Author: Prashanth Pagilla

బీఆర్ఎస్ నేతల పిల్లల కోసమే గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ అయిందా..? ఈ పేపర్ లీకేజీ వెనక మంత్రి కేటీఆర్ హస్తముందా..? అంటే అవుననే అంటున్నారు బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్. బీఆర్ఎస్ నేతల పిల్లల కోసమే గ్రూప్-1 క్వశ్చన్ పేపర్లను లీక్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఇది నమ్మడానికి కొంత కష్టంగానే ఉన్నా కొన్ని విషయాలను బయటకు తీసుకురావడంతో దీనిని కొట్టిపారేయడానికి వీలు లేకుండా పోయింది. అదేమంటే…జగిత్యాల జిల్లాలోని ఒక మండలంలోనే గ్రూప్-1 రాత పరీక్షల్లో 50 మంది క్వాలిఫై అయ్యారట. అలాగే చిన్నగ్రామంలో ఆరుమంది ఎలా క్వాలి ఫై అవుతారని బండి అనుమానం వ్యక్తంచేశారు. జగిత్యాల మండలంలోని నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో ఛైర్మన్ కొడుకుతో పాటు జడ్పీటీసీ బాడీగార్డుగా పనిచేసే వ్యక్తి కొడుకు కూడా గ్రూప్ 1 పరీక్షలో పాసైనట్లు చెప్పారు. ప్రశ్నాపత్రం లీక్ కావడంతోనే బీఆర్ఎస్ నేతల పిల్లలు గ్రూప్ 1…

Read More

-అసెంబ్లీలో రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు -టీడీపీ సభ్యులపై దాడి వైసీపీ ఎమెల్యేలు రెచ్చిపోయారు. టీడీపీ ఎమెల్యేలపై దాడికి పాల్పడ్డారు. ఇందుకోసం ఏకంగా అసెంబ్లీనే యుద్దక్షేత్రంగా మార్చుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి చూసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై గొంతు వినిపించాల్సిన అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభ్యులపై దాడికి పాల్పడి వైసీపీ ఎమ్మెల్యేలు సభ్య సమాజాన్ని నివ్వెరపరిచారు. సభకు రండి మీ అంతు చూస్తామని గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను హెచ్చరించిన వైసీపీ ఎమ్మెల్యేలు అన్నంతపని చేశారు. జీవో నెంబర్ వన్ ను రద్దు చేయాలంటూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన చేస్తుంటే వారిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. ఎవరిపై దాడి చేయాలో ముందే ఫిక్స్ చేసుకున్నట్లుగా టార్గెటెడ్ గా దాడికి పాల్పడినట్లు విజువల్స్ చూస్తె అర్థం అవుతోంది. టీడీపీ దళిత ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దాడి చేశారు. గోరంట్ల…

Read More

తీన్మార్ మల్లన్న నిర్వహిస్తోన్న ‘క్యూ న్యూస్’ ఆఫీసుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. కర్రలతో  క్యూ న్యూస్ ఆఫీసులోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఆఫీసులోని ఉద్యోగులపై భౌతికదాడికి దిగడమే కాకుండా చంపేస్తామని బెదిరించారు. అఫిసులోని ఫర్నీచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి చేయడంతో బోడుప్పల్ పోలీసులకు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం మార్నింగ్ షో విత్ మల్లన్న ప్రసారాలు ముగిసాక 20మంది దుండగులు క్యూ న్యూస్ ఆఫీసులోకి చొరబడ్డారు. ముఖాలకు మాస్క్ లను ధరించి చేతిలోనున్న ఆయుధాలతో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. విలువైన హార్డ్ డిస్క్ లు ఎత్తుకెళ్లిపోయారు. కార్యాలయంలో ఉన్న పెన్ డ్రైవ్ లను ధ్వంసం చేశారు. బోడుప్పల్ నుంచి ఆఫీసును ఖాళీ చేయాలంటూ హెచ్చరించారు. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తే ఊరుకునేది లేదని క్యూ న్యూస్ ఉద్యోగులను…

Read More

ఆశ ఉండాలే కాని అత్యాశ ఉండకూడదని చెప్తుంటారు పెద్దలు. ఎందుకంటే ఉన్నది కాస్త ఉడుసుకుపోతుందని. అందుకే ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలని పదేపదే చెబుతుంటారు. ఈ విషయాన్ని ఏ ఒక్క దానికో పరిమితం చేసి చూడలేం. అన్నింటికీ వర్తిస్తుంది. రాజకీయ నాయకులు కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని ముందుకు సాగితే ప్రయోజనాలు ఉంటాయి. కానీ అత్యాశకు లోనైతే బొక్కబోర్లాపడతారు. నవ్విన వాళ్ళ ముందు జరిపడుతారు. ఇప్పుడు వైసీపీ రాజకీయం అట్టాగే మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151స్థానాలు దక్కడంతో వచ్చేఎన్నికల్లో 175స్థానాల్లో పాగా వేయాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకునే సమయం సమీపిస్తోందని  వెటకారంగా…వ్యంగ్యంగా వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే  ఆరునూరైన వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. ఇందులో భాగంగా కుప్పంలో వైసీపీ పాగా వేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేసిన ప్రయత్నాలు…

