Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొదట ఆయనను ఎక్కడికి.. ఎవరు తీసుకెళ్లారో స్పష్టత ఇవ్వలేదు. మఫ్టీలో వచ్చిన పోలీసులే మల్లన్నను తీసుకెళ్ళారని తరువాత స్పష్టత వచ్చింది. 24గంటల తరువాత పోలీసులు మల్లన్నను కోర్టులో ప్రవేశపెట్టారు. భర్తకు ఏమైందో తెలియక తీన్మార్ మల్లన్న భార్య పోలీసు స్టేషన్ ల చుట్టూ తిరిగింది. ఇద్దరు చంటి బిడ్డలను ఏసుకొని పోలిసులు ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి వెళ్లి తన భర్త ఎక్కడున్నాడో వివరాలు తెలుసుకుంది. పోలీసులు తప్పుడు వివరాలు చెప్పడంతో మల్లన్న భార్య మూడు పోలిసుల స్టేషన్ల చుట్టూ తిరిగినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే తన భార్యను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారంటూ మల్లన్న భార్య మమత రాజ్ భవన్ కు వెళ్ళారు. అక్కడ గవర్నర్ తమిళిసై ను కలిశారు. ఈ సందర్భంగా మమత వద్దనున్న పాపను చూసి గవర్నర్ చలించిపోయారు. చిన్న పాప ఆరోగ్య పరిస్థితి…
టీఎస్‌పీఎస్సీ లీక్ వ్యవహారం తెలంగాణ సర్కార్ ను కుదిపేస్తోంది. ఈ పేపర్ లీక్ తో మంత్రి కేటీఆర్ కు సంబంధం ఉందని కాంగ్రెస్ , బీజేపీ రాష్ట్ర అద్యక్షులు ఆరోపిస్తున్నారు. కంప్యూటర్ల నిర్వహణ బాధ్యత ఐటీ శాఖదే కాబట్టి ఆ శాఖ మంత్రి కేటీఆర్ ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ పేషి నుంచే పేపర్ లీక్ జరిగిందని తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని రేవంత్ ఆరోపిస్తుండగా… బండి సంజయ్ ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే పనిని సర్కార్ ముంగిట వేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ పేపర్ లీకేజీలో దర్యాప్తు చేస్తోన్న సిట్ చేత కేసులు పెట్టించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పెద్దలు బిజీగా ఉన్నారు. గురువారం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన సిట్ శుక్రవారం బండి సంజయ్ ను విచారించనుంది. ఆ తర్వాత వాళ్ళు చేసిన రాజకీయ ఆరోపణలపై కేసులు పెడుతారనే ప్రచారం…
తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ పై నిరుద్యోగ మహా దీక్షకు రేవంత్ హాజరు కానున్న నేపథ్యంలో జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓయూ జేఏసి నేతృత్వంలో శుక్రవారం, శనివారాల్లో రెండురోజులపాటు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో నిరుద్యోగ మహా దీక్ష జరగనుంది. ఈ దీక్షకు ముఖ్య అతిథిగా రేవంత్ సంఘీభావం తెలపనున్నారు. అయితే ఈ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేవంత్ మాత్రం దీక్షకు హాజరై తీరుతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రేవంత్ ఇంటి ఎదుట పోలీసులు భారీగా మొహరించారు. రేవంత్ రెడ్డి ఓయూకు వెళ్ళకుండా ఆయన బయటకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్ళే దారులన్నీ క్లోజ్ చేశారు. రేవంత్ ను ఎవరూ కలవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ…
ఏపీ టీడీపీ నేతలు చెప్పిందే జరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. ఆ పార్టీకి సాంకేతికంగా 23ఓట్లు ఉన్నాయి. అనురాధకు కూడా 23ఓట్లు వచ్చాయి. వాస్తవానికి 22ఓట్లు వస్తే అభ్యర్థి విజయం సాధిస్తారు. కానీ అనురాధకు ఓ ఓటు ఎక్కువే వచ్చింది. దాంతో ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీడీపీ తరుఫున 23మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అందులో వైసీపీలోకి నలుగురు ఫిరాయించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారు. ఈ లెక్కన చూస్తె టీడీపీకి 19ఓట్లు మాత్రమే ఉన్నాయి. మరి ఇంకో నాలుగు ఓట్లు ఎలా వచ్చాయంటే.. వైసీపీ నుంచే నలుగురు ఎవరో క్రాస్ ఓటింగ్ చేశారన్నది అర్థం అవుతుంది. వారిలో ఇద్దరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , ఆనం రాంనారాయణరెడ్డిలు కాగ మరో ఇద్దరు ఎవరు అనేది ఎవరికీ తెలియడం లేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైసీపీ క్యాంప్ రాజకీయాలు…
ప్రధాని నరేంద్ర మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి భేటీ అయ్యారు. 20నిమిషాలపాటు వీరి సమావేశం కొనసాగింది. తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతోన్న వరుస పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని కేవలం పెండింగ్ పనులు, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే మోడీని కలిసినట్లు వెంకట్ రెడ్డి చెప్పారు. ప్రధాని బిజీ, బిజీగా ఉంటారు. సొంత పార్టీ ఎంపీలకే ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం కష్టం. అలాంటిది ప్రత్యర్ధి పార్టీ నేత వెంకట్ రెడ్డికి అడగ్గానే అపాయింట్ మెంట్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. ప్రధానితో భేటీ ముగిసాక మీడియాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఘట్కేసర్ నుంచి యాదగిరిగుట్టకు సమీపంలోని రాయగిరి వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.120 కోట్ల నిధులు కేటాయించలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.…
బీజేపీలో ఆశించిన ప్రాధాన్యత దక్కకపోవడంతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారా..? పార్టీ నాయకత్వం తన సేవలను ఏమాత్రం వినియోగించుకోవడం లేదని అవమానంగా ఫీల్ అవుతోన్న కొండా ఇది తనకు అవమానకరమని భావిస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. బీఆర్ఎస్ ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్ వైఖరి నచ్చక ముందస్తు ఎన్నికల సమయంలో పార్టీ మారారు. కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ఉత్తమ్ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందని.. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉద్యమించడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆ తరువాత కమలం పార్టీలోకి జంప్ చేశారు. బీజేపీలో చేరిన తరువాత కొన్నాళ్ళు యాక్టివ్ గా పని చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆ తరువాత బండి సంజయ్ పట్టించుకోవడం లేదని సైలెంట్ అయ్యారు. దాంతో బండి సంజయ్ పై కొండా గుర్రుగా ఉన్నారని ఆయన…
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో ఈ ఎన్నికపై గట్టిగా ఫోకస్ చేయాల్సి వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మూడు స్థానాలు టీడీపీ ఖాతాలో పడటంతో సైకిల్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. అదే ఊపులో ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లోనూ ఓ స్థానం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థిని బరిలో నిలిపారు. సంఖ్యా బలం తక్కువే ఉన్నా వైసీపీలో అసంతృప్తులు ఉన్నారని వారు ఓటు వేస్తారని నమ్మకంతో టీడీపీ అభ్యర్థిని పోటీకి దించింది. గురువారం ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 175మంది ఎమ్మెల్యేలకు గాను 174ఓట్లు పోల్ అయ్యాయి. ఒక్కరు మాత్రమే ఇంకా ఓటు వేయలేదు. వైసీపీ ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు ఇంకా ఓటు వేయలేదు. ఒక్క ఓటు పడకపోయిన అది వైసీపీకి ఇబ్బంది అవుతుంది. టీడీపీ గెలుపుకు దోహదం చేస్తుంది. అందుకే ఆయన కోసం ఏకంగా…
ప్రధాని మోడీ నుద్దేశించి గతంలో రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు కీలక ములుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పరువునష్టం దావాను ఎదుర్కొన్న రాహుల్ గాంధీని దోషిగా గుర్తిస్తూ సూరత్ కోర్టు తీర్పు వెలువరించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద ఈ శిక్ష విధించింది. ఈ సెక్షన్ల కింద గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష విధించే అవకాశం ఉంటుంది. 2019లో యూపీలో జరిగిన భారీ వహిరంగా సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సభలో ప్రధాని మోడీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. . దేశంలో ఉన్న దొంగలంతా మోడీ ఇంటి పేరుతోనే ఉన్నారన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన లలిత్ మోడీ, నీరవ్ మోడీలను ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై గుజరాత్ కు చెందిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావాను వేశారు. అప్పటి నుంచి కోర్టులో…
టీఎస్ పీస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం అచ్చం మధ్యప్రదేశ్ లో వెలుగుచూసిన వ్యాపం కుంభకోణం తరహాలోనే ఉంది. వ్యాపం అనేది మధ్యప్రదేశ్ లో వ్యావసాయిక్ పరీక్షా మండల్ అనే పేరుగల వృత్తి విద్యా కోర్సుల పరీక్ష నిర్వహణ బోర్డు. ఈ సంస్థ మధ్యప్రదేశ్ లో నిర్వహించిన పరీక్షల్లో భారీగా అవకతవకలు జరగగా…టీఎస్ పీస్సీ తెలంగాణలో నిర్వహించిన పరీక్షల్లోనూ అదే తంతు కొనసాగినట్లు ఇటీవల వెల్లడి అయింది. అక్కడ రాజకీయ నాయకులు , ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఈ వ్యవహారంలో సంబంధముండగా… తెలంగాణ విషయానికి వస్తే ఈ పేపర్ లీక్ తో రాజకీయ నాయకులకు, టీఎస్ పీస్సీ ఉద్యోగులకు సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అనర్హులైనవారు మధ్యవర్తుల ద్వారా రాజకీయ నాయకులకు, వ్యాపం ఉద్యోగులకు లంచమిచ్చి పెద్ద ర్యాంకులు తెచ్చుకోవడం మధ్యప్రదేశ్ లో 90వ దశకంలో బయటపడింది. వ్యాపం నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు కేసులు నమోదు అయ్యాయి. 2000వ సంవత్సరంలో మొదటి ఎఫ్ఐఆర్…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా..? నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నా పెడచెవిన పెడుతున్న జగన్ కు తాజాగా ఝలక్ ఇచ్చేందుకు సిద్డమయ్యారా..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇచ్చి జగన్ పీచమణచాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చూస్తున్నారా..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదేనని ధీమాగా చెబుతున్నా టీడీపీ నేతలకు టచ్ లో 16మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. గురువారం ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడుగురు వైసీపీ, ఒకరు టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఈ క్రమంలో పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నేతలు… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని ధీమా…