Author: Prashanth Pagilla

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా చంద్రబాబు అరెస్ట్ జరిగిందని ఆరోపించారు. సుమారు ఏడెనిమిది లక్షల కోట్ల బడ్జెట్ ను హ్యాండిల్ చేసిన చంద్రబాబు…371 కోట్ల కోసం దిగజారతాడా అంటూ ప్రశ్నించారు మోత్కుపల్లి. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నట్లు చెప్పిన మోత్కుపల్లి..ఇందులోకి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా లాకొచ్చారు. కేసీఆర్ కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించాలన్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ పై కేటీఆర్ వ్యంగ్యంగా సంతోషాన్ని వ్యక్తం చేసేలా ట్వీట్ చేశారు. బహుశ కేసీఆర్ కూడా చంద్రబాబు అరెస్ట్ పట్ల ఇదే దృక్పథంతో ఉండి ఉంటారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. తమిళనాడు నుంచి వైగో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కాని కేసీఆర్ మాత్రం ఇంకా స్పందించలేదు. బీఆర్ఎస్ లో మాధవరం కృష్ణారావు, వనమా…

Read More

ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్న వారి వయస్సు ఏమంత పెద్దది కూడా కాదు. కేవలం 20 నుంచి 40ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా గుండెపోటుతో మరణిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. ఒకప్పుడు గుండెపోటు అనేది 70ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఎక్కువగా కనిపించేది కాని, ప్రస్తుతం స్కూల్ పిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటి వరకు హాయిగా కనిపించిన వ్యక్తులు అంతలోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఓ కుర్రాడు ఓ పెళ్లి వేడుకలో సరదాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయాడు. అతను కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడు. కార్డియాక్ అరెస్ట్ కు సంబంధించి ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఆకస్మికంగా వస్తుంది. గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడే కార్డియాక్ అరెస్ట్ కు కారణం. దీని వలన గుండె కొట్టుకోవడంలో వ్యత్యాసం ఏర్పడుతుంది. తద్వారా గుండెకు రక్తాన్ని పంప్ చేసే సామర్ధ్యంపై…

Read More

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రస్తుతం సీఐడీ విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ఏసీబీ కోర్టు విధించిన డిమాండ్ ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరుఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్దమని..ఆయనపై కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్ట్ చేసినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. చంద్రబాబు తరుఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. తాము దాఖలు చేసిన పిటిషన్ పై వెంటనే విచారణ చేపట్టాలంటూ పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు తుది దశలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు రిమండ్ ను క్వాష్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును వెలువరించిన తరువాత అనేక అంశాలను…

Read More

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేయడంతో..అక్రమాస్తుల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ పరిస్థితి ఏంటన్న చర్చ ప్రారంభమైంది. తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న జగన్ పై విచారణ పూర్తిగా ఆగిపోయింది. దర్యాప్తు సంస్థలు చార్జీషీట్లను , ఆధారాలను సమర్పించింది. శిక్ష ఖరారు అవుతుందనుకున్న సమయంలో నిందితులు పక్కా ప్లాన్ తో పిటిషన్లు దాఖలు చేస్తూ హాయిగా బయట గడిపేస్తున్నారు. జగన్ సీఎం కూడా అయ్యారు. తనకు కోర్టు హాజరు అయ్యే విషయంలో మినహాయింపులు కావాలని ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ప్రజాకర్షక హామీలతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ.. ప్రజా ప్రతినిధులపైనున్న కేసుల విచారణను సంవత్సరంలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన పార్టీలోనే చాలామంది క్రిమినల్ నేరాల్లో నిందితులుగా ఉన్నారు. అందుకే కావొచ్చు.. ఆ హామీ అమలును ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జగన్ ఆ పార్టీ నాయకుడు కాకపోయినా.. బీజేపీకి కావాల్సిన నేత.…

Read More

బీఆర్ఎస్ టికెట్ దక్కని వారిని మంత్రి కేటీఆర్ పలు హామీలను ఇస్తూ సైలెంట్ చేస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా చేయండి…మీ రాజకీయ భవిష్యత్ బాధ్యత తనది అంటూ అసంతృప్తులను లైన్ లో పెడుతున్నారు. ముఖ్యంగాస్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిల అసంతృప్తి పార్టీని పలుచన చేసేలా కనిపించింది. దాదాపు సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇచ్చి తమకు మొండిచేయి చూపుతారా..? అని ఇద్దరు నిరసన కూడా తెలిపారు. దీంతో వారిని కూల్ చేసే బాధ్యతను తీసుకున్నారు కేటీఆర్. ఇందుకోసం వారిని ప్రగతి భవన్ కు పిలిపించిన కేటీఆర్.. వారిని కూర్చోబెట్టి మాట్లాడారు. కేటీఆర్ తో జరిగిన భేటీలో తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కడియం గెలుపు కోసం తాను పని చేస్తానని రాజయ్య వ్యాఖ్యానించడం గమనార్హం. మొన్నటి వరకు కడియం ఎలా గెలుస్తాడో చూస్తానని శపథం చేసిన రాజయ్య కేటీఆర్…