Read More

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఇటీవల నాగార్జున యూనివర్సిటిలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. విశ్వవిద్యాలయానికి వెళ్ళి విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పకుండా సెక్స్ గురించి లెక్చర్ ఇస్తావా అంటూ రాజకీయ నాయకులు సైతం వర్మపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కూడా వర్మ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వర్మ కామెంట్స్ ను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఇలా అసభ్యంగా మాట్లాడినా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ స్పందించకపోవడం మంచిది కాదని… వర్మను ఇలాగే వదిలేస్తే మహిళలను అవమానించడం ఆనవాయితీగా మారుతుందని తెలిపారు. వర్మ నాగార్జున యూనివర్సిటీలో కాదు దమ్ముంటే ఉస్మానియా లేదా కాకతీయ యూనివర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చెయాలని ఛాలెంజ్ చేశారు. ఏపీలో మాట్లాడినట్లు తెలంగాణలో మాట్లాడితే విద్యార్థులు తిరగబడుతారని హెచ్చరించారు. వర్మను నాగార్జున యూనివర్సిటీకి ఆహ్వానించి పెంటపెట్టిన వర్సిటీ వైస్ ఛానల్సర్ ను సస్పెండ్ చేసి…

Read More

టీడీపీ తరుఫున ఎన్నికై  వైసీపీ ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతోన్న నలుగురిపై అనర్హత వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నలుగిరికి టీడీపీ విప్ జారీ చేసింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటేయాలని మద్దాలి గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లిలకు కూడా విప్ జారీ చేశారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ ఎన్నికలు కత్తి మీది సాములా మారాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. కాదు కూడదని ఓటింగ్ కు గైర్హాజరు అయిన టీడీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తుంది. విప్ ధిక్కరణ వ్యవహారం కావడంతో స్పీకర్ కూడా ఈ విషయంలో  నాన్చడానికి వీలు లేదు. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు అటు టీడీపీకి ఒటేస్తారా..? లేక వైసీపీకి మద్దతుగా నిలిచి ఉప ఎన్నికలకు కారణం అవుతారా..? అన్నది బిగ్ డిబేట్ గా మారింది. ఏపీలో…

Read More

తారకరత్న మరణించి నెల రోజులు పూర్తి అవుతున్నా ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి ఆ విషాదం నుంచి బయటపడలేకపోతుంది. ప్రతి రోజు తారకరత్నను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. తాజాగా ఆమె మరో పోస్ట్ పెట్టారు.ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది. అలేఖ్య రెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న తారకరత్నను కుటుంబ సభ్యులు దూరం పెట్టారని కథనాలు వచ్చాయి. కుటుంబమే తారకరత్నను దూరం పెట్టడంతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అండగా నిలిచారని తారకరత్న పలు సమయాల్లో బయటపెట్టారు. గుండెపోటుతో తారకరత్న ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలోనూ బాలకృష్ణ అక్కడే ఉన్నాడు. తారకరత్నను బతికించుకునెందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. తారకరత్న మరణించిన తరువాత అలేఖ్య కుటుంబానికి తాము అండగా ఉంటామని బాలకృష్ణ హామీ ఇచ్చారు. పిల్లల చదువు బాధ్యత కూడా తాను తీసుకుంటానని చెప్పారు. అలేఖ్యరెడ్డికి నందమూరి ఫ్యామిలీ నుంచి మద్దతు వస్తున్నా ఆమె సోషల్ మీడియాలో తాజాగా చేసిన…

Read More

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫలితాలకు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులను బాధ్యులను చేస్తూ వారిపై వేటు వేయనున్నట్లు సమాచారం. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో ఈ ఫలితాలు జగన్ కు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని దాంతో ఆయన నలుగురు మంత్రులను తప్పించనున్నారనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్‌ల పదవులకు గండం పొంచి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో అన్ని స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేయగా..మూడు పట్టభద్రుల స్థానాల్లో వైసీపీ ఓటమి పాలైంది. ఇక.. తమకు తిరుగు ఉండదని భావించిన పశ్చిమ రాయలసీమలోని ఫలితాలు కూడా వైసీపీని కుంగదీస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై పోర్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ షాక్ ఇచ్చింది. ఇటీవల ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కౌంటర్ గా ఈడీ కూడా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. కవిత విషయంలో ఎలాంటి ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని కోరుతూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఈ కేసు విషయంలో ఎలాంటి తీర్పు ఇవ్వకూడదని ఈడీ కోరింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మార్చి 11న కవిత ఈడీ విచారణకు హాజరైంది. ఆమెను తొమ్మిదిగంటలపాటు విచారించారు. ఆ తరువాత మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కవితకు ఈడీ నోటిసులు పంపింది. కానీ ఆమె మాత్రం రెండోసారి విచారణకు హాజరుకాలేదు. ఈడీ తనను విచారించాలంటే ఇంటికి వచ్చి విచారణ చేసుకోవచ్చునని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ దర్యాప్తు ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే…కవిత దాఖలు చేసిన పిటిషన్ పై తక్షణ…

Read More

టీఎస్ పీస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. లీక్ అయినట్లు గుర్తించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. టీఎస్ పీస్సీ నిర్ణయంతో క్వాలిఫై అయిన అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు పరీక్షలను రద్దు చేయడంతో కష్టపడి చదివిన తమ పరిస్థితి ఏంటని క్వాలిఫ్ అయిన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. దాంతో సర్కార్ నష్టనివారణ చర్యలకు పూనుకుంది. టీఎస్ పీస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డితో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్ , హరీష్ లు పాల్గొన్నారు. ఈ భేటీలో పలు అంశాలపై కేసీఆర్ మంత్రులతో చర్చించారు. పరీక్షల రద్దుతో కొంతమంది శాంతించగా..క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. పేపర్లు లీక్ అవ్వడం వలన రద్దైన నాలుగు పరీక్షలను…

Read More