను అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలంటూ ఆయన ఇటీవల దాఖలు చేసిన పిటిషన్ ను తాజాగా కొట్టివేసింది. దీంతో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలిచి ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించాల్సిందేనని అవినాష్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు సీబీఐకి లైన్ క్లియర్ అయినట్లు అయింది. మూడు రోజుల కిందట తీర్పు రిజర్ చేసిన హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. రిజర్వ్ చేసిన తీర్పును శుక్రవారం వెల్లడించింది. ఇటీవల హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉంచటంతో అవినాష్ రెడ్డికి సీబీఐ అరెస్ట్ చేస్తుందనే భయం లేకుండా పోయింది. అందుకే గురువారం విచారణకు డుమ్మా కొటారు. గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉన్నా… తాను…