Author: Prashanth Pagilla

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం తేడా వస్తే ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా..? శాసన మండలిని రద్దు చేయబోతున్నారా..? అంటే జగన్ మనస్తతత్వం తెలిసిన కొంతమంది నేతలు అవుననే అంటున్నారు. గతంలో ప్రభుత్వ బిల్లులకు విలువ ఇవ్వకుండా.. పార్టీ అభిప్రాయం మేరకు మండలిలో ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారనే ఉద్దేశ్యంతో కౌన్సిల్ రద్దుకు జగన్ మొగ్గు చూపారు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. కానీ తరువాత జరిగిన పరిణామాలతో తీర్మాణాన్ని రద్దు చేస్తున్నట్లు సభలోనే ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు మండలి రద్దుపై చర్చలు జరుగుతోన్నాయి . కారణం ఎమ్మెల్యే కోటాలో జరుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలొచ్చాయి. ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీ తరుఫున గెలవడం ఖాయం. కానీ ఏడో స్థానంలో తీవ్ర ఉత్కంట నెలకొంది. టీడీపీ తమ అభ్యర్థిని బరిలో నిలిపింది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు…

Read More

నేడు ఉగాది. తెలుగు నూతన సంవత్సరంగా జరుపుకునే పండగ ఇది. ఉగాది అనగానే అందరికి గుర్తుకు వచ్చేది పచ్చడి మరియు పంచాంగం. ఈ సంవత్సరం తనకు కలిసి వస్తుందో లేదో పంచాంగం ద్వారా తెలుసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఈ పంచాగాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది పాలిట్రిక్స్. మేష రాశి : ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1 ఈ రాశి వారికి ఆదాయ, వ్యయాలు సమానంగా ఉన్నాయి. దీంతో వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఏప్రిల్ 22 నుంచి జన్మరాశిలో గురువు సంచరించడంతో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అక్టోబర్ 31 వరకు కేతువు సప్తమంలో ఉండటంతో శ్రమ ఉంటుంది. వృషభ రాశి : ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1 ఈ రాశి వారికి పెట్టుబడులు అనుకూలిస్తాయి. 75 శాతం అదృష్టం ఉండటంతో చేపట్టే…

Read More

పులివెందుల నియోజకవర్గం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ దక్కించుకోవడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఈ పట్టభద్రుల ఎన్నికలు టీడీపీలో కొత్త ఉత్సాహం నింపడంతో చంద్రబాబు ఇప్పుడు సాధారణ ఎన్నికలపై దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. అటు జనసేనతో పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీకి కూడా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీని ఓడించేందుకు ఏ అవకాశాన్ని వదలొద్దని చంద్రబాబు టార్గెట్ గా పెట్టుకున్నారు. వివేకా హత్యకేసులో న్యాయపోరాటం చేసిన ఆయన కూతురు సునీతను పులివెందుల నుంచి బరిలో నిలపాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఆ మధ్య కర్నూల్ పర్యటనలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ సునీతకు మద్దతుగా నిలవాలంటూ పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆమెతో ఓసారి హైదరాబాద్ లో భేటీ అయ్యారని కూడా ప్రచారం జరిగింది. అయితే.. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి వైపు జగన్…

Read More

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రత్యేక హోదా నినాదం కూడా ఓ కారణం. అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అవుతున్నా ఇంతవరకు ప్రత్యేక హోదా సాధించలేదు. ఇప్పుడు ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రజల్లోకి వెళ్తే స్పెషల్ స్టేటస్ ఏమైందని నిలదీస్తారు. సామాన్య ప్రజలకంటే ఎదో ఒకటి చెప్పి మేనేజ్ చేయగలరు. కానీ విద్యావంతులు నిలదీస్తే ఏం సమాధానం చెబుతారు.? పరువు పోతుంది. ఇది వైసీపీ ఎంపీల ఆందోళన. అందుకే వైసీపీ ఎంపీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు మేము చేయాల్సిన ప్రయత్నమంతా చేశాం. పూర్తి ఏఫర్ట్స్ పెట్టాం. కానీ కేంద్రమే ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి తప్పించుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. 25ఎంపీ సీట్లు మాకివ్వండి కేంద్రంలో అధికారంలో ఎవరున్నా ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రజలను నమ్మించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల సమయంలో చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా సాధించకపోవడంతో ఇది వైసీపీకి వచ్చే ఎన్నికల్లో…

Read More

ఇట్లా అవునని ఎవరనుకున్నారు..? ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ విలీనం అయ్యాక  తెలంగాణ దగా పడుతున్న స్థితిని చూసి కాళోజి తన ఆవేదనను ఇలా వ్యక్తపరిచాడు. నాడు తెలంగాణ ఏపీలో విలీనం కావడంపై అయన ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేసి ఉన్నారో… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కూడా నాడు ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రాసంగికత ఏర్పడి ఉన్నది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పౌరుల హక్కులను పాలకులు నిసిగ్గుగా అణచివేస్తుంటే… కాళోజి మాటలు గుర్తుకు రాకుండా ఎలా ఉంటాయి..? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇలా జరుగునని ఎవరనుకున్నారని ఆవేదన చెందకుండా ఎలా ఉంటాం.? ఉద్యమకారుడే పాలనాధిపతి అయ్యాడని తెలిసి సంతోషించినం. నక్సలైట్ ఎజెండా మాదని మాట్లాడితే..హక్కుల అణచివేతలు ఉండవని సంబురపడినం. ప్రజాస్వామ్య పరిరక్షణలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందని విశ్వసించినం. కానీ నమ్మిన వ్యక్తే తెలంగాణ ప్రజలను తడి గుడ్డతో గొంతు కోస్తున్నాడు. ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా…

Read More

క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఫీర్జాదిగూడలోనీ క్యూ ఛానెల్ లోకి టాస్క్ ఫోర్స్ పోలీసులు చొరబడి మల్లన్నను ఎత్తుకెళ్లారు. అయితే, మల్లన్నను ఏ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు..? ఎందుకు, ఏకేసులో అరెస్ట్ చేశారనే విషయాలను పోలీసులు తెలియజేయలేదు. లిక్కర్ స్కాం…పేపర్ లీకేజీ ఇష్యూలపై కల్వకుంట్ల ఫ్యామిలీకి వ్యతిరేకంగా మల్లన్న వార్త వ్యాఖ్యానాలు చేస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. బీఆర్ఎస్ పెద్దలు కూడా మల్లన్న కథనాలపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసి ఉండొచ్చునని చెబుతున్నారు. మొన్నే క్యూ న్యూస్ ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.ముఖాలకు మాస్క్ లు ధరించి ఆఫీసులోకి చొరబడి నానా భీభత్సం సృష్టించారు.మంత్రి మల్లారెడ్డి అనుచరులే కేటీఆర్ సూచన మేరకు క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి చేశారని మల్లన్న ఆరోపించారు. ఈ విషయమై…

Read More

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విక్టరీతో టీడీపీ ఫుల్ జోష్ లో ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓ స్థానం టీడీపీ ఖాతాలో పడుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి అసెంబ్లీలో 19మంది సభ్యుల బలముంది. ఇంకో నలుగురు ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిస్తే టీడీపీ నుంచి మరొకరు మండలికి వెళ్తారు. ఇలా జరిగితేనే మరో ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంటుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు సరిపడ బలం లేకపోయినా ఖచ్చితంగా గెలుపు మాదేనని టీడీపీ బలగుద్ది మరీ చెబుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధను టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు చంద్రబాబు. బీసీ మహిళా అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. ఈమె ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే 23మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ ఆ పార్టీకి 19మంది నేతల బలమే ఉంది. అయినా మీరు చూస్తుండండి..అనురాధ అనూహ్య విజయం సాధిస్తారని టీడీపీ…

Read More

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. రచ్చబండ పేరుతో నిత్యం మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ వైసీపీ సర్కార్ ను కడిగి పారేస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పథకంలోనూ లోపాలను ఎత్తిచూపుతూ వైసీపీకి పంటికింది రాయిలా మారారు. దీంతో రఘురామను అణగదొక్కాలని ఆ మధ్య రాజ్యద్రోహం నేరం మోపి జైలుపాలు చేసింది. సీఐడీ విచారణలో తనను అధికారులు కొట్టారని జగన్ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. నరసాపురం ఎంపీ రఘురామ వైసీపీతో అనుబంధాన్ని తెంచుకున్నారు. మళ్ళీ ఆయనకు వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఆయన మాత్రం మరోసారి పోటీ చేయాలనుకుంటున్నారు. అది వైసీపీ నుంచి కాదు. టీడీపీ టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. తనను తీవ్రంగా హింసించిన వైసీపీని ఓడించి సత్తా చాటాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకునేలా మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆధారాలు లభ్యం కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొమ్మిది ఫోన్లను ధ్వంసం చేశారని,మార్చారని ఈడీ చేస్తోన్న ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు. తాను వాడిన ఫోన్లను ధ్వంసం చేయలేదని వాటిని విచారణకు హాజరయ్యే ముందు మీడియాకు చూపించారు. ఇంటి ఎదుట ఓసారి ఈ ఫోన్లను ప్రదర్శించిన కవిత ఈడీ ఆఫీసు ఎదుట కూడా ఫోన్లను చూపించారు. వాస్తవానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై వస్తోన్న ఆరోపణలను ఖండించాలని అనుకున్నారు కవిత. కానీ విచారణకు హాజరయ్యే ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం తలనొప్పి అవుతుందని భావించి విచారణ అధికారికి లేఖ రాసి దాన్ని మీడియాకు లీక్ చేశారు. దర్యాప్తు అధికారులు దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని…ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం ప్రైవసీకి భంగం కలించడం కాదా? నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణకు ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది…

Read More

వైసీపీ అంటే ఐ ప్యాక్ అనుకుంటున్నారు జగన్. ఆయన ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్న మొదట సంప్రదించేది ఐ ప్యాక్ నే. నేతలు ఏమనుకుకుంటున్నారు..? క్యాడర్ ఏం కోరుకుంటుంది..? అనేది అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల విషయంలోనూ పార్టీ నేతలతో సమీక్ష చేయకుండా ఐ ప్యాక్ తో మాట్లాడారు. ఎందుకిలా నిరుత్సాహపరిచే ఫలితాలు వచ్చాయని ప్రశ్నించారు. ఈ విషయాలను ఎవరో కాదు ఐ ప్యాకే లీక్ చేస్తుండటం గమనార్హం. 2019లో వైసీపీకి దక్కిన విజయం పూర్తిగా ఐ ప్యాక్ దేనని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. తన పాదయాత్రకు కూడా ఆ క్రెడిట్ ఇవ్వదలుచుకోవదం లేదు. అందుకే వైసీపీలో అంత ఐ ప్యాకే. ఐ ప్యాక్ ఏం చెబితే అదే జరుగుతోంది. వారిచ్చే సలహాలు, సూచనలను అమలు చేస్తారు. వారిచ్చే సలహాలు, సూచనలతో ఏం జరుగుతుందని కూడా ఆలోచించరు. ఇటీవల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని…

Read More