Read More

అధికార పార్టీలో టికెట్ లభించకపోతే రాజీనామా చేసి.. ప్రత్యామ్నాయ పార్టీలో చేరడం కామన్. కాని, టికెట్ లభించాక కూడా అధికార పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారంటే ఆ పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నట్లే. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే. మాల్కజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ప్రకటించి బిగ్ షాక్ ఇచ్చారు. తన కుమారుడికి టికెట్ నిరాకరించడంతోనే బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ లో రెండు టికెట్లు ఇస్తామని హామీ లభించడంతో మైనంపల్లి బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మైనంపల్లి చాలా బలమైన నేత. అందుకే హరీష్ రావుపైనే తీవ్ర విమర్శలు చేసినా మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు కేసీఆర్. కుమారుడికి టికెట్ ఇవ్వకపోయినా అతని రాజకీయ భవిష్యత్ కు తమది బాధ్యత అని ప్రభుత్వ పెద్దలు చెప్పినా మైనంపల్లి పట్టించుకోలేదు. బీఆర్ఎస్ లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినా ఎందుకో మైనంపల్లి హన్మంతరావుకు…

Read More

ఎస్ ఆర్ ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ ఎల్ పి సంస్థ రియల్ వ్యాపారంలో ఓ వెలుగు వెలుగుతుతోంది. ఇప్పుడు ఈ సంస్థ అధినేత పి. శ్రీనివాస రెడ్డి సినిమా రంగంలోకి అడుగుపెట్టి ‘చీటర్’ అనే కమర్షియల్ సినిమాను నిర్మించారు. ప్రేమ ముసుగులో ఎవడిని పడితే వాడిని నమ్మి, గోవా లాంటి టూర్లకు వెళ్లి తమ శీలాన్ని అర్పించి నేటితరం అమ్మయిలు ఎలా మోసపోతున్నారో ఈ సినిమాలో చక్కటి సందేశంతో నిర్మించారు. నేటి తరం అమ్మయిలు, అబ్బాయిలు తప్పక చూడదగిన సినిమా ఇది. ఆర్ట్ సినిమా లాగా కేవలం సందేశం ఇవ్వకుండా ఓ కమర్షియల్ సినిమాకు కావలసిన అన్ని హంగులు ఉన్నాయి ఇందులో. కథ నేరస్తుడిగా బతికే హీరో కేవలం డబ్బు కోసం గొప్పింటి అమ్మాయిని చీటింగ్ చేసి ప్రేమ వలలో వేసుకొని బుద్ధిమంతుడిలా నటిస్తాడు. ఆమెను పెళ్లి వరకు లాక్కొచ్చి గోవాకు తీసుకెళ్లి శీలాన్ని దోచుకుంటాడు. నేటి అమ్మయిలు…

Read More

వద్దూ.. వద్దూరో.. ఓ దొరో.. మీ పాలనొద్దురో.. ఓ దొరో అంటూ తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా గజ్జే కట్టి, పాట పాడిన ఎపూరి సోమన్న ఇప్పుడు అదే  అధికార పార్టీ(బీఆర్ఎస్ )లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ ను కలిసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరిక ఖాయంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకే సాంస్కృతిక సారధిలో ఉద్యోగాన్ని సైతం వదిలేసి..గోసి, గొంగడి వేసి కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమ గీతాలను ఆలపించిన సోమన్న… ఇప్పుడు ఆ పాలకులకు వంగి  దండాలు  పెట్టడం  ఆశ్చర్యపరుస్తోంది. మల్లన్న సాగర్ , నిరుద్యోగులు అంశం, తెలంగాణ అమరవీరులు, ప్రాజెక్టులో కమిషన్లపై ఎన్నో పాటలు రాసి పాడిన ఎపూరి సోమన్న తెలంగాణ ఏర్పాటు తరువాత తనదైన గుర్తింపు పొందారు.…

Read More

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ రెండు రోజు సమావేశమైంది. షార్ట్ లిస్టును పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీ అయింది స్క్రీనింగ్ కమిటీ. అయితే.. బీసీలకు ఈసారి ఎక్కువ సీట్లు ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పైగా.. పార్టీ కూడా బీసీలకు ఈసారి గణనీయమైన సీట్లు ఇస్తామని హామీ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు బీసీ నేతలు. మొదటి జాబితా సామజిక సమీకరణలు కలిసి వచ్చేలా అభ్యర్థుల కూర్పు రెడీ అవుతోంది. మొత్తం 60మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఫైనల్ చేస్తున్నారు. ఇందులో బీసీ నేతలే ఎక్కువ ఉండేలా జాబితాను రెడీ చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ బీసీలకు కేవలం 21స్థానాలే ఇవ్వడంతో ఆ సామజిక వర్గం ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 52శాతం ఉన్న బీసీలను తమవైపు తిప్పుకుంటే కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకేనని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసం ఈసారి ఎలాగైనా…

Read More

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. జమిలి ఎన్నికలు లేవని స్పష్టత వచ్చింది. పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే…అధికారం లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ , కాంగ్రెస్ , బీజేపీలు నువ్వా- నేనా అన్నట్లుగా ఎన్నికల సంగ్రామంలో తలపడుతుంటే టీడీపీ – జనసేనల నుంచి పెద్దగా రియాక్షన్ ఉండటం లేదు. అసలు తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా..? లేదా..? అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ పూర్తిగా ఏపీపైనే ఫోకస్ పెట్టారు. తెలంగాణ రాజకీయాలపై జనసేనాని పెద్దగా రియాక్ట్ కావడం లేదు. Also Read : బిగ్ న్యూస్ : పులివెందుల నుంచి జగన్ పై జనసేనాని పోటీ..? జనసేన పోటీపై పలు అనుమానాలు చెలరేగుతున్న వేళ..ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతోందని టాక్ నడుస్తోంది. తమకు ఎక్కడైతే బలం ఉంటుందో ఆ నియోజకవ్ర్గాల్లోనే పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా…

Read